Rashid Khan: ఐపీఎల్‌లో అట్టర్ ఫ్లాప్.. కట్ చేస్తే.. సంచలన నిర్ణయంతో ముంబై ఇండియన్స్‌కు షాకిచ్చిన రషీద్ ఖాన్
ఈ ఏడాది ఐపీఎల్‌లో రషీద్ ఖాన్ గుజరాత్ టైటాన్స్ జట్టులో కనిపించాడు. మొత్తం15 మ్యాచ్‌ల్లోనూ ఆడాడు. కానీ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఇప్పుడు పేలవమైన ఫామ్ కారణంగా సంచలన నిర్ణయం తీసుకున్నాడీ మిస్టరీ స్పిన్నర్. ఈ నిర్ణయంతో క్రికెట్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.

T20 క్రికెట్‌లో గొప్ప బౌలర్లలో ఒకరైన ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన రషీద్ ఖాన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడిన రషీద్ ఖాన్ చాలా పేలవమైన ఆట తీరును ప్రదర్శించాడు. ముఖ్యంగా, ఐపీఎల్ చరిత్రలో ఒక సీజన్‌లో సగటున 9 కంటే ఎక్కువ పరుగులు ఇవ్వడం ఇదే తొలిసారి. అంతేకాకుండా, ఈసారి అతని బౌలింగ్ లో 33 సిక్సర్లు కూడా నమోదయ్యాయి. దీని ద్వారా, ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక సిక్సర్లు ఇచ్చిన బౌలర్‌గా రషీద్ ఖాన్ చెత్త రికార్డును మూట గట్టుకున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో 15 మ్యాచ్‌లు ఆడిన రషీద్ ఖాన్ మొత్తం 330 బంతులు బౌలింగ్ చేశాడు. 514 పరుగులు సమర్పించుకున్నాడు. అంటే అతను ఓవర్‌కు సగటున 9.34 పరుగులు ఇచ్చి 9 వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. ఈ పేలవమైన ఫామ్ కారణంగా, రషీద్ ఖాన్ కొంతకాలం క్రికెట్ నుంచి విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే ఈ సంవత్సరం మేజర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ నుంచి తప్పుకున్నాడీ మిస్టరీ లెగ్ స్పిన్నర్.
రషీద్ ఖాన్ MLC లీగ్‌లో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజ్ MI న్యూయార్క్ తరపున ఆడాల్సి ఉంది. కానీ ఇప్పుడు, విశ్రాంతి కారణంగా, అతను టోర్నమెంట్ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాడు. మేజర్ లీగ్ క్రికెట్ 2024లో MI న్యూయార్క్ తరపున రషీద్ ఖాన్ అత్యుత్తమ బౌలర్‌గా నిలిచాడు. గత సంవత్సరం 6.15 ఎకానమీ రేటుతో 10 వికెట్లు పడగొట్టాడు. అయితే, ఈసారి విరామం కారణంగా తాను టోర్నమెంట్‌లో ఆడబోనని రషీద్ ఖాన్ MI న్యూయార్క్ ఫ్రాంచైజీకి తెలియజేశాడు.
ప్రస్తుతం మేజర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్‌కు దూరంగా ఉన్న రషీద్ ఖాన్ ఎంతకాలంగా విరామం తీసుకుంటున్నాడో తెలియదు. అయితే, తన సుదీర్ఘ కెరీర్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ విరామం తీసుకున్నట్లు తెలిసింది. దీని ద్వారా, అతను తన మానసిక, శారీరక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించుకున్నాడని తెలుస్తోంది. రషీద్ ఖాన్ తో పాటు ఆఫ్గనిస్తాన్ కు చెందిన మరో క్రికెటర్ రహ్ముతుల్లా ఒమర్ జాయ్ కూడా ఈ మేజర్ క్రికెట్ లీగ్ కు దూరంగా ఉండనున్నాడు.
🚨 𝑩𝑹𝑬𝑨𝑲𝑰𝑵𝑮 🚨
Big blow for MI New York ahead of MLC 2025! ❌
The Afghan duo, Rashid Khan and Azmatullah Omarzai, are set to miss Season 3 after opting out of the tournament to take a break. 🇦🇫👀#MLC2025 #RashidKhan #MINewYork #Sportskeeda pic.twitter.com/CaVZozFFGZ
— Sportskeeda (@Sportskeeda) June 11, 2025
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..