Singer Mangli: సింగర్ మంగ్లీ బర్త్ డే పార్టీలో ఆ టాలీవుడ్ ఫేమస్ నటి కూడా.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా
టాలీవుడ్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. ప్రముఖ సింగర్ మంగ్లీ బర్త్ డే పార్టీ ఇందుకు వేదిక కావడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ పార్టీకి హాజరైన పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారికి డ్రగ్స్ టెస్ట్ నిర్వహించారు. అందులో చాలా మందికి గంజాయి పాజిటివ్‌గా తేలింది.

ఈరోజు ఉదయం నుంచి టాలీవుడ్ ఫోక్ సింగర్ మంగ్లీ పేరు తెగ మార్మోగిపోతోంది. తన పుట్టిన రోజు (జూన్ 10) ను పురస్కరించుకుని మంగళవారం ఆమె చేవేళ్లలోని త్రిపుర రిసార్ట్‌లో గ్రాండ్ గా పార్టీ ఏర్పాటు చేసింది. అయితే ఈ పార్టీలో విదేశీ మద్యంతోపాటు గంజాయి సరఫరా జరిగిందన్న పక్కా సమాచారంతో పోలీసులు రిసార్ట్‌పై దాడులు జరిపారు. పార్టీకి హాజరైన పలువురిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం డ్రగ్స్ టెస్టులు నిర్వహించారు. ఇందులో సుమారు 9 మందికి గంజాయి పాజిటివ్ గా తేలినట్లు తెలుస్తోది. అయితే ఈ బర్త్ డే పార్టీకి ప్రముఖ నటి, బిగ్ బాస్ ఫేమ్ దివి వైద్య కూడా హాజరైంది. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ పేరు కూడా మార్మోగిపోతోంది. తాజాగా ఈ వ్యవహారంపై ఆమెనే స్వయంగా స్పందించింది. ఈ మేరకు ఇన్ స్టా స్టోరీస్ లో ఒక వీడియో ను రిలీజ్ చేసింది. ‘ స్నేహితురాలి పుట్టిన రోజు పార్టీ అని వెళ్లాను. అలాగనీ అక్కడ జరిగిన తప్పులన్నింటినీ నాపైన మోపడంసరికాదు. నేను నిజంగా తప్పు చేసి ఉంటే, అందుకు మీ దగ్గర తగిన ఆధారాలు, సాక్ష్యాలు ఉంటే సోషల్ మీడియాలో నా ఫొటో పెట్టండి.. కానీ ఎలాంటి ఆధారం లేకుండా నా ఫొటో వాడి నన్ను నెగెటివ్ చేయకండి. దీని వల్ల నా కెరీర్‌కు చాలా ఇబ్బంది అవుతుంది’
‘నేను ఎంతో కష్టపడి ఇంత దూరం వచ్చాను. ఫ్రెండ్ బర్త్‌డే అంటే ఎవరైనా వెళ్తారు. అలాగే, నేను కూడా ఆ అమ్మాయి నా స్నేహితురాలని అక్కడకు వెళ్లాను. అక్కడ జరిగిన పరిస్థితులకు నేను కారణం అన్నట్లుగా ఇప్పుడు నా ఫొటో లు వేస్తున్నారు. మీ ఫ్రెండ్ పుట్టినరోజు వేడుకల్లో ఏదైనా పొరపాటు జరిగితే మీరు బాధ్యత వహిస్తారా? కాదు కదా.. దయచేసి నా ఫొటోలు వాడకండి. నాకు, నా కెరీర్ కు చాలా ఇబ్బంది అవుతుంది. హీరో, విలన్ కొట్టుకుని మధ్యలో కమెడియను చంపేసినట్లు ఏంటండి ఇది. మంగ్లీ బర్త్‌డే పార్టీకి వెళ్లానే తప్ప అక్కడ జరిగిన పరిణామాలకు, నాకు ఎటువంటి సంబంధం లేదు’ అని క్లారిటీ ఇచ్చింది దివి. కాగా ఈ మధ్యన సినిమాలతోనూ బిజి బిజీగా ఉంటోంది బిగ్ బాస్ బ్యూటీ. ఇప్పుడు డ్రగ్స్ కేసులో ఆమె పేరు రావడంతో ఇలా వీడియో రిలీజ్ చేసి క్లారిటీ ఇచ్చింది.
మంగ్లీ బర్త్ డే పార్టీకి వెళ్లాను.. కానీ.. బిగ్ బాస్ దివి..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




