AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Naxal leader Sudhakar: మళ్లీ దద్దరిల్లిన దండకారణ్యం.. మావోయిస్టు పార్టీ అగ్రనేత సుధాకర్‌ మృతి!

ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరంకి చెందిన సుధాకర్‌ అలియాస్‌ సింహాచలం.. 40 ఏళ్లుగా మావోయిస్టు ఉద్యమంలో కీలకంగా పని చేస్తున్నారు. బీజాపూర్‌ జాతీయపార్కు వద్ద సీనియర్ నక్సల్ క్యాడర్లు ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. అనంతరం గురువారం తెల్లవారు జామునుంచి వరుస కాల్పులు నిర్వహించాయి..

Naxal leader Sudhakar: మళ్లీ దద్దరిల్లిన దండకారణ్యం.. మావోయిస్టు పార్టీ అగ్రనేత సుధాకర్‌ మృతి!
Naxal Leader Sudhakar
Srilakshmi C
|

Updated on: Jun 05, 2025 | 4:31 PM

Share

ఛత్తీస్‌గఢ్‌, జూన్ 5: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో గురువారం (జూన్‌ 5) మారోమారు భద్రతా దళాలు ఎన్‌కౌంటర్‌ నిర్వహించాయి. ఈ దాడిలో మావోయిస్టు పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్‌ మృతి చెందారు. ఆయనపై రూ.40 లక్షల రివార్డు ఉంది. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరంకి చెందిన సుధాకర్‌ అలియాస్‌ సింహాచలం.. 40 ఏళ్లుగా మావోయిస్టు ఉద్యమంలో కీలకంగా పని చేస్తున్నారు. బీజాపూర్‌ జాతీయపార్కు వద్ద సీనియర్ నక్సల్ క్యాడర్లు ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. అనంతరం గురువారం ఉదయం ఈ ఆపరేషన్‌ జరిగింది. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG), స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించింది. ఉమ్మడి దళాలు, నక్సల్స్ మధ్య ఈ తెల్లవారుజాము నుంచి కాల్పులు జరిగాయి.

గత నెలలో నంబల కేశవ్ రావు కూడా..

ఈ ఎన్‌కౌంటర్‌లో మోస్ట్ వాంటెడ్ నక్సల్, కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్‌ను భద్రతా దళాలు కాల్చి చంపాయి. మరోవైపు మే నెలలో ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో బసవరాజు అలియాస్‌ నంబల కేశవ్ రావు మృతి చెందారు. నక్సల్స్ బలమైన కోటగా పేరుగాంచిన దట్టమైన అబుజ్మద్ అడవులలో జిల్లా రిజర్వ్ గార్డ్ (DRG) నేతృత్వంలో జరిగిన ఉమ్మడి ఆపరేషన్‌లో మృతి చెందిన 30 మంది నక్సల్స్‌లో ఆయన ఒకరు. నిషేధిత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) ప్రధాన కార్యదర్శి నంబాల కేశవ రావు 1970ల చివరి నుంచి నక్సలైట్ ఉద్యమంలో భాగంగా ఉన్నారు. అత్యంత భయంకరమైన వ్యూహకర్తలలో ఆయన ఒకరు. కేశవరావుపై రూ. 1.5 కోట్ల రివార్డు కూడా ఉంది.

ఇవి కూడా చదవండి

అనేక రాష్ట్రాలలో భద్రతా దళాలపై పలుమార్లు ప్రాణాంతక దాడులు జరిపారు. ఆయనను భద్రతా దళాలు కాల్చి చంపడంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ ఆపరేషన్‌ను నక్సలిజాన్ని నిర్మూలించే పోరాటంలో ఒక మైలురాయిగా అభివర్ణించారు. నక్సల్ ఉద్యమానికి వెన్నెముక అయిన నంబాల కేశవ్ రావు మృతి నక్సల్‌ ఉద్యమానికి పెద్ద దెబ్బని చెప్పాలి. ఇక ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో సోమవారం 16 మంది నక్సలైట్లు లొంగిపోయారు. వీరిలో ఆరుగురు రూ. 25 లక్షల రివార్డు అందుకున్నారని పోలీసులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.