AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: చిన్నారి అత్యాచార ఘటనలో అంతిమ తీర్పు.. చీకట్లో మృగాడి ఎన్‌కౌంటర్‌! వీడియో చూశారా..

రెండున్నరేళ్ల చిన్నారిని ఓ మృగాడు కిడ్నాప్‌ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై ఫిర్యాదు అందింన 24 గంటల్లోనే పోలీసులు కేసు నమోదు చేయడం.. నిందితుడిని ఎన్‌కౌంటర్‌లో లేపేయడం రెండూ జరిగిపోయాయి. ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో ఈ సంఘటన శుక్రవారం (జూన్‌ 6) వెలుగులోకి వచ్చింది..

Watch Video: చిన్నారి అత్యాచార ఘటనలో అంతిమ తీర్పు.. చీకట్లో మృగాడి ఎన్‌కౌంటర్‌! వీడియో చూశారా..
Lucknow Toddler Rape Case
Srilakshmi C
|

Updated on: Jun 06, 2025 | 4:59 PM

Share

లక్నో, జూన్‌ 6: ఉత్తరప్రదేశ్‌లోని అలంబాగ్ ప్రాంతంలోని చందానగర్ మెట్రో స్టేషన్ సమీపంలో ఓ కుటుంబం నివాసం ఉంటోంది. వీరి రెండున్నర ఏళ్ల బాలిక గురువారం ఉదయం అదృశ్యమైంది. చుట్టుపక్కల వెతికిన తల్లిదండ్రులకు మెట్రో వంతెన కింద అపస్మారక స్థితిలో చిన్నారి పడి ఉండటం గమనించారు. వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. చిన్నారిపై లైంగిక దాడి జరిగినట్లు నిర్ధారించారు.

దీంతో బాధిత బాలిక తల్లిదండ్రులు అలంబాగ్ పోలీస్ స్టేషన్‌లో పోలీసు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన 5 పోలీసు బృందాలు దర్యాప్తు ప్రారంభించాయి. సంఘటనా స్థలానికి చేరుకుని.. అక్కడి సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. నిందితుడిని దీపక్ వర్మ (26)గా పోలీసులు గుర్తించారు. నిందితుడు వినియోగించిన స్కూటర్‌ నంబర్‌ ఆధారంగా వివరాలు సేకరించి, అతడిపై రూ. లక్ష రివార్డు ప్రకటించారు. గురువారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఓ వ్యక్తి తెల్లటి స్కూటర్‌పై అక్కడికి వచ్చాడని, మెట్రో స్టేషన్ లిఫ్ట్ వెనుకకు బాలికను తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సెంట్రల్ జోన్) ఆశిష్ శ్రీవాస్తవ తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఈ దారుణ ఘటన జరిగిన 24 గంటల్లోపు నిందితుడు శుక్రవారం తెల్లవారుజామున అలంబాగ్ కంటోన్మెంట్‌లోని దేవి ఖేడా ప్రాంతంలో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందిందని తెలిపారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు లొంగిపోవాలని మొదట ఆదేశించారు. అయితే నిందితుడు పారిపోయేందుకు పోలీసులపై కాల్పులు జరిపాడు. దీంతో పోలీసులు ఎదురు కాల్పులు జరిపినట్లు పోలీస్‌ అధికారి తెలిపారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన నిందితుడ్ని లోక్‌బంధు ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మరణించినట్లు చెప్పారు. తరచూ నేరాలకు పాల్పడే దీపక్‌ వర్మపై ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లలో క్రిమినల్ కేసులు నమోదైనట్లు ఆశిష్ శ్రీవాస్తవ వెల్లడించారు. బాధిత చిన్నారి ప్రస్తుతం కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీలో చికిత్స పొందుతోందని, బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆయన చెప్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..