Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Bank Report: భారతదేశంలో భారీగా తగ్గిన పేదరికం.. ప్రపంచ బ్యాంకు నివేదిక

World Bank Report: తీవ్ర పేదరికంలో నివసిస్తున్న ప్రజలు 344.47 మిలియన్ల నుండి కేవలం 75.24 మిలియన్లకు తగ్గారని ప్రపంచ బ్యాంకు తాజా డేటా వెల్లడించింది. అంతర్జాతీయ దారిద్య్ర రేఖ రోజుకు $3.00 ఆధారంగా ప్రపంచ బ్యాంకు అంచనా, గ్రామీణ, పట్టణ..

World Bank Report: భారతదేశంలో భారీగా తగ్గిన పేదరికం.. ప్రపంచ బ్యాంకు నివేదిక
Subhash Goud
|

Updated on: Jun 07, 2025 | 11:54 AM

Share

World Bank Report: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వ హయాంలో భారతదేశం గత దశాబ్దంలో తీవ్ర పేదరికాన్ని తగ్గించడంలో కీలక పురోగతి సాధించింది. 2011-12లో 27.1 శాతంగా ఉన్న పేదరిక రేటు 2022-23లో 5.3 శాతానికి తగ్గిందని తాజా ప్రపంచ బ్యాంకు డేటా వెల్లడించింది. భారతదేశంలో తీవ్ర పేదరిక రేటు గణనీయంగా తగ్గించడంలో మోడీ సర్కార్‌ తీవ్రంగా కృషి చేసింది.

ఇది కూడా చదవండి: Job: వావ్.. ఉద్యోగం పోగొట్టుకున్న తర్వాత కూడా ప్రభుత్వం జీతం చెల్లిస్తుంది!

2022-23లో భారతదేశంలో దాదాపు 75.24 మిలియన్ల మంది తీవ్ర పేదరికంలో జీవిస్తున్నారు. ఇది 2011-12లో 344.47 మిలియన్ల నుండి భారీ తగ్గుదల కనిపించింది. ప్రపంచ బ్యాంకు డేటా ప్రకారం.. దీని అర్థం దాదాపు 11 సంవత్సరాలలో 269 మిలియన్ల మంది వ్యక్తులు తీవ్ర పేదరికం నుండి బయటపడ్డారు.

2011-12లో భారతదేశంలోని అత్యంత పేదరికంలో 65 శాతం మందిని కలిగి ఉన్న ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్ 2022-23 నాటికి భారతదేశంలోని మొత్తం పేదరిక తగ్గింపులో మూడింట రెండు వంతులకు దోహదపడ్డాయి.

తీవ్ర పేదరికంలో నివసిస్తున్న ప్రజలు 344.47 మిలియన్ల నుండి కేవలం 75.24 మిలియన్లకు తగ్గారని ప్రపంచ బ్యాంకు తాజా డేటా వెల్లడించింది. అంతర్జాతీయ దారిద్య్ర రేఖ రోజుకు $3.00 ఆధారంగా ప్రపంచ బ్యాంకు అంచనా, గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో విస్తృత ఆధారిత తగ్గింపును చూపుతుంది. 2017 ధరల ఆధారంగా మునుపటి దారిద్య్రరేఖ అయిన $2.15 రోజువారీ వినియోగం వద్ద, తీవ్ర పేదరికంలో నివసిస్తున్న భారతీయుల వాటా 2.3 శాతం. ఇది ప్రపంచ బ్యాంకు అంచనాల ప్రకారం.. 2011-12లో 16.2 శాతం కంటే గణనీయంగా తక్కువ ఉంది. తాజా డేటా ప్రకారం.. రోజుకు $2.15 దారిద్య్రరేఖకు దిగువన నివసిస్తున్న వారి సంఖ్య 2022లో 33.66 మిలియన్లుగా నమోదైంది. ఇది 2011లో 205.93 మిలియన్ల నుండి తగ్గింది.

గత 11 సంవత్సరాలలో గ్రామీణ తీవ్ర పేదరికం 18.4 శాతం నుండి 2.8 శాతానికి, పట్టణ తీవ్ర పేదరికం 10.7 శాతం నుండి 1.1 శాతానికి తగ్గడంతో ఈ పదునైన తగ్గుదల ఏకరీతిలో గమనించినట్లు డేటా ద్వారా తెలుస్తోంది. అంతేకాకుండా అన్ని రకాల పేదరికాన్ని తగ్గించడంలో భారతదేశం గణనీయమైన పురోగతిని సాధించింది. 2005-06లో 53.8 శాతంగా ఉన్న ఈ పేదరిక సూచిక (MPI) 2019-21 నాటికి 16.4 శాతానికి తగ్గింది. 2022-23లో 15.5 శాతానికి తగ్గిందని డేటా తెలిపింది.

కేంద్రంలో బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం 11 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా పేదరికం నుండి ప్రజల అభ్యున్నతికి కేంద్రం తీసుకున్న విప్లవాత్మక చర్యలు, సాధికారత, మౌలిక సదుపాయాలు, చేరికపై దాని దృష్టిని ప్రధాని మోదీ హైలైట్ చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ప్రధానమంత్రి ఉజ్వల యోజన, జన్ ధన్ యోజన, ఆయుష్మాన్ భారత్ వంటి కార్యక్రమాలు గృహనిర్మాణం, బ్యాంకింగ్, ఆరోగ్య సంరక్షణకు మెరుగుపరిచాయి. ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (DBT), డిజిటల్ చేరిక, బలమైన గ్రామీణ మౌలిక సదుపాయాలు పారదర్శకతను, చివరి మైలు వరకు ప్రయోజనాలను వేగంగా అందించడాన్ని నిర్ధారించాయి. 25 కోట్లకు పైగా ప్రజలు పేదరికాన్ని జయించడంలో సహాయపడ్డాయి.

ఇది కూడా చదవండి: Pin Code: ఇక పోస్టల్‌ పిన్‌కోడ్‌కు స్వస్తి.. భారత పోస్టల్ శాఖ కొత్త అడ్రస్సింగ్ వ్యవస్థ

ఇది కూడా చదవండి: Musk’s Starlink: భారత్‌లో స్టార్ లింక్‌ సేవలకు గ్రీన్‌ సిగ్నల్‌.. కేంద్రం ఆమోదం!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి