Tollywood: ఎట్టకేలకు స్పందించిన నటుడు.. కోట్లు వదిలి గ్రామంలో ఉండటానికి రీజన్ ఇదేనట..
దశాబ్దాలుగా సినీరంగంలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. వైవిధ్యమైన పాత్రలకు ప్రాణం పోసిన నటుడు ఆయనే. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ కెరీర్ మంచి ఫాంలో ఉండగానే మూవీస్ వదిలేసి కార్గిల్ యుద్ధంలో చేరి దేశానికి సేవ చేశాడు. ఇప్పుడు కోట్లు వదిలేసి పల్లెటూరి జీవితాన్ని గడుపుతున్నాడు. అయితే ఇందుకు గల కారణాన్ని రివీల్ చేశాడు.

భారతీయ సినీ పరిశ్రమలో అతడు తోపు హీరో. దశాబ్దాలుగా ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. వైవిధ్యమైన పాత్రలలో సహజ నటనతో ఆకట్టుకున్నాడు. అయితే బ్యాక్ టూ బ్యాక్ సినిమాల్లో నటిస్తూ కెరీర్ మంచి ఫాంలో ఉండగానే సినిమాలు వదిలేసి కార్గిల్ యుద్ధంలో చేరి దేశానికి సేవ చేశాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు తిరిగి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు వరుస సినిమాలతో మరోసారి వెండితెరపై సందడి చేస్తున్నారు. అయితే సినీరంగుల ప్రపంచంలో నటుడిగా ప్రశంసలు అందుకున్న ఆయన.. లగ్జరీ లైఫ్ వదిలేసి పల్లెటూరిలో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. దీంతో కొన్ని రోజులుగా ఆయన లైఫ్ స్టైల్.. విలేజ్ లైఫ్ గురించి సోషల్ మీడియాలో తెగ వార్తలు హల్చల్ చేశాయి. తాజాగా తాను గ్రామంలో ఉండటానికి గల కారణంతోపాటు.. ముంబై నగరానికి ఎందుకు దూరంగా ఉంటున్నారు అనే విషయాన్ని రివీల్ చేశారు. ఇంతకీ ఆ నటుడు ఎవరో తెలుసా.. ? ఆయనే బాలీవుడ్ స్టార్ నానా పటేకర్.
గతంలో అమితాబ్ బచ్చన్ నిర్వహిస్తున్న కౌన్ బనేగా కరోడ్‌పతి షోలో పాల్గొన్న నానా పటేకర్.. తన లైఫ్ స్టైల్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. సినీరంగానికి దూరంగా ఉండే పల్లెటూరిలో తాను ఎందుకు జీవిస్తున్నారు అనే విషయాన్ని రివీల్ చేశారు. జీవితంలో ఇంత సాధించిన తర్వాత అన్నీ వదిలేసి గ్రామానికి ఎందుకు వెళ్ళావు? అని అమితాబ్ అడగ్గా.. నానా పటేకర్ స్పందిస్తూ.. “నేను ఈ పరిశ్రమ నుండి దూరంగా వెళ్లలేదు. వస్తాను.. పని చేస్తాను.. మళ్లీ మా ఊరు వెళ్లిపోతాను. నేను గ్రామం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చాను. అందుకే నేను అక్కడే ఉంటాను. అక్కడ ఉండడమే నాకు ఇష్టం. నా తల్లి నుండి నేను కోరుకున్న దానికంటే చాలా రెట్లు ఎక్కువ పొందాను. అవసరాలలో పరిమితం కావడం చాలా సులభం. ఏసీ లేదు. నేను దానిని చాలా ఆనందిస్తాను. నగరంలో గోడలు ఉన్నట్లే, నా ఇంట్లో కూడా పర్వతాలు ఉన్నాయి. పర్వతాలు ఈ వైపు నుండి వస్తాయి. నేను పర్వతాల మధ్య నివసిస్తాను. ఇది చాలా బాగుంది” అంటూ చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉంటే.. కెరీర్ మంచి పీక్స్ లో ఉండగానే కార్గిల్ యుద్ధంలో చేరారు నానా పటేకర్. 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో సైనికుడిగా చేరాలనుకున్నాడు. వెంటనే ఆర్మీలోని సీనియర్ అధికారులను కలిసి తనకు ఫ్రంట్ లైన్ కు వెళ్లాలనే కోరికను చెప్పాడు. అందుకు రక్షణ మంత్రి జార్జ్ ఫెర్నాండెజ్ అనుమతి కోసం కాల్ చేసి తనకు మరాఠా లైట్ ఇన్ఫాంట్రీలో శిక్షణ తీసుకున్న విషయాన్ని తెలియజేశాడు. దీంతో ఆయనకు పర్మిషన్ వచ్చింది. 1999లో ఆగస్టులో నానా పటేకర్ రెండువారాలపాటు సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి గడిపారు.
నానా పటేకర్ వీడియో…
View this post on Instagram
ఇవి కూడా చదవండి :
Tollywood: హీరోయిన్ దొరికేసిందిరోయ్.. నెట్టింట గత్తరేపుతోన్న టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్..
Tollywood: సీరియల్లో పవర్ ఫుల్ విలన్.. నెట్టింట గ్లామర్ బ్యూటీ.. ఫోటోస్ చూస్తే..
Manasantha Nuvve : మరీ ఇంత అందంగా ఉందేంట్రా.. మతిపోగొట్టేస్తోన్న మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్..
Tollywood : అమ్మాయిల డ్రీమ్ బాయ్.. 30 ఏళ్లకే సినిమాలకు దూరం.. కట్ చేస్తే.. ఇప్పుడు ఇలా..