Kota Srinivasa Rao: అరె.. కోట శ్రీనివాసరావుకు ఏమైంది? ఇలా గుర్తుపట్టలేకుండా మారిపోయారు.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు సుమారు రెండేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్నారు. వయసు మీద పడటంతో పాటు అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ఆయన కెమెరా ముందుకు రావడం లేదు. అయితే ఇప్పుడు కోట శ్రీనివాసరావు బాగా బక్కచిక్కిపోయి గుర్తు పట్టలేకుండా మారిపోయారు.

నటుడిగా, విలన్ గా, కమెడియన్‌గా వందలాది సినిమాల్లో నటించారు కోట శ్రీనివాసరావు. తన అద్బుత అభినయంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో దిగ్గజ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 1978లో మొదలైన ఆయన సినిమా ప్రస్థానం 2023 వరకు అప్రతిహతంగా కొనసాగింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళీ భాషల్లోనూ నటించి మెప్పించారు కోట. సుమారు 750 కు పైగా సినిమాల్లో నటించిన కోటా శ్రీనివాసరావు తన అభినయ ప్రతిభకు ఏకంగా తొమ్మిది నంది అవార్డులు సొంతం చేసుకున్నారు. కేవలం సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ సత్తా చాటారాయన. 1999 నుండి 2004 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా కూడా సేవలు అందించారు. కాగా గత రెండేళ్లుగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు కోట. వృద్ధాప్య సమస్యలతో పాటు అనారోగ్య సమస్యలు తోడవ్వడంతో ఇంటికే పరిమితమయ్యారు. ఆయన చివరగా 2023లో వచ్చిన ‘సువర్ణ సుందరి’ మూవీలో కనిపించారు. ఆ తర్వాత బయట కూడా పెద్దగా కనిపించలేదీ సీనియర్ నటుడు. అయితే తాజాగా ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కోట శ్రీనివాసరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనతో కలిసి దిగిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసుకున్నారు.
‘కోట శ్రీనివాసరావు గారితో ఈరోజు.. కోటా బాబాయ్‌ని కలవడం చాలా సంతోషాన్ని ఇచ్చింది’ అని బండ్ల గణేశ్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. వీటిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు కోట ఆరోగ్య పరిస్థితి గురించి ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఈ ఫొటోల్లో కోట శ్రీనివాసరావు పూర్తిగా బక్కచిక్కిపోయి కనిపించారు. అసలు గుర్తుపట్టలేకుండా మారిపోయారు. పైగా పాదానికి కట్టుతోనూ కనిపించారు. దీంతో కోటాకు ఏమైందోనని పలువురు ఆందోళన చెందుతున్నారు.
నటుడు, నిర్మాత బండ్ల గణేష్ తో కోట శ్రీనివాసరావు..
Bandla Ganesh Clicks a Pic with One of the Great Actor Kota Srinivasa Rao Garu pic.twitter.com/7pFOzYe6Yr
— Movies4u Official (@Movies4u_Officl) June 10, 2025
కోటా శ్రీనివాసరావు గారి అనారోగ్య సమస్యలు ఏంటి అనే విషయంపై క్లారిటీ లేదు కానీ ఆయన మాత్రం క్షేమంగా ఉండాలని సినీ అభిమానులు కోరుకుంటున్నారు.
కాలికి కట్టుతో నటుడు కోట శ్రీనివాసరావు..
One of the best comedian Kota Srinivasa Rao Gari legs chusthene badha 😢 vestundhi Em avindhi antaru 🙁😔 pic.twitter.com/t90XHfr3ob
— sita rama raju 🦖👑 (@Sitaramaraju358) June 10, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.