- Telugu News Photo Gallery Cinema photos Anchor Suma Kanakala's Chef Mantra Project K Success Meet Photos Go Viral
Aha- Chef Mantra Project K: ఆహా చెఫ్ మంత్ర ప్రాజెక్ట్-Kకు సూపర్ రెస్పాన్స్.. సక్సెస్‌మీట్ ఫొటోలు చూశారా?
తెలుగు ఓటీటీ ఆడియెన్స్ కు 100 శాతం వినోదాన్ని అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది ఆహా. ఇందులో భాగంగా ఇప్పటికే పలు సూపర్ హిట్ సినిమాలు, ఆసక్తికర వెబ్ సిరీస్ లను స్ట్రీమింగ్ కు తీసుకొచ్చింది. అలాగే అన్ స్టాపబుల్, ఇండియన్ ఐడల్ వంటి ఫేమస్ రియాలిటీ షోలతో కూడా ఆడియెన్స్ ను ఎంటర్ టైన్ చేస్తోంది.
Updated on: Jun 10, 2025 | 6:04 PM

ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో వచ్చిన చెఫ్ మంత్ర షోకు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే ఈ షో మూడు సీజన్లు పూర్తి కాగా మార్చిలో నాలుగో సీజన్ ప్రారంభమైంది.

హా ' చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ K' పేరుతో వచ్చిన సీజన్ 4 కు స్టార్ యాంకర్ సుమ కనకాల హోస్టుగా వ్యవహరించింది. అలాగే మరో నటుడు జీవన్ కుమార్ కో హోస్ట్ గా వ్యవహరించాడు.

ఈ కుకింగ్ షోలో భాగంగా అమర్ దీప్, అర్జున్, దీపికా రంగరాజు, సమీరా భరద్వాజ్, సుప్రిత, యాదమ్మ రాజు, ప్రషు, ధరణి, విష్ణుప్రియా, పృథ్వీ తదితర సెలబ్రిటీలు తమకెంతో ఇష్టమైన రుచికరమైన వంటకాలను ఆడియెన్స్ కు పరిచయం చేశారు.

ఆహా కుకింగ్ షోకు వస్తోన్న సూపర్ రెస్పాన్స్ నేపథ్యంలో టీమ్ గ్రాండ్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ వేడుకలో హోస్టులు సుమ, జీవన్ తో పాటు ఈ సీజన్ లో పార్టిసిపేట్ చేసిన సెలబ్రిటీలందరూ హాజరయ్యారు.

ఈ సందర్భంగా అందరూ కలిసి కేక్ కట్ చేశారు. అలాగే అందరికీ జ్ఞాపికలు అందజేశారు. ప్రస్తుతం చెఫ్ మంత్ర ప్రాజెక్ట్-K సక్సెస్ మీట్ కు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.




