AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: చేసింది ఒక్క సినిమా.. కట్ చేస్తే.. స్టార్ హీరోలతో ఛాన్స్.. 27 ఏళ్లకే కోట్లలో సంపాదన.. ఎవరంటే

ప్రస్తుతం ఆమె పాన్ ఇండియా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. ఇప్పుడు ఆ ముద్దుగుమ్మ చిన్ననాటి ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు హిందీతోపాటు తెలుగులోనూ వరుస అవకాశాలు అందుకుంటూ టాప్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. ఇంతకీ ఈ అమ్మడు ఎవరో తెలుసా.. ?

Rajitha Chanti
|

Updated on: Jun 10, 2025 | 8:11 PM

Share
సెలబ్రెటీ ఫ్యామిలీ నుంచి సినీరంగంలోకి అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత గ్లామర్ రోల్స్ కాకుండా వైవిధ్యమైన పాత్రలు ఉన్న సినిమాలను ఎంచుకుంటూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇంతకీ ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ? ఇప్పుడు టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్.

1 / 5
తెలుగులో చేసింది ఒక్క సినిమానే.. కానీ ఊహించని స్టార్ డమ్ సంపాదించుకుంది. ఆ బ్యూటీ మరెవరో కాదండోయ్.. బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్. ప్రస్తుతం ఈ అమ్మడు వయసు 27 సంవత్సరాలు మాత్రమే. కానీ ఇప్పటికే కోట్లు సంపాదించిందని టాక్. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.5 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుందట.

2 / 5
అతిలోక సుందరి శ్రీదేవి, బోనీ కపూర్ దంపతుల పెద్ద కూతురు జాన్వీ కపూర్. ధడక్ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే విజయం సాధించింది. ఆ తర్వాత హిందీలో వరుస సినిమాల్లో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక ఇప్పుడు తెలుగులో వరుస సినిమాల్లో నటిస్తుంది.

3 / 5
ఇటీవలే యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన దేవర సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతోపాటు తనదైన నటనతో తెలుగు వారి హృదయాలు గెలుచుకుంది. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన పెద్ది చిత్రంలో నటిస్తుంది. అలాగే దేవర 2లోనూ భాగం కానుంది.

4 / 5
మరోవైపు హిందీలోనూ వరుస సినిమాల్లో నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ. అలాగే సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. తాజాగా జాన్వీకి సంబంధించిన చిన్ననాటి ఫోటో ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతుంది. తెలుగులో మరిన్ని సినిమాల్లో నటించనుందట ఈ అమ్మడు.

5 / 5