Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandrababu: అన్నీ అబ్జర్వ్‌ చేస్తున్నా.. ఎమ్మెల్యేలకు చంద్రబాబు స్వీట్ వార్నింగ్

Andhra Pradesh: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదైనా సందర్భంగా జూన్ 12వ తేదీన అమరావతిలో 2 వేల మందితో ఓ కార్యక్రమం నిర్వహించాలన్నారు. ఏడాదిలో ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలకు వివరించాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. అలాగే పార్టీ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా..

Chandrababu: అన్నీ అబ్జర్వ్‌ చేస్తున్నా.. ఎమ్మెల్యేలకు చంద్రబాబు స్వీట్ వార్నింగ్
Follow us
Subhash Goud

|

Updated on: Jun 08, 2025 | 8:07 AM

చూస్తున్నా.. అన్నీ అబ్జర్వ్‌ చేస్తున్నా అంటూ ఎమ్మెల్యేలకు స్వీట్ వార్నింగ్‌ ఇచ్చారు సీఎం చంద్రబాబు. వన్‌ టైమ్‌ ఎమ్మెల్యేలుగా మిగిలిపోవద్దంటూ మరోసారి హెచ్చరించారు. ఎవరెవరు ఏం చేస్తున్నారో తన దగ్గర రిపోర్ట్‌ ఉందన్న ఆయన.. సంక్షేమమే అజెండా జనాల్లోకి వెళ్తే అద్భుత భవిష్యత్‌ ఉంటుందన్నారు. ఓవర్‌ కాన్ఫిడెన్స్ వద్దు.. ఓటేసిన ప్రజల సంక్షేమమే ముద్దు అంటూ ఎమ్మెల్యేలను మరోసారి హెచ్చరించారు సీఎం చంద్రబాబు. ఎవ్వరూ ఎట్టిపరిస్థితుల్లో తప్పు చేయొద్దు.. కాదు కూడదని దారి తప్పితే కొరడా తప్పదన్న సంకేతాలిచ్చారు. టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించిన ఆయన.. హెచ్చరికలతో పాటు కీలక సూచనలు-సలహాలిచ్చారు. అంతేకాదు.. ప్రతి ఆరు నెలలకోసారి ఎంపీలు, ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే చేయిస్తానన్నారు. రాజీలేకుండా ప్రజాసేవలో పాల్గొన్న వాళ్లకు మున్ముందు పార్టీ అద్భుత అవకాశాలు కల్పిస్తుందన్నారు. మనం చేసే ప్రతిపనిని ప్రజలు గమనిస్తున్నారన్న విషయాన్ని మరిచిపోవద్దన్నారు చంద్రబాబు.

మెజారిటీ ఎమ్మెల్యేలు, ఎంపీలు మంచిగా పనిచేస్తున్నారన్నారు చంద్రబాబు. ఒకరిద్దరు వల్ల అక్కడక్కడా కొత్త నష్టం జరుగుతోందని అభిప్రాయపడ్డారు. త్వరలోనే ఒక్కో ఎమ్మెల్యేతో ఫేస్‌ టూ ఫేస్‌ మీటింగులు ఉంటాయని స్పష్టం చేశారు. ప్రతిఒక్కరూ పనితీరును ఎప్పటికిప్పుడు సమీక్షించుకోవాలన్న సీఎం.. మంచిచెడులు తెలుసుకుని బాధ్యతగా పనిచేయాలని నేతలకు సూచించారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదైనా సందర్భంగా జూన్ 12వ తేదీన అమరావతిలో 2 వేల మందితో ఓ కార్యక్రమం నిర్వహించాలన్నారు. ఏడాదిలో ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలకు వివరించాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. అలాగే పార్టీ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రతిఒక్కరూ బాధ్యత తీసుకోవాలన్నారు. ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలు అందిస్తున్న విషయం ప్రజలు తెలిసేలా చేయాలన్నారు. వచ్చే నెల నాటికి పార్టీలోని అన్ని కమిటీల నియామకం పూర్తి కావాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న యోగా డేను విజయవంతం చేయాలన్నారు చంద్రబాబు. మొత్తంగా.. సలహాలు, సూచనలే కాదు హెచ్చరికలతోనూ సాగింది సీఎం టెలికాన్ఫరెన్స్.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: WhatsApp Ban: వాట్సాప్‌ను బ్యాన్‌ చేసిన 6 దేశాలు ఏవో తెలుసా..? కారణం ఏంటి?