Balakrishna HBD: క్యాన్సర్ బాధితుల మధ్య బాలయ్య బర్త్‌డే వేడుకలు.. నాకు పొగరే.. ఎందుకో తెలుసా అంటున్న ..
నటసింహం హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈ రోజు తన 65వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరిక, ఆస్ట్రేలియా వంటి విదేశాల్లో కూడా బాలయ్య బాబు పుట్టిన రోజు వేడుకల సందడి మొదలైంది. బాలయ్య బాబు బర్త్ డే సందర్భంగా టాలీవుడ్ నటీనటులు, దర్శకులు, అభిమానులు, రాజకీయ నాయకులూ భారీ స్థాయిలో జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ రోజు తన పుట్టిన రోజు సందర్భంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిని బాలకృష్ణ సందర్శించారు. ఈ సమయంలో తన గురించి తనదైన శైలిలో స్పందిస్తూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.

నందమూరి అందగాడు.. టాలీవుడ్ స్టార్ హీరో.. హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ పుట్టిన రోజు నేడు. తండ్రి ఎన్టిఆర్ నుంచి వారసత్వంగా నటనని మాత్రమే కాదు.. సేవా గుణాన్ని కూడా అందుకున్నారు. ముఖ్యంగా తల్లి కోరిక మేరకు స్థాపించిన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఎంతో మంచి పేదవారికి ఉచితంగా వైద్యం అందజేస్తూ.. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నారు. ఈ రోజు బాలకృష్ణ పుట్టిన రోజు కావడంతో హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్‌ని సందర్శించారు. తన 65 వ జన్మదిన వేడుకలను క్యాన్సర్ బాధితుల మధ్య జరుపుకున్నారు.
బాలకృష్ణ జన్మదినం సందర్భంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో ఆవరణంలో ఉన్న తల్లిదండ్రులు నందమూరి తారక రామారావు, బసవతారకం విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు బాలకృష్ణ. క్యాన్సర్ చిన్నారుల మధ్య కేక్ కట్ చేసిన బాలకృష్ణ.. అనంతరం రోగులకు పండ్లు పంపిణీ చేశారు. పుట్టిన రోజు సందర్భంగా బాలకృష్ణకి విశేష చెప్పేందుకు బసవతారకం ఆసుపత్రికి అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ పలు సంచలన విషయాలను తెలిపారు. ముఖ్యంగా తన తల్లిదండ్రుల కోరికను ఈ రోజున గుర్తు చేసుకున్నారు.
తన జీవితం అంతా తెరచిన పుస్తకం అని.. రహస్యాలు లేవని చెప్పారు. పేదలకు అందుబాటులో వైద్యం అందించాలని మా అమ్మ గారి కోరిక.. అందుకనే ఈ ఆసపత్రిని స్థాపించామని చెప్పారు. అంతేకాదు తన తండ్రి స్వర్గీయ ఎన్టిఆర్ తనని మెడిసిన్ చదివించాలని కోరుకున్నారని.. ఈ సందర్భంగా తన చదువు ప్రయాణం గురించి గుర్తు చేసుకున్నారు బాలకృష్ణ. నన్ను మా తండ్రి మెడిసిన్ చేయమన్నారు.. మెడిసిన్ కి అప్లై చేసి హాల్ టికెట్ తెచ్చి ఇచ్చారు.. అయితే నటన మీద ఇంటరెస్ట్ తో సిని పరిశ్రమలోకి హీరోగా అడుగు పెట్టా.. ఇండస్ట్రీ లో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నానని చెప్పారు.
తన మైండ్ ను ఎప్పటికప్పుడు షార్ప్ చేసుకుంటూ ఉంటానని చెప్పారు. అందరూ తనకు పొగరు ఉందని అనుకుంటారు.. అవును అందరూ అనుకునేది నిజమే నాకు పొగరు ఉంది. అది కూడా నన్ను చూసుకునే నాకు పొగరు అని చెప్పారు. ఎందుకంటే నేను ముందు నన్ను ప్రేమించుకుంటా.. తర్వాతనే అందరూ అని చెప్పారు.
తనకు బిరుదులు అలంకారం కాదని.. ఆ బిరుదులకే తాను అలంకారం అనిచెప్పారు. తనకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పద్మ భూషణ్ అవార్డ్ గురించి మాట్లాడుతూ.. ఈ అవార్డ్ తాను చేసిన సేవలకు దక్కిందని అన్నారు. ఎవరికైనా సరే మన శరీరం మన అదుపు ఆజ్ఞలో ఉండాలి.. ఆ గుణం హిందూ ధర్మంలో ఉంది. అంతేకాదు హిందూ ఇజంలో మరొక గొప్పతనం అందరూ బాగుండాలని కోరుకోవడం అని చెప్పారు బాలకృష్ణ.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..