Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ustaad Bhagat Singh: పవన్ ఫ్యాన్స్‌కు అద్దిరిపోయే న్యూస్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి క్రేజీ అప్డేట్..

ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మళ్లీ సినిమా షూటింగుల్లో బిజీ అవుతున్నారు. ఎన్నికలకు ముందు తాను ఒప్పుకున్న ప్రాజెక్టులను ఒక్కొక్కటి పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే హరి హర వీర మల్లు సినిమాను పూర్తి చేసిన పవన్ ఇటీవలే ఓజీలో తన పార్ట్ షూట్ ను పూర్తి చేసుకున్నాడు.

Ustaad Bhagat Singh: పవన్ ఫ్యాన్స్‌కు అద్దిరిపోయే న్యూస్.. 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి క్రేజీ అప్డేట్..
Ustaad Bhagat Singh
Follow us
Basha Shek

|

Updated on: Jun 10, 2025 | 6:50 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్, మైత్రి మూవీ మేకర్స్ సెన్సేషనల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా కొత్త షూటింగ్ షెడ్యూల్ ప్రారంభమైంది. ఈ రోజు పవన్ కళ్యాణ్ హైదరాబాద్‌లో అఫీషియల్ గా షూటింగ్‌లో జాయిన్ అయ్యారు. పవన్ కళ్యాణ్ ఎంట్రీతో సెట్స్‌ లో జోష్ నెలకొంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. పవన్ కళ్యాణ్ తో పాటు, సినిమాలోని ప్రముఖ తారాగణం కూడా షూటింగ్‌లో పాల్గొంటోంది.మైత్రి మూవీ మేకర్స్ బ్యానరర్ పై నవీన్ యెర్నేని, వై.రవి శంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఆయనంక బోస్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు, ఉజ్వల్ కులకర్ణి ఎడిటర్. రామ్-లక్ష్మణ్ ద్వయం యాక్షన్ సీక్వెన్స్‌లను కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఆనంద్ సాయి ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు. అలాగే స్క్రీన్ ప్లే రైటర్ గా కె. దశరథ్ అడిషినల్ రైటర్ గా సి చంద్ర మోహన్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

కాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో గతంలో వచ్చిన గబ్బర్ సింగ్ ఎంతటి సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 2012లో రిలీజైన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టింది. ఇప్పుడు సుమారు 13 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ కాంబోలో సినిమా రానుంది. దీంతో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఇప్పటివరకు ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్స్, గ్లింప్స్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కాగా ఉస్తాద్ భగత్ సింగ్ లేటెస్ట్ షెడ్యూల్ సుమారు 30 రోజుల పాటు జరగనుంది. ప్రస్తుతం హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

తనకు అన్నం పెట్టి వ్యక్తి చనిపోతే కొండముచ్చు ఏం చేసిందో తెలుసా
తనకు అన్నం పెట్టి వ్యక్తి చనిపోతే కొండముచ్చు ఏం చేసిందో తెలుసా
మందేసి నిద్రపోతున్న వ్యక్తి.. దగ్గరకొచ్చి వాసన చూసిన ఆడసింహం
మందేసి నిద్రపోతున్న వ్యక్తి.. దగ్గరకొచ్చి వాసన చూసిన ఆడసింహం
చనిపోయాడని అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు..శ్మశానానికి తీసుకెళ్లే
చనిపోయాడని అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు..శ్మశానానికి తీసుకెళ్లే
సోదరుడి అంత్యక్రియల్లో కన్నీరుమున్నీరైన రమేశ్‌ విశ్వాస్‌.. వీడియో
సోదరుడి అంత్యక్రియల్లో కన్నీరుమున్నీరైన రమేశ్‌ విశ్వాస్‌.. వీడియో
మర్డర్ మిస్టరీని బయటపెట్టిన కుర్రాడు..!
మర్డర్ మిస్టరీని బయటపెట్టిన కుర్రాడు..!
ఏదైనా ఆలోచిస్తున్నప్పుడు గుండె చప్పుడు ఎందుకు పెరుగుతుంది..
ఏదైనా ఆలోచిస్తున్నప్పుడు గుండె చప్పుడు ఎందుకు పెరుగుతుంది..
రూ.500 నోటుపై స్టార్‌ గుర్తు.. ఇది నకిలీదా..ఆర్బీఐ ఏం చెబుతోంది?
రూ.500 నోటుపై స్టార్‌ గుర్తు.. ఇది నకిలీదా..ఆర్బీఐ ఏం చెబుతోంది?
బొట్టు పెడుతుండగా వరుడికి వణుకుడు రోగం.. చివరికి ?
బొట్టు పెడుతుండగా వరుడికి వణుకుడు రోగం.. చివరికి ?
నన్ను ఎవడు ఆపేది.. న‌డిరోడ్డుపై రెస్ట్ తీసుకుంటున్న మందుబాబు !
నన్ను ఎవడు ఆపేది.. న‌డిరోడ్డుపై రెస్ట్ తీసుకుంటున్న మందుబాబు !
ఈ బైక్స్ సూపర్ స్మార్ట్.. లుక్స్‌తో పాటు అదిరేలా ఫీచర్స్..!
ఈ బైక్స్ సూపర్ స్మార్ట్.. లుక్స్‌తో పాటు అదిరేలా ఫీచర్స్..!