Honeymoon Murder Case: మేఘాలయ హనీమూన్ మర్డర్‌పై కంగనా షాకింగ్ రియాక్షన్.. అలా అనేసిందేంటి?
మేఘాలయలో హనీమూన్‌కు వెళ్లిన ఇండోర్ వాసి రాజా రఘువంశీ హత్య కేసు యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. అతనిని హత్య చేసేందుకు భార్య సోనమ్ సుఫారీ ఇచ్చిందన్న విషయం తెలిసి అందరూ షాక్ కు గురువుతున్నారు. ఇప్పుడిదే సంఘటనపై నటి కంగనా రనౌత్ కూడా స్పందించింది.

ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీ హత్య దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఇందులో ప్రధాన నిందితురాలైన రాజా రఘువంశీ భార్య సోనమ్ సోమవారం (జూన్ 09) లొంగిపోయింది. ఈ కేసులో ఇప్పుడు దిగ్భ్రాంతికరమైన విషయాలు వెల్లడవుతున్నాయి. తన తండ్రి ఫ్యాక్టరీలో పనిచేసే రాజ్ కుష్వాహా అనే యువకుడిని ప్రేమించిన సోనమ్ , తన భర్త రాజాను హత్య చేసినట్లు వెల్లడైంది. ఇందుకోసం ఆమె ఆమె తన ప్రేమికుడితో పాటేఉ మరో ఇద్దరికి సుపారీ ఇచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. అసలు సోనమ్ కు రాజాను వివాహం చేసుకోవడం ఇష్టం లేదు. అంతుకు ముందే ఆమె రాజ్ కుష్వాహాను ప్రేమించింది. అయితే తల్లిదండ్రుల ఒత్తిడితో రఘువంశీని వివాహం చేసుకుంది. ఆ తర్వాత భర్తను వదిలించుకునేందుకు ఇంతటి ఘోరానికి పాల్పడింది. ఈ సంఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. దీనిపై ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. ఇప్పుడు ఈ కేసుపై బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్ స్పందించింది. నమ్‌ను మూర్ఖురాలిగా అభివర్ణించిన సోనమ్.. మన చుట్టూ కూడా ఇలాంటి వారు ఉన్నారని, జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఈ మేరకు ఇన్ స్టా గ్రామ్ లో ఆమె ఒక పోస్ట్ పెట్టింది.
నాకు తలనొప్పి తగ్గటం లేదు..
‘రాజా రఘువంశీ హత్య కేసును తాను అసలు అర్థం చేసుకోలేకపోతున్నాను. ఇది నన్ను కదిలించింది. ఇది చాలా అసంబద్ధం. ఒక మహిళ తన తల్లిదండ్రులకు భయపడి వివాహాన్ని తిరస్కరించదు. కానీ ఆమె కాంట్రాక్ట్ కిల్లర్‌తో క్రూరమైన హత్యకు ప్లాన్ చేస్తుంది. ఉదయం నుంచి ఈ విషయం నా మనసులో మెదులుతోంది. కానీ అర్థం కావడం లేదు. అయ్యో, ఇప్పుడు నాకు తలనొప్పిగా ఉంది. ఆమె విడాకులు తీసుకోలేదు. తన ప్రేమికుడితో పారిపోలేదు. ఎంత క్రూరమైనది, హేయమైనది, అన్నింటికంటే అసంబద్ధం, మూర్ఖత్వం. తెలివితక్కువ వ్యక్తులను ఎప్పుడూ తేలికగా తీసుకోకూడదు. వారు సమాజానికి అతిపెద్ద ముప్పు. మనం తరచుగా వారిని చూసి నవ్వుతాము. వారు ప్రమాదకరం కాదని అనుకుంటాము.. కానీ అది నిజం కాదు. మేధావులు తమ స్వలాభం కోసం ఇతరులకు హాని కలిగించవచ్చు కానీ ఒక మూర్ఖుడికి అతను ఏమి చేస్తున్నాడో తెలియదు. గుర్తుంచుకోండి. మీ చుట్టూ ఉన్న మూర్ఖుల నుంచి జాగ్రత్తగా ఉండండి’ అని కంగనా రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరలవుతోంది. దీనిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి