- Telugu News Photo Gallery Cinema photos Balakrishna doing another historical movie know the details here
Balakrishna: మరోసారి హిస్టారికల్ రోల్‌లో కనిపించనున్న బాలయ్య
సీనియర్ హీరోల్లో చారిత్రాత్మక, పౌరాణిక పాత్రలకు పర్ఫెక్ట్‌గా సూట్ అయ్యే నటుడు నందమూరి బాలకృష్ణ అందుకే.. ఆయన కెరీర్‌లో రెగ్యులర్‌గా అలాంటి సినిమాలు కనిపిస్తూనే ఉంటాయి. అభిమానుల కోసం మరోసారి అలాంటి క్రేజీ ప్రాజెక్ట్‌ను లైన్‌లో పెట్టారు నందమూరి బాలకృష్ణ. ప్రజెంట్ అఖండ 2 తాండవం సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న నందమూరి బాలకృష్ణ.
Lakshminarayana Varanasi, Editor - TV9 ET | Edited By: Phani CH
Updated on: Jun 09, 2025 | 5:58 PM

సీనియర్ హీరోల్లో చారిత్రాత్మక, పౌరాణిక పాత్రలకు పర్ఫెక్ట్‌గా సూట్ అయ్యే నటుడు నందమూరి బాలకృష్ణ అందుకే.. ఆయన కెరీర్‌లో రెగ్యులర్‌గా అలాంటి సినిమాలు కనిపిస్తూనే ఉంటాయి. అభిమానుల కోసం మరోసారి అలాంటి క్రేజీ ప్రాజెక్ట్‌ను లైన్‌లో పెట్టారు నందమూరి బాలకృష్ణ.

ప్రజెంట్ అఖండ 2 తాండవం సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న నందమూరి బాలకృష్ణ, తన బర్త్ డే జోష్‌ను రెండు రోజుల ముందే తీసుకువచ్చారు. వరుస ఎనౌన్స్‌మెంట్స్‌తో ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేశారు.

అఖండ 2 టీజర్ టైమ్‌తో పాటు బాలయ్య నెక్ట్స్ సినిమాను కూడా రివీల్ చేశారు మేకర్స్.రాముడు, కృష్ణుడు లాంటి పౌరాణిక పాత్రలతో పాటు భైరవద్వీపం లాంటి జానపద చిత్రం, గౌతమీ పుత్ర శాతకర్ణి లాంటి చారిత్రాక చిత్రం చేసిన నటుడు నందమూరి బాలకృష్ణ.

ఈ లిస్ట్‌లో మరో మూవీ చేరనుంది. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో చేయబోయే నెక్ట్స్ మూవీని హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా రూపొందిస్తున్నట్టుగా వెల్లడించారు.ఎన్‌బీకే 111 అనే వర్కింగ్ టైటిల్‌తో ఎనౌన్స్ అయిన ఈ సినిమాను వ్రిద్దీ సినిమాస్ బ్యానర్‌లో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

రీసెంట్ టైమ్స్‌లో బాలయ్య చేసిన చారిత్రక చిత్రం గౌతమీ పుత్ర శాతకర్ణి. ఇప్పుడు మరోసారి అదే జానర్‌లో సినిమా చేస్తుండటంతో నందమూరి నటసింహం ఏ పాత్రలో కనిపిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.



















