Rashmika Mandanna: ‘నేను నేర్చుకున్న మొదటి భాష ఇదే’.. కన్నడిగులకు మళ్లీ కోపం తెప్పించిన రష్మిక
నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం 'కుబేర' సినిమా ప్రమోషన్స్ లో బిజి బిజీగా ఉంటోంది. తాజాగా దీనికి సంబంధించిన ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. అంందులో రష్మిక తన చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకుంది. ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతోంది.

కన్నడ బ్యూటీ రష్మిక మందన్న పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఇటీవల ఆమె నటించిన ‘పుష్ప 2’ చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత ఛావా కూడా 800 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఇప్పుడు రష్మిక మందన్న మళ్లీ తమిళ సినిమాతో మన ముందుకు రానుంది. వరిసు (వారసుడు) తర్వాత మళ్లీ కోలీవుడ్ ఆడియెన్స్ ను పలకరించనుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రష్మిక మందన్నతన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె తమిళ భాష, చెన్నై నగరంపై తనకున్నప్రత్యేక అభిమానాన్ని చాటుకుంది. ఈ ఫొటోలు ఇప్పుడు నెట్టింట బాగా వైరలవుతున్నాయి. రష్మిక మందన్నా దక్షిణాదిలో దాదాపు అందరి స్టార్ హీరోలతోనూ నటించింది. ఇక నాగార్జునతో కలిసి దేవదాస్ సినిమాలో యాక్ట్ చేసింది. దీంతో వీరి ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. అది ఇప్పటికీ కొనసాగుతోంది. ఇప్పుడు మళ్లీ ‘కుబేర’ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు నాగార్జున- రష్మిక. శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తోన్న ఈ మూవీలో కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా నటిస్తున్నాడు. ఈ క్రమంలోనే కుబేర ప్రమోషన్స్ కు సంబంధించి కొన్ని ఫొటోలను రష్మిక షేర్ చేసింది. అందులో రష్మిక నాగార్జున పాదాల దగ్గర కూర్చుని ఏదో చర్చిస్తోంది. అలాగే నాగార్జున రష్మిక చేయి పట్టుకుని ఏదో మాట్లాడుతూ కనిపించాడు. చెన్నైలో జరిగిన కుబేర గ్రాండ్ ఈవెంట్ సందర్భంగా ఈ ఫొటో క్లిక్ మనిపించారు. ఇప్పుడు ఈ ఫోటోకు రష్మిక ప్రత్యేక క్యాప్షన్ ఇచ్చింది.
“చెన్నైలో కుబేర సినిమా ప్రమోషన్లను ప్రారంభించాము. నా బాల్యం ఇక్కడే గడిపాను కాబట్టి చెన్నైకి నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంది. నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. కుబేర ప్రమోషన్ ఈవెంట్ చాలా అద్భుతంగా జరిగింది. నాన్న ఇక్కడే పనిచేసినందున మేము చెన్నైలోనే నివసించాం. నేను రస్కిన్ అనే పాఠశాలలో చదువుకున్నాను. ఇప్పుడు ఆ పాఠశాల ఉందో లేదో నాకు తెలియదు. ఆ తర్వాత, మేము కూర్గ్‌కు మారాము. నేను నేర్చుకున్న మొదటి భాష తమిళం’ అని రష్మిక రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. తమిళ్ భాష, చెన్నైని ప్రశంసించినందుకు చాలా మంది కన్నడిగులు రష్మికపై మండి పడుతున్నారు.
రష్మిక మందన్నా ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.