Tollywood: సింపుల్‌గా ఎంగేజ్మెంట్ చేసుకున్న 100 కోట్ల సినిమా డైరెక్టర్.. ఫొటోస్ వైరల్.. అమ్మాయి ఎవరంటే?
త్వరలోనే మరో టాలీవుడ్ సెలబ్రిటీ పెళ్లిపీటలెక్కనున్నాడు. మనసుకు నచ్చిన అమ్మాయితో కలిసి మూడు ముళ్ల బంధంలోకి అడుగు పెట్టనున్నాడు. ఆదివారం (జూన్ 08) ఈ టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ నిశ్చితార్థం ఎంతో సింపుల్ గా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.

మరో టాలీవుడ్ సెలబ్రిటీ బ్యాచిలర్ లైఫ్ కు బై బై చెప్పనున్నాడు. మనసుకు నచ్చిన అమ్మాయితో కలిసి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టనున్నాడు. తాజాగా ఈ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ దర్శకుడి నిశ్చితార్థం సింపుల్ గా జరిగింది. ఆదివారం (జూన్ 08) అమ్మాయి ఇంటి దగ్గర పెద్దగా హడావుడి లేకుండానే ఎంగేజ్‌మెంట్ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా కాబోయే వధూవరులు ఉంగరాలను మార్చుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. ఈ క్రమంలో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ యంగ్ డైరెక్టర్ కు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరి పై ఫొటోలో ఉన్న ఆ డైరెక్టర్ ఎవరో గుర్తు పట్టారా? అతను మరెవరో కాదు విరూపాక్ష లాంటి బ్లాక్ బస్టర్ సినిమాను తీసిన కార్తీక్ వర్మ దండు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుల్లో కార్తీక్ కూడా ఒకరు. గతంలో నిఖిల్ సూపర్ హిట్ సినిమా ‘కార్తికేయ’ సినిమాకు రైటర్‌గా కూడా పనిచేశాడు ఆ తర్వాత 2015లో ‘భమ్ భోలేనాథ్’ మూవీతో డైరెక్టర్‌గా అదృష్టం పరీక్షించుకున్నాడు. అయితే ఈ సినిమా పెద్దగా ఆడలేదు. అయితే టేకింగ్ పరంగా పలువురి ప్రశంసలు అందుకున్నాడు.
మొదటి సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు కార్తీక్. మెగా మేనల్లుడు, హీరో సాయి ధరమ్ తేజ్ తో కలిసి ‘విరూపాక్ష’ సినిమా తీశాడు. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన ఈ హారర్ థ్రిల్లర్ సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ప్రస్తుతం అక్కినేని నాగచైతన్యతో కలిసి ఓ మైథలాజికల్ మూవీ తీస్తున్నాడు కార్తీక్. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

Karthik Varma Dandu Engagement
ఈ క్రమంలోనే హర్షిత అనే అమ్మాయితో పెళ్లిపీటలెక్కేందుకు రెడీ అయ్యాడు కార్తీక్ దండు. తన ఎంగేజ్‌మెంట్ వీడియోని కార్తీక్ ఇన్ స్టాలో పోస్ట్ చేశాడీ ట్యాలెంటెడ్ డైరెక్టర్. హర్షిత విషయానికి వస్తే.. ఈమెది సినిమా బ్యాక్ గ్రౌండ్ కాదని తెలుస్తోంది. కార్తీక్ దగ్గరి బంధువుల అమ్మాయని తెలుస్తోంది. పెళ్లి కూడా ఈ ఏడాది చివర్లో ఉండొచ్చని తెలుస్తోంది.
నాగ చైతన్య సినిమాతో బిజీగా..
Production is in beast mode. My hero’s pushing boundaries. No compromises, only pure passion fueling every shot. This dream is becoming real — and it’s going to be epic! #NC24 @chay_akkineni @BvsnP @aryasukku @SVCCofficial @SukumarWritings @AJANEESHB @NavinNooli @Srinagendra_Art… pic.twitter.com/yGhRkZQjqx
— karthik varma dandu (@karthikdandu86) April 26, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి