Mehreen Pirzadaa: ఎఫ్ 2 మూవీ హీరోయిన్ గుర్తుందా..? ఇప్పుడు ఎలా అయ్యిందో చూడండి..
మొదటి సినిమాతోనే హీరోయిన్గా ఫుల్ ఫేమస్ అయిపోయింది. ఆ తర్వాత తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంటూ తక్కువ సమయంలోనే తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఫస్ట్ మూవీతోనే అందంతో ఆకట్టుకున్న ఈ అమ్మడు.. జూనియర్ మిల్కీ బ్యూటీ అనే ట్యాగ్ సొంతం చేసుకుంది. తాజాగా ఈ బ్యూటీ న్యూలుక్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్.

టాలీవుడ్ ఇండస్ట్రీలో తక్కువ సమయంలో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో మెహ్రీన్ ఒకరు. న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన కృష్ణ గాడి వీర ప్రేమగాధ సినిమాతో కథనాయికగా వెండితెరకు పరిచయమైంది మెహ్రీన్. మొదటి సినిమాతోనే అందం, అభినయంతో ఆకట్టుకుంది. అంతేకాదు.. ఫస్ట్ మూవీకే మిల్కీ బ్యూటీ అనే ట్యాగ్ సొంతం చేసుకుంది. మిల్కీ బ్యూటీ తమన్నా రేంజ్లోనే అమ్మడికి ఫ్యూచర్ ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ ఈ బ్యూటీకి తెలుగులో ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు పూర్తిగా సినిమాలకు దూరంగా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పటివరకు యంగ్ స్టార్ హీరోలకు జోడిగా నటించే ఛాన్స్ అందుకోలేదు ఈ ముద్దుగుమ్మ.
వెంకటేశ్, వరుణ్ తేజ్ కలిసి నటించిన ఎఫ్ 2 సినిమాలో కథానాయికగా నటించింది మెహ్రీన్. ఇందులో తమన్నా సైతం హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ సూపర్ హిట్ అయినప్పటికీ మెహ్రీన్ కు అంతగా ఆఫర్స్ రాలేదు. చివరగా తెలుగులో ఎఫ్ 3 చిత్రంలో కనిపించింది. ఎఫ్ 2లో ఆమె చేసిన హనీ పాత్రకు సూపర్ రెస్పాన్స్ రావడంతో ఎఫ్ 3లోనూ అదే పాత్ర కంటిన్యూ చేసింది. ఆ తర్వాత మరో సినిమా చేయలేదు. తెలుగులో ఈ బ్యూటీకి అనుకున్నంత ఆఫర్స్ మాత్రం రాలేదు.
ప్రస్తుతం తెలుగు చిత్రపరిశ్రమకు దూరంగా ఉంటుంది మెహ్రీన్. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది మెహ్రీన్. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన గ్లామర్ ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. ఒకప్పుడు బొద్దుగా.. ఎంతో అందంగా కనిపించిన మెహ్రీన్.. ఇప్పుడు మాత్రం పూర్తిగా బక్కిచిక్కి పోయి నాజుగ్గా అసలు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. దీంతో మెహ్రీన్ న్యులుక్ ఫోటోస్ చూసి షాకవుతున్నారు ఫ్యాన్స్. మెహ్రీన్ తెలుగులో రీఎంట్రీ ఇచ్చి ఇకపై వరుస సినిమాల్లో నటిస్తే బాగుండు అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.
మెహ్రీన్ ఇన్ స్టా పోస్ట్..
View this post on Instagram
ఇవి కూడా చదవండి :
Tollywood: హీరోయిన్ దొరికేసిందిరోయ్.. నెట్టింట గత్తరేపుతోన్న టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్..
Tollywood: సీరియల్లో పవర్ ఫుల్ విలన్.. నెట్టింట గ్లామర్ బ్యూటీ.. ఫోటోస్ చూస్తే..
Manasantha Nuvve : మరీ ఇంత అందంగా ఉందేంట్రా.. మతిపోగొట్టేస్తోన్న మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్..
Tollywood : అమ్మాయిల డ్రీమ్ బాయ్.. 30 ఏళ్లకే సినిమాలకు దూరం.. కట్ చేస్తే.. ఇప్పుడు ఇలా..