Akhanda 2: అఖండ 2లో అఘోరగా కనిపించిన ఈ స్టార్ హీరోను గుర్తుపట్టారా..? తెలుగులో పవర్ ఫుల్ విలన్.. తమిళంలో క్రేజీ స్టార్..
నందమూరి బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా నిన్న విడుదలైన అఖండ 2 టీజర్ కు ఊహించని రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. చాలా రోజులుగా ఎదురుచూసిన ఈ మూవీ అప్డేట్ నందమూరి అభిమానులకు ఫుల్ మీల్స్ లా అనిపించింది.ఈ టీజర్ లో బాలయ్య సీన్స్, లుక్స్, విజువల్స్ గూస్ బంప్స్ తెప్పించాయి.

తెలుగులో మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో అఖండ 2 ఒకటి. గతంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన అఖండ చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. కొన్ని నెలలుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఈ క్రమంలో ఈరోజు నందమూరి బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా నిన్న ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్ ఊహించని రెస్పాన్స్ అందుకుంది. ఇందులో బాలయ్య లుక్స్.. విజువల్స్ ఊరమాస్. ఒక్కో షాట్ గూస్ బంప్స్. నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబో అంటే ఈమాత్రం ఉండాల్సిందే అన్నట్లుగా కనిపించింది. ఇందులో మరోసారి బాలయ్య నట విశ్వరూపం చూపించేశారు. తన చేతిలోని త్రిశూలన్నీ మెడ చుట్టూ తిప్పుతూ వాళ్ల గొంత కోసే సీన్ మరింత అరాచకం.
నా శివుడి అనుమతి లేనిదే.. ఆ యముడైనా కన్నెత్తి చూడడు.. నువ్వు చూస్తావా.. అమాయకుల ప్రాణాలు తీస్తావా అంటూ బాలయ్య చెప్పే పవర్ ఫుల్ డైలాగ్స్.. అదే సమయంలో తమన్ బీజీఎం టీజర్ ను మరో లెవల్ కు తీసుకెళ్లింది. అయితే ఈ టీజర్ లో ఒక భయంకరమైన కళ్ల షాట్ మాత్రం నెక్ట్ లెవల్. దీంతో ఆ కళ్ల వ్యక్తి ఎవరా అని తెగ సెర్చ్ చేస్తున్నారు నెటిజన్స్. ఆయన మరెవరో కాదు.. కోలీవుడ్ హీరో ఆది పినిసెట్టి. ఈ హీరోకు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తెలుగులో హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఆది. ఇక ఇప్పుడు అఖండ 2 చిత్రంలో అఘోరగా కనిపిస్తాడట. ఇందులో ఆది పినిశెట్టి సైతం పవర్ ఫుల్ పాత్ర అని సమాచారం.
Tollywood: హీరోయిన్ దొరికేసిందిరోయ్.. నెట్టింట గత్తరేపుతోన్న టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్..
Tollywood: సీరియల్లో పవర్ ఫుల్ విలన్.. నెట్టింట గ్లామర్ బ్యూటీ.. ఫోటోస్ చూస్తే..
బాలయ్య, ఆది పినిశెట్టి మధ్య భయంకరమైన ఫైట్ సీన్స్ ఉంటాయని టాక్. అయితే ఈ చిత్రంలో ఆది పినిశెట్టి నిజంగానే కనిపిస్తాడా ? అనేది తెలియాల్సి ఉంది. తెలుగులో పలు చిత్రాల్లో నటించిన ఆది.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సరైనోడు సినిమాలో విలన్ పాత్రలో అదరగొట్టాడు. ఆ తర్వాత రామ్ చరణ్, సుకుమార్ కాంబోలో వచ్చిన రంగస్థలం సినిమాలో చెర్రీ అన్నగా నటించిన సంగతి తెలిసిందే.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :
Manasantha Nuvve : మరీ ఇంత అందంగా ఉందేంట్రా.. మతిపోగొట్టేస్తోన్న మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్..
Tollywood : అమ్మాయిల డ్రీమ్ బాయ్.. 30 ఏళ్లకే సినిమాలకు దూరం.. కట్ చేస్తే.. ఇప్పుడు ఇలా..