- Telugu News Photo Gallery Spiritual photos Guru Graha Aticharam 2025: Positive Impact and Special Yogas on 6 Zodiac Signs
Jupiter Impact: గురువుకు అతిచార దోషం…ఆ రాశుల వారికి ప్రత్యేక యోగాలు!
ప్రతి రాశిలోనూ 12 నుంచి 13 నెలల పాటు సంచారం చేసే గురు గ్రహానికి అతిచారం కలిగి ఒకే ఏడాదిలో రెండు రాశులు మారే అవకాశం ఉంటుంది. ఈ నెల 10వ తేదీ నుంచి గురువుకు అతిచార దోషం ఏర్పడుతోంది. రవి గ్రహానికి దగ్గరగా వచ్చినప్పటి నుంచి గురువు సంచారంలో వేగం పెరుగుతుంది. ఈ వేగం మరింత పెరిగి అక్టోబర్ 23న ఈ గురు గ్రహం తన ఉచ్ఛ క్షేత్రమైన కర్కాటక రాశిలో ప్రవేశిస్తోంది. అక్కడ డిసెంబర్ 5 వరకూ కొనసాగి తిరిగి మిథున రాశిలో ప్రవేశిస్తుంది. ఈ అతిచారం వల్ల గురువు తానివ్వవలసిన యోగాలను వేగంగా, త్వరగా ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల మేషం, వృషభం, మిథునం, సింహం, కన్య, తులా రాశులు బాగా లబ్ధి పొందుతాయి.
TV9 Telugu Digital Desk | Edited By: Janardhan Veluru
Updated on: Jun 09, 2025 | 6:11 PM

మేషం: ఈ రాశికి గురువు అత్యంత శుభుడైనందువల్ల ఒకటికి రెండుసార్లు ధన యోగాలు కలిగించే అవకాశం ఉంది. ధనార్జనకు ఏ కొద్ది ప్రయత్నం చేపట్టినా శీఘ్ర ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. సంతాన యోగం కలుగుతుంది. ఇంటాబయటా సుఖ సంతోషాలు వర్ధిల్లుతాయి. ఉద్యోగంలో పదోన్నతి లభించే అవకాశం ఉంది. కుటుంబంలో శుభ కార్యాలు జరిగే సూచనలున్నాయి. రాజపూజ్యాలు కలుగుతాయి. ఆరోగ్య భాగ్యం కలుగుతుంది.

వృషభం: ఈ రాశికి లాభస్థానాధిపతి అయిన గురువుకు బలం పెరుగుతున్నందువల్ల ఆదాయం బాగా పెరుగుతుంది. అనారోగ్యాల నుంచి బయటపడతారు. వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఇంట్లో పెళ్లి, గృహ ప్రవేశం వంటి శుభ కార్యాలు జరుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. విదేశీ ఉద్యోగాలకు అవకాశం ఉంది. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం నిశ్చయం అవుతుంది. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగిపోతాయి. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది.

మిథునం: ఈ రాశిలో ఉన్న గురువుకు అతిచారం ఏర్పడడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లోనే కాక, ఆదాయంలో కూడా ఊహించని అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగంలో ప్రతిభా పాటవాలకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ప్రభుత్వమూలక ధన లాభం, సత్కారాలకు అవకాశం ఉంది. రాజపూజ్యాలు కలుగుతాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఇంట్లో పెళ్లి, గృహ ప్రవేశాలు జరుగుతాయి.

సింహం: ఈ రాశికి లాభ స్థానంలో ఉన్న గురువులో వేగం పెరుగుతున్నందు వల్ల ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు విపరీతంగా లాభిస్తాయి. కుటుంబ సౌఖ్యం బాగా వృద్ధి చెందుతుంది. సొంత ఇల్లు అమరుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో హోదా, పలుకుబడి పెరుగుతాయి. ఆస్తి సమస్య అనుకూలంగా పరిష్కారం అవుతుంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందవచ్చు. ఆర్థిక పరిస్థితి పూర్తిగా మారిపోతుంది.

కన్య: ఈ రాశికి దశమ స్థానంలో గురు బలం పెరుగుతున్నందువల్ల ఉద్యోగ జీవితం వైభవంగా సాగి పోతుంది. భవిష్యత్తులో వస్తాయనుకున్న పదోన్నతులు ఇప్పుడే లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. కొద్ది ప్రయత్నంతో ఆదాయ మార్గాలు విస్తరించి, ఆదాయం ఊహించని స్థాయిలో పెరుగుతుంది. వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు కూడా లభిస్తాయి. ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది.

తుల: ఈ రాశికి భాగ్య స్థానంలో సంచారం చేస్తున్న గురువుకు అతిచారం కలిగినందువల్ల అనేక విధా లైన అదృష్టాలు కలుగుతాయి. శుభవార్తలు ఎక్కువగా వింటారు. కెరీర్ లోనూ, కుటుంబంలోనూ శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రతిభా పాటవాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఉన్నత స్థాయి పరిచయాలు వృద్ది చెందుతాయి. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. సంతాన యోగానికి అవకాశం ఉంది.



















