ఈ రాశులపై రాహువు చల్లని చూపు.. వీరికి జీవితంలో తిరుగే ఉండదంట
జ్యోతిష్య శాస్త్రంలో రాహువు గ్రహానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. రాహువు అనుగ్రహం ఉంటే వారికి కష్టాలు తగ్గిపోయి, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా కలిసి వస్తుంది. అయితే ప్రస్తుతం రాహువు కుంభరాశిలో శుభస్థానంలో ఉన్నాడు. దీని వలన ఐదు రాశుల వారికి ఊహించని లాభాలు కలగనున్నాయి. కాగా, ఆ రాశులు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Updated on: Jun 10, 2025 | 1:46 PM

మిథున రాశి : రాహువు అనుగ్రహం వలన మిథున రాశి వారికి పట్టిందల్లా బంగారం కానుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. వీరికి ధనయోగం ఉంది. అనుకోని మార్గాల ద్వారా డబ్బు చేతికందుతుంది. కష్టాలన్నీ తీరిపోతాయి. అంతే కాకుండా వీరు ఏ పని చేసినా సరే అది వీరికే ప్రయోజనం చేకూర్చుతుంది. ఇంట్లో శుభకార్యలు కూడా జరుపుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా ప్రయాణాలు చేస్తారు. ఈ ప్రయాణాలు కూడా మీకు లాభాలను తీసుకొస్తాయంటున్నారు పండితులు.

కుంభ రాశి : రాహువు అనుగ్రహం కుంభరాశిపై ఎక్కువగా ఉండటం వలన ఈ రాశి వారు ఏ పని చేపట్టినా అందులో విజయం అందుకుంటారు. ఆర్థఇకంగా అనేక లాభాలు చేకూరుతాయి. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. అనారోగ్య సమస్యల నుంచి కోలుకుంటారు. ఆర్థికంగా బాగుంటుంది.

సింహ రాశి : రాహువు అనుగ్రహంతో సింహ వారికి అదృష్టం తలపు తట్టబోతుంది. వీరికి ధనయోగం ఉంది. అనుకోని మార్గాల ద్వారా డబ్బు చేతికందుతుంది. అంతే కాకుండా సింహ రాశి వారు ఏ పని చేసినా సరే అది వీరికే ప్రయోజనం చేకూర్చుతుంది. ఇంట్లో శుభకార్యలు కూడా జరుపుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా ప్రయాణాలు చేస్తారు.

మేష రాశి : రాహువు అనుగ్రహంతో మేషరాశి వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. అంతే కాకుండా రానీ బాకీలు వసూలు అవుతాయి. ఉద్యోగం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారు త్వరలో జాబ్ కొట్టే ఛాన్స్ ఉంది. ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది. పట్టిందల్లా బంగారమే కానుంది.

ధనస్సు రాశి : ధనస్సు రాశి వారిపై రాహువు చల్లని చూపులు చూపిస్తున్నాడు. దీంతో వీరు కష్టాల నుంచి బయటపడి చాలా ప్రయోజనాలు పొందనున్నారు. విద్యార్థులకు కలిసి వస్తుంది. విదేశిప్రయాణాలకు కోసం ఎదురు చూస్తున్న పనులు పూర్తి అవుతాయి. ఆర్థికంగా బాగుంటుంది. అంతే కాకుండా మంచి ర్యాంకులు సాధించడమే కాకుండా, మంచి కాలేజీల్లో సీటు కూడా పొందుతారు. ఇక ఈ రాశి వ్యాపారస్తులు అత్యధిక లాభాలు అందుకుంటారు.



















