AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: ఫ్రెండ్‌ను కలవడానికి వెళ్లి 21వ అంతస్తు నుంచి దూకేసిన లేడీ టెకీ.. మిస్టరీగా మారిన సూసైడ్ కేసు!

స్నేహితురాలిని కలవడానికి ఓ అపార్ట్ మెంట్ కు వెళ్లిన లేడీ టెకీ అనూహ్యంగా బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఇందుకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..

Watch Video: ఫ్రెండ్‌ను కలవడానికి వెళ్లి 21వ అంతస్తు నుంచి దూకేసిన లేడీ టెకీ.. మిస్టరీగా మారిన సూసైడ్ కేసు!
Woman Jumps To Death From 21st Floor
Srilakshmi C
|

Updated on: Jun 06, 2025 | 6:39 PM

Share

పూణె, జూన్‌ 6: ఓ అపార్ట్‌మెంట్ 21వ అంతస్తు నుంచి దూకి 25 ఏళ్ల లేడీ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ సంఘటన మే 31న పూణెలోని పూణెలోని హింజావాడి ప్రాంతంలో చోటు చేసుకుంది. మృతురాలిని అభిలాషా భౌసాహెబ్ కోతింభిరే (25) అనే యువతిగా గుర్తించారు. తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో స్నేహితురాలు నివసిస్తున్న అపార్ట్‌మెంట్‌కు చేరుకుని, అక్కడి 21 అంతస్తు నుంచి కిందకి దూకింది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె ద్విచక్ర వాహనంపై ప్రయాణించి క్రౌన్ గ్రీన్ సొసైటీకి చేరుకుంది. ఆ తర్వాత తన స్నేహితురాలి అపార్ట్‌మెంట్‌కు వెళ్లేందుకు లిఫ్ట్‌లోకి వెళ్లింది. అనంతరం ఆమె 21వ అంతస్తుకి చేరుకుంది. అయితే అక్కడ తన స్నేహితురాలిని కలవకుండానే.. ఉన్నట్లుండి అపార్ట్‌మెంట్ నుంచి కిందకి దూకేసింది. ఆమె కిందకి దూకడానికి కొద్ది నిమిషాల ముందు అపార్ట్‌మెంట్‌ సీసీటీవీలో రికార్డైన దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ వీడియోలో యువతి ముఖానికి స్కార్ఫ్‌ కట్టుకుని ఉంది.

ఆత్మహత్యకు ముందు అభిలాషా.. సూసైడ్‌ నోట్‌ కూడా రాసింది. అందులో ‘నేను బతకడం మానేశాను. నాకు ఇక బతకాలని లేదు’ అని రాసుకుంది. ఆ నోట్‌లో తన తల్లిదండ్రులు, స్నేహితులకు ఈ తీవ్రమైన నిర్ణయం తీసుకున్నందుకు క్షమాపణలు కూడా చెప్పింది. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పింప్రి చించ్వాడ్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. దర్యాప్తులో అభిలాష చివరిసారిగా రాత్రి 1 గంట సమయంలో అహల్యానగర్‌లో మరో స్నేహితురాలో కలిసి నివాసం ఉంటున్న ఫ్లాట్‌లో కనిపించినట్లు పోలీసులకు సమాచారం అందింది. తరువాత బాత్రూమ్ గోడ, మంచం, నాప్కిన్ పై రక్తపు మరకలు కనిపించాయి. కానీ ఆ మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకు ఆమె గదికి తిరిగి రాకపోవడంతో గదిలోని అభిలాష స్నేహితురాలు కంగారు పడింది. వెంటనే అభిలాషకు ఫోన్‌ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. కొద్ది సేపటిక అభిలాష సూసైడ్‌ చేసుకున్నట్లు పోలీసుల నుంచి ఫోన్‌ కాల్‌ వచ్చింది.

ఇవి కూడా చదవండి

తదుపరి దర్యాప్తు కోసం పోలీసులు ఆమె మొబైల్ ఫోన్‌తో పాటు రక్తపు మరకలతో ఉన్న వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. బాహ్య కారణాలపై ఎటువంటి అనుమానం లేనప్పటికీ, ఆమె మరణానికి దారితీసిన పరిస్థితులు ఇంకా తెలియరాలేదు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.