AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mukesh Ambani: చరిత్రలోనే అతిపెద్ద విరాళం.. రూ.151 కోట్లు ఇచ్చిన ముఖేష్‌ అంబానీ..!

Mukesh Ambani: భారతదేశం, ఆసియాలో అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ ఏదీ చేసినా అది ప్రత్యేకమే. చిన్న వ్యాపారం నుంచి మొదలు పెట్టిన అంబానీ.. అత్యంత ధనవంతుల జాబితాలో నిలిచారు. ఎంతో మందికి విరాళాలు కూడా అందించారు. ఇప్పుడు చరిత్రలో అతిపెద్ద విరాళాన్ని అందించారు. ఏకంగా 151 కోట్ల రూపాయల విరాళం అందించారు. మరి ఎవరికి అందించారు? ఎందుకు అందించారో తెలుసుకుందాం..

Mukesh Ambani: చరిత్రలోనే అతిపెద్ద విరాళం.. రూ.151 కోట్లు ఇచ్చిన ముఖేష్‌ అంబానీ..!
Subhash Goud
|

Updated on: Jun 07, 2025 | 12:50 PM

Share

భారతదేశం, ఆసియాలో అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ICT)కి రూ.151 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఇది చరిత్రలో ఇది అతిపెద్ద విరాళం. దేశంలోని అత్యంత విలువైన కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ఈ సంస్థ నుండి చదువుకున్నారు. ICTని గతంలో యూనివర్సిటీ డిపార్ట్‌మెంట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (UDCT) అని పిలిచేవారు. దీనిని 1933లో బొంబాయి విశ్వవిద్యాలయం స్థాపించింది. 2008లో దీనికి ఐసీటీ అని పేరు మార్చారు. డీమ్డ్ యూనివర్సిటీ హోదా ఇచ్చారు. అనితా పాటిల్ రాసిన ‘ది డివైన్ సైంటిస్ట్’ పుస్తకం ఆవిష్కరణ సందర్భంగా అంబానీ ICTకి ఈ విరాళాన్ని ప్రకటించారు.

ఈ పుస్తకం పద్మ విభూషణ్ ప్రొఫెసర్ మన్ మోహన్ శర్మ జీవితం ఆధారంగా రూపొందించారు. చాలా మంది ఆయనను భారతీయ కెమికల్ ఇంజనీరింగ్‌లో గొప్ప గురువుగా భావిస్తారు. గురు దక్షిణ గురించి మాట్లాడుతూ.. శర్మ అభ్యర్థన మేరకు అంబానీ ఐసీటీకి రూ.151 కోట్లు విరాళంగా ఇస్తానని ప్రకటించారు. వారు మాకు ఏదైనా చెప్పినప్పుడు, మేము వింటామని అన్నారు. ముఖేష్ మీరు ఐసీటీ కోసం పెద్దగా ఏదైనా చేయాలి అని, అది ప్రొఫెసర్ శర్మ కోసం అని ప్రకటించడానికి నేను సంతోషంగా ఉన్నాను అని అంబానీ అన్నారు.

ఇది కూడా చదవండి: Job: వావ్.. ఉద్యోగం పోగొట్టుకున్న తర్వాత కూడా ప్రభుత్వం జీతం చెల్లిస్తుంది!

ఇవి కూడా చదవండి

UDCT క్యాంపస్‌ను సందర్శించడం ఎల్లప్పుడూ ఒక పవిత్ర ఆలయాన్ని సందర్శించినట్లు అనిపిస్తుందని అంబానీ అన్నారు. ప్రొఫెసర్ శర్మ, నేను మిమ్మల్ని నా అత్యంత గౌరవనీయమైన గురువుగా, నా మార్గదర్శిగా, ప్రేరణకు మూలంగా భావిస్తాను.. శర్మ లాంటి గొప్ప వ్యక్తి జీవితాన్ని రాయడం చాలా కష్టమైన పని అని పాటిల్‌ను కూడా ప్రశంసించారు అంబానీ. తాను IIT – బొంబాయి కంటే UDCTని ఎంచుకున్నాను అని అంబానీ గుర్తు చేసుకున్నారు.

ఇది కూడా చదవండి: Pin Code: ఇక పోస్టల్‌ పిన్‌కోడ్‌కు స్వస్తి.. భారత పోస్టల్ శాఖ కొత్త అడ్రస్సింగ్ వ్యవస్థ

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..