AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Man Mums: అమ్మాయిలను కౌగలించుకుని డబ్బులు సంపాదిస్తున్న అబ్బాయిలు.. 5 నిమిషానికి రూ. 600 ఎక్కడంటే

ఆ దేశంలో అబ్బాయిలు అమ్మాయిలను కౌగిలించుకుని డబ్బు సంపాదిస్తున్నారు. 5 నిమిషాలు కౌగిలించుకుని రూ. 600 వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రత్యేకమైన ట్రెండ్ ఆ దేశంలో వేగంగా వ్యాపించింది, ఒక విద్యార్థిని తన సోషల్ మీడియా పోస్ట్‌లలో ఒకదానిలో తాను థీసిస్ ఒత్తిడికి చాలా విరిగిపోయానని..ఆ సమయంలో ఎవరినైనా కౌగిలించుకుని రిలాక్స్ అవ్వాలనుకున్నాను.. అందుకోసం డబ్బులు ఖర్చు చేయడానికి కూడా రెడీ అని చెప్పినప్పుడు ఈ ట్రెండ్ వెలుగులోకి వచ్చింది.

Man Mums: అమ్మాయిలను కౌగలించుకుని డబ్బులు సంపాదిస్తున్న అబ్బాయిలు.. 5 నిమిషానికి రూ. 600 ఎక్కడంటే
Man Mums
Surya Kala
|

Updated on: Jun 08, 2025 | 7:06 AM

Share

ప్రస్తుతం పొరుగుదేశం చైనాలో ఒక వింతైన.. ఆసక్తికరమైన ట్రెండ్ ఊపందుకుంది. అక్కడ అమ్మాయిలు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి ‘మ్యాన్ మమ్స్’ సహాయం తీసుకుంటున్నారు. అబ్బాయిలు అమ్మాయిలను కౌగిలించుకున్నందుకు యువత నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ హగ్గింగ్ సేవకు ఆ దేశంలో చాలా డిమాండ్ ఉందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.

సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం.. ‘మ్యాన్ మమ్స్’ అనే పదాన్ని జిమ్‌ చేసి కండరాల శరీరం ఉన్న అబ్బాయిలకు ఉపయోగిస్తారు. యువతులు పని వలన ఒత్తిడితో, చదువు భారం లేదా ఏదైనా ఇతర వ్యక్తిగత సమస్యలతో ఇబ్బంది పడుతున్నప్పుడు.. వాటిని అధిగమించడానికి యువతులు ‘మ్యాన్ మమ్స్’లను నియమించుకుంటారు. ఇలా మగ తల్లుల అవతారం ఎత్తే యువకులు ఒక కౌగిలింతకు 20 నుంచి 50 యువాన్లు (అంటే మన దేశ కరెన్సీలో రూ. 250 నుంచి 600) వసూలు చేస్తారు. ఇలా కౌగిలింత సమయం సాధారణంగా 5 నిమిషాలు. అబ్బాయి.. అమ్మాయిని ఇలా ఐదు నిమిషాల పాటు కౌగలించుకుని ఉంటారు.

ఒక విద్యార్థి తన థీసిస్ ఒత్తిడితో చాలా విరిగిపోయానని అప్పుడు తనకు ఉపశమనం కోసం ఎవరినైనా కౌగిలించుకోవాలనిపించింది.. అందుకోసం ఎంత డబ్బు ఖర్చు చేయడానికి అయినా సిద్ధంగా ఉన్నానని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ ట్రెండ్ వేగంగా వ్యాపించింది. ఆ అమ్మాయి తాను స్కూల్లో ఒకరిని కౌగిలించుకున్నానని.. ఇలా చేసిన చేసిన తర్వాత తనకు చాలా బాగుందని చెప్పింది. ఆ విద్యార్థి పోస్ట్ కొద్దిసేపటికే వైరల్ అయింది. అప్పటి నుంచి కౌగిలింత ద్వారా ఒత్తిడి తగ్గించే సేవలకు డిమాండ్ పెరిగింది.

ఇవి కూడా చదవండి

నివేదిక ప్రకారం ఇలా కౌగలింత సేవలను అందిస్తున్న యువత మెట్రో స్టేషన్ లేదా షాపింగ్ మాల్ వంటి బహిరంగ ప్రదేశాలలో ఉంటారు. అంటే ఈ పురుషుల తల్లులు’ ఇలాంటి ప్రదేశాల్లో ఉంటున్నారు. చాలా సార్లు అమ్మాయిలు వారిని కౌగిలించుకుని తమ మనసులోని బాధని పంచుకుంటున్నారు. ఇలా చేయడం వలన యువతుల మనసులోని భారాన్ని కూడా తగ్గిస్తుంది. అమ్మాయిలు .. అబ్బాయిల శరీరాకృతి, మాట్లాడే విధానం, ప్రవర్తన, రూపాన్ని బట్టి ‘మ్యాన్ మమ్స్’ ను ఎంచుకుంటారు. ఇరువురి మధ్య నిర్ణయం జరిగిన తర్వాత కౌగిలించుకునే స్థలం, సమయం నిర్ణయించబడుతుంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..