Ginger Chicken Masala: నాన్ వెజ్ ప్రియులా.. సండే స్పెషల్ జింజర్ చికెన్ మసాలా కర్రీని చేసుకోండి.. రెసిపీ మీ కోసం..
వర్షాకాలం వచ్చేసింది.. పైగా ఆదివారం దీంతో నాన్ వెజ్ ప్రియులు చికెన్ ను తినాలని కోరుకుంటారు. ఎన్ని రకాల నాన్-వెజ్ వంటలు ఉన్నా.. చికెన్ ప్రియులకు తినేందుకు చాలా రకాల ఆహారాలు రెస్టారెంట్స్ లో అందుబాటులో ఉన్నాయి. అయితే ఇంట్లో అదే స్టైల్ లో చెసుకుని తినడానికి ఇష్టపడుతున్నారు ప్రస్తుతం. ధర ఎక్కువ మాత్రమే కాదు.. ఆహారంలో నాణ్యత లోపం కూడా.. అందుకనే ఇంట్లోనే తమకు నచ్చిన మెచ్చినట్లు చికెన్ ను చేసుకోవాలని కోరుకుంటున్నారు. ఈ నేపధ్యంలో ఈ రోజు జింజర్ చికెన్ మసాలా కర్రీ తయారు చేసే విధానం గురించి ఈ రోజు తెలుసుకుందాం..

Ginger Chicken Masala
నాన్-వెజ్ ప్రియులు రెస్టారెంట్ స్టైల్ లో దొరికే విధంగా చికెన్ తో తయారుచేసిన వివిధ రకాల వంటకాలను ఇంట్లోనే ప్రయత్నిస్తూనే ఉంటారు. చికెన్ తో.. చికెన్ కర్రీ, చికెన్ టిక్కా, చికెన్ బిర్యానీ, చికెన్ కుర్మాను చాలాసార్లు రుచి చూసి ఉంటారు. ఈ నేపధ్యంలో ఈ రోజు మీరు ఇంట్లో చికెన్ తయారు చేసుకోవడానికి ఒక ప్రత్యేకమైన రెసిపీని గురించి ఆలోచిస్తున్నారా..! అయితే మీరు ఎప్పుడైనా స్పైసీగా ఉండే జింజర్ చికెన్ మసాలా కర్రీని ప్రయత్నించారా? ఈ రోజు లంచ్ లేదా డిన్నర్ కోసం దీనీ తయారు చేసుకునేందుకు రెస్టారెంట్ స్టైల్ లో జింజర్ చికెన్ మసాలా రెసిపీని తెలుసుకుందాం.
తయారీకి కావలసిన పదార్థాలు
- కోడి కాళ్ళు – 4
- ఉల్లిపాయ – 100 గ్రాములు సన్నగా తరిగినవి
- తురిమిన కొబ్బరి – 4 టీస్పూన్లు
- అల్లం – 2 టీస్పూన్లు సన్నగా తరిగినది
- వెల్లుల్లి- నాలుగు రెమ్మలు
- కరివేపాకు – 2
- సోంపు గింజలు – 1 టీస్పూన్
- కారం – 1 స్పూన్
- పసుపు – చిటికెడు
- జీలకర్ర – 3 టీస్పూన్లు
- మిరియాలు – 2 టీస్పూన్లు
- నూనె – 100 మి.లీ.
- ఉప్పు – రుచికి సరిపడా
ఇవి కూడా చదవండి
తయారీ విధానం:
- జింజర్ చికెన్ మసాలా కోసం ముందుగా మిక్సీ జార్ తీసుకుని మిరియాలు, జీలకర్ర, సోంపు , తురిమిన కొబ్బరి వేయండి. ఒక్కసారి గ్రైండ్ చేయండి
- తరువాత ఈ మిశ్రమంలో కొంచెం నీరు పోసి బాగా రుబ్బుకుని మెత్తని పేస్ట్ లా చేసుకొండి.
- దీని తరువాత ఒక పాన్ తీసుకుని స్టవ్ మీద పెట్టి.. కొంచెం నూనె వేసి మీడియం మంట మీద వేడి చేయండి.
- తర్వాత తరిగిన ఉల్లిపాయ వేసి లేత గులాబీ రంగు వచ్చేవరకు వేయించండి
- దీని తర్వాత కరివేపాకు, అల్లం, వెల్లుల్లి వేసి వేయించాలి.
- తరువాత తక్కువ మంట మీద 30 నుంచి 60 సెకన్ల పాటు లేదా సువాసన వచ్చే వరకు ఈ మిశ్రమాన్ని ఉడికించండి.
- దీని తర్వాత వేగిన ఉల్లిపాయలకు పసుపు, కారం, ఉప్పు వేసి బాగా కలపాలి.
- తరువాత శుభ్రం చేసుకున్న చికెన్ ముక్కలు, మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ వేసి బాగా కలపండి.
- దీని తరువాత.. ఈ మిశ్రమాన్ని కొంచెం ఉడికించి.. తర్వాత తగినంత నీరు పోసి, ధనియాల పొడి, గరం మసాలా వేసి పెరుగు వేసి బాగా కలపండి.
- తరువాత చికెన్ ఉడికి.. గ్రేవీ మందంగా అయ్యి నూనె పైకి వచ్చేటంత వరకూ తక్కువ మంట మీద ఉడికించండి.
- అంతే రుచికరమైన జింజర్ చికెన్ మసాలా కూర సిద్ధం. చివరిగా కొత్తిమీర వేయండి
- దీన్ని సర్వింగ్ బౌల్‌లోకి తీసుకుని.. కొత్తిమీరతో అలంకరించి వేడి అన్నంతో లేదా చపాతీలతో సర్వ్ చేయండి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..