- Telugu News Photo Gallery Spiritual photos Famous Krishna Temples in India: A Guide to Visiting Top Shrines
Krishna Temples: మన దేశంలో ప్రముఖ కృష్ణ ఆలయాలు ఇవే.. కన్నయ్య మనువడు కట్టించిన గుడి సహా వీటిని జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే..
హిందువులు పూజించే దేవుళ్లలో శ్రీ కృష్ణుడు ఒకరు. హిందువులు జరుపుకునే పండగలలో శ్రీ కృష్ణ జన్మాష్టమి ఒకటి. శ్రీ మహా విష్ణువు అవతారం అయిన శ్రీ కృష్ణుడికి దేశంలో అనేక ఆలయాలున్నాయి. దేశ విదేశాల్లో భారీ సంఖ్యలో భక్తులున్నారు. భక్తులు భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ శ్రీ కృష్ణ దేవాలయాలున్నాయి. కొన్నిద్వారకలోని ద్వారకాధీశ దేవాలయం, బృందావన్‌లోని బాంకే బిహారీ ఆలయం, గురువాయూర్‌లోని గురువాయూర్ శ్రీకృష్ణ దేవాలయం సహా ఇతర ప్రముఖ ఆలయాలు వివిధ నగరాల్లోని ఇస్కాన్ ఆలయాలున్నాయి. దేశంలోని ప్రసిద్ధ కృష్ణ దేవాలయాల గురించి తెలుసుకుందాం..
Updated on: Jun 01, 2025 | 6:04 PM

ఉడిపి శ్రీ కృష్ణ మఠం: కర్ణాటకలోని ఈ ఆలయం సాంప్రదాయ విగ్రహారాధనతో సహా ప్రత్యేకమైన సంప్రదాయాలు, ఆచారాలకు ప్రసిద్ధి చెందింది. ఇది శ్రీ కృష్ణుని అతి ముఖ్యమైన ఆలయం. ఈ ఉడిపి శ్రీ కృష్ణ మఠంను 13వ శతాబ్దంలో వైష్ణవ సన్యాసి శ్రీ మధ్వాచార్య స్థాపించారు. ఈ ఆలయ కిటికీలో ఉన్న తొమ్మిది రంధ్రాల నుంచి భక్తులు శ్రీకృష్ణుని దర్శిస్తారు. ఈ కిటికీని కనకన కింది అంటారు. ఈ ఆలయంలో కొలువైన శ్రీ కృష్ణుడిని విఠలుడు అని అంటారు. ఇక్కడ జన్మాష్టమి రోజున జరిగే వేడుకలను చూసేందుకు రెండు కళ్ళు చాలవు. దేవాలయం అంతా పువ్వులతో, పండ్లతో, దీపాలతో అలంకరిస్తారు.

పూరి జగన్నాథ్ ఆలయం: ఇక్కడ ఉన్న జగన్నాథ ఆలయం ప్రపంచ ప్రసిద్ధి చెందిన కృష్ణుడి ఆలయం ఉంది. ఈ ఆలయంలో శ్రీ కృష్ణుడు తోబుట్టువులైన బలరాముడు, సుభద్రలతో కలిసి పూజలనుకుంటున్నాడు. ఇక్కడ జరిగే రథయాత్ర ప్రపంచ ప్రసిద్దిగాంచింది. ప్రతి 12 లేదా 19 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ ఈ చెక్క విగ్రహాలను మారుస్తారు. ఈ రథయాత్రలో పాల్గొనడానికి జగన్నాథుని రథాన్ని లాగేందుకు దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు వస్తారు. జగన్నాథుడు, బలరాముని, సుభద్రలు ఈ రథాలను అధిరోదించి అత్త గుడించ ఆలయానికి వెళ్తారు.

ద్వారకాధీష్ దేవాలయం, గుజరాత్: ఈ దేవాలయం గుజరాత్‌లోని అత్యంత ప్రసిద్ధ కృష్ణ దేవాలయం. ఈ ఆలయాన్ని జగత్ మందిర్ అని కూడా అంటారు. గుజరాత్‌లోని ఈ ద్వారకాధీష్ దేవాలయం హిందూ మతానికి సంబంధించిన నాలుగు ధాములలో ఒకటి. ఈ ఆలయం మూడు ధాములలో అత్యంత సుందరమైనది. పవిత్రమైనది. శ్రీకృష్ణ జన్మాష్టమిని అత్యంత ప్రత్యేకంగా జరుపుకునే శ్రీకృష్ణుడి సన్నిధానాల్లో ఇది కూడా ఒకటి. ఈ ఆలయాన్ని 2500 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుని మునిమనవడు వజ్రనాభుడు స్థాపించాడని నమ్ముతారు. శ్రీకృష్ణుడికి అంకితం చేయబడిన అందమైన హిందూ ఆలయాన్ని చూసేందుకు ప్రతి సంవత్సరం లక్షలాది మంది ప్రజలు మధురకు వస్తుంటారు.

ద్వారకాధీశ ఆలయం, మధుర: ఉత్తర భారతదేశంలోని ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని మధుర నగరంలో ఉన్న ఒక అత్యంత ప్రసిద్ధిచెందిన కృష్ణ ఆలయం. ఇక్కడ నల్లని కన్నయ్య విగ్రహాన్ని పూజిస్తారు. నల్ల పాలరాయితో చేసిన కృష్ణుడి ప్రతిమను ద్వారకానాథ్ అని పిలుస్తారు. అతనితో పాటు రాధారాణి తెల్ల పాలరాయి విగ్రహం కూడా ఉంది. ఈ ఆలయం యమునా నది ఒడ్డున ఉన్న జైలు గదిలో ఉంది. శ్రీకృష్ణుని జన్మస్థలమని చెబుతారు. ఇది మహాభారత కాలం నాటిది. ఇక్కడ ప్రధాన దేవత ద్వారకాధీశుడు. ఇది శ్రీకృష్ణుడు మధుర నుంచి ద్వారకకు మారి తన నివాసంగా మార్చుకున్నాడు.

శ్రీ బాంకే బిహారీ ఆలయం, బృందావన్: బాంకే బిహారీ దేవాలయం భారతదేశంలోని ఉత్తర ప్రదేశ్‌లోని మధుర జిల్లా బృందావన్ పట్టణంలో ఉన్న ఒక హిందూ దేవాలయం. శ్రీ కృష్ణుడు మధురలో జన్మించినా.. తన బాల్యమంతా బృందావనంలో గడిపాడు. ఇక్కడ శ్రీ కృష్ణ భగవానుని బంకే బిహారీ అని కూడా అంటారు. బృందావన్‌లోని ఇస్కాన్ టెంపుల్, ప్రేమ మందిర్ , బాంకే బిహారీ టెంపుల్ శ్రీకృష్ణుడికి అంకితం చేసిన ఆలయాలు. భారీ సంఖ్యలో కృష్ణ భక్తులు ఈ ఆలయంలోని కృష్ణుడిని దర్శించుకోవడానికి వస్తారు.




