Tollywood: ఒకప్పుడు బార్బర్ షాపులో పని .. ఇప్పుడు టాలీవుడ్ ఫేమస్ యాక్టర్.. ఎవరో గుర్తు పట్టారా?
సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే ఎంతో శ్రమించాలి. ఓపికగా ఉంటూ వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగాలి. అప్పుడే సక్సెస్ అవుతాం. మనం అనుకన్నది సాధిస్తాం. ఈ కుర్రాడు కూడా ఇదే దారిని అనుసరించాడు. తనను విమర్శించినవాళ్లతోనే చప్పట్లు కొట్టించుకునేలా పైకి ఎదిగాడు.

పై ఫొటోలో ఉన్నదెవరో గుర్తు పట్టారా? ఇతను టాలీవుడ్ లో బాగా ఫేమస్. తన మల్టీ ట్యాలెంట్ తో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. సింగర్ గా, మ్యూజిక్ డైరెక్టర్ గానూ సత్తా చాటుతున్నాడు. అలాగే నటుడిగానూ మెప్పిస్తున్నాడు. సినిమాలతో పాటు టీవీషోల్లోనూ సందడి చేస్తూ చేజేతులా సంపాదిస్తున్నాడు. అయితే ఈ స్థాయికి రావడానికి అతను ఎంతో కష్టపడ్డాడు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగాడు. ఫలితంగానే ఇప్పుడు తన ట్యాలెంట్ తో అందరి మన్ననలు అందుకుంటున్నాడు. ఇతని ప్రయాణం బార్బర్ షాపు నుంచి మొదలైంది. అక్కడ పని చేస్తూనే సంగీతంపై ఆసక్తి పెంచుకున్నాడు. గిన్నెలపై కర్రలతో వాయిస్తూ పాటలు పాడేవాడు. అదే సమయంలో సుమారు 7 సంవత్సరాల పాటు శిక్షణ తీసుకొని గజల్స్‌పై పట్టు సాధించాడు. మొదట మ్యూజిక్ ఆల్బమ్స్, వీడియోలతో యూట్యూబ్ లో ఫేమస్ అయ్యాడు. ఆ తర్వాత సినిమాల్లోకి కూడా అడుగు పెట్టాడు. తన హుషారైన మాస్ పాటలతో ఆడియెన్స్ ను ఉర్రూతలూగించాడు. స్టార్ హీరోల సినిమాల్లో పాటలు ఆలపిస్తూ స్టార్ సింగర్ గా ఎదిగాడు. ఎంతలా అంటే ప్రతిష్ఠాత్మక ఆస్కార్ వేదిక పై లైవ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చేదాకా. యస్ అతనెవరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనుకుంటా.. పై ఫొటోలో ఉన్నది సింగర్, నటుడు, బిగ్ బాస్ విజేత రాహుల్ సిప్లిగంజ్.
రాహుల్ సిప్లిగంజ్ జీవితం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హైదరాబాద్ పాతబస్తీలో పుట్టి పెరిగిన అతను మొదట తన తండ్రి నిర్వహించే బార్బర్ షాపులో పని చేసేవాడు. ఒకవైపు సంగీతం నేర్చుకుంటూనే తండ్రికి బార్బర్ షాప్ లో చేదోడు వాదోడుగా నిలిచేవాడు. ఇక మంగమ్మ, పూర్ బాయ్, మాకి కిరికిర’, ‘గల్లీ కా గణేష్’, ‘దావత్’ వంటి మ్యూజిక్ ఆల్బమ్స్ తో రాహుల్ క్రేజ్ అమాంతం పెరిగింది. ఇక నాగచైతన్య మొదటి సినిమా జోష్‌లో ‘కాలేజీ బుల్లోడా’ అనే సాంగ్ తో టాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడీ పాత బస్తీ పోరడు. ఆ తర్వాత దమ్ము సినిమాలో ‘వాస్తు బాగుందే’ ‘ఈగ’లో ఈగ ఈగ ఈగ, రచ్చ’లో సింగరేణి ఉంది… బొగ్గే పండింది, ‘రంగస్థలం’లో రంగా రంగా రంగస్థలానా,‘ఇస్మార్ట్ శంకర్’లో బోనాలు ఇలా పలు సినిమాల్లో హుషారైన పాటలు ఆలపించాడు. ఇక ఆర్ఆర్ఆర్ నాటు నాటు సాంగ్ తో ఆస్కార్ దాకా కూడా వెళ్లాడు.
రాహుల్ సిప్లిగంజ్ లేటెస్ట్ ఫొటో..
View this post on Instagram
రాహుల్ సిప్లిగంజ్ పలు సినిమాల్లో కూడా నటించాడు. రంగ మార్తాండ, ప్రెజర్ కుక్కర్ సినిమాల్లో లీడ్ రోల్స్ పోషించిన అతను కొన్ని సినిమాల్లో సహాయక నటుడిగానూ ఆకట్టుకున్నాడు.
View this post on Instagram
మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్ చేయండి.