Hyderabad: వామ్మో.. హైదరాబాద్ సినిమా థియేటర్‌లో పాముల కలకలం.. బుసలు కొడుతూ సిబ్బందిపైకి.. వీడియో వైరల్
ఇతర సీజన్లతో పోల్చితే వానాకాలంలో పాములు బెడద ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పల్లెటూర్లలో ఉండేవారు ఈ వర్షాకాలంలో జాగ్రత్తగా ఉండాల్సిందే. అయితే ప్రస్తుతం పాములు ఏకంగా హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న ఒక ఫేమస్ థియేటర్ లోకి రావడం చర్చనీయాంశంగా మారింది.

సాధారణంగా వర్షాకాలంలో పాముల బెడద ఎక్కువగా ఉంటుంది. ఎక్కడైతే చీకటిగా ఉంటుందో, వెచ్చని ప్రదేశాలు ఉంటాయో అక్కడ తల దాచుకుంటాయి. ముఖ్యంగా పల్లెటూర్లలో పాముల బెడద ఎక్కువగా ఉంటుంది. అయితే ఇప్పుడు పాములు నగరవాసులను కూడా భయపెడుతున్నాయి. తాజాగా పాములు ఏకంగా హైదరాబాద్ లోని నగరం నడిబొడ్డున గల ఒక పెద్ద థియేటర్ లోకి రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎప్పటి లాగే థియేటర్ సిబ్బంది తమ విధుల్లో బిజీగా ఉన్నారు. 50 రూపాయల టికెట్ ఎంట్రీ వద్ద టికెట్ లు కొనుకున్న వాళ్లను థియేటర్ హాల్ లోకి పంపిస్తున్నారు. అయితే ఇంతలోనే అక్కడ ఓ రెండు పెద్ద పాములు బుసలు కొడుతూ సిబ్బందికి కనిపించాయి. చాలా పొడవుగా ఉన్న ఆ పాములని చూసి భయపడిపోయారు సిబ్బంది. వెంటనే అలెర్ట్ అయ్యి పాములు పట్టే స్నేక్ యూనిట్‌కి కాల్ చేసి రప్పించారు. వారు తెలివిగా పామును పట్టుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే ఈ ఘటనతో ఒక్కసారిగా థియేటర్ అంత గందర గోళం ఏర్పడింది. థియేటర్ హాల్ లోకి పాములు ఏమైన వెళ్లాయా.. అని అక్కడున్న సిబ్బంది బ్యాటరీలు, లైట్లు వేసుకుని మరీ చెక్ చేశారు. అయితే హాల్ లోనికి పాములు వెళ్లలేదని తెలియడంతో సిబ్బందితో పాటు సినిమా ప్రేక్షకులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతోంది. అయితే ఈ థియేటర్ లో పాములు కనిపించడం ఇటీవల పరిపాటిగా మారింది. తరచు థియేటర్స్‌లోకి పాములు వస్తున్నాయని సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇలా పాముల కలకలంతో మరోసారి వార్తల్లో కెక్కిన ఆ థియేటర్ మరేదో కాదు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సంధ్య. ఆ మధ్యన పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా ఇక్కడే తొక్కిసలాట జరిగి ఒక మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సంథ్య థియేటర్ పేరు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశమంతా మార్మోగింది. ఇప్పుడు ఇదే సంధ్య థియేటర్ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. సాధారణంగానే ఈ థియేటర్ కు జనాల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. అలాంటి థియేటర్‌లో ఇలా పాములు రావడంపై ప్రేక్షకులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై యాజమాన్యం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రేక్షకులు కోరుతున్నారు.
వీడియో ఇదిగో..
ఆర్టీసీ సంధ్య థియేటర్ వద్ద పాముల కలకలం
హైదరాబాద్ ఆర్టీసీ X రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద సిబ్బంది కంటపడ్డ పాములు
తరచూ పాములు వస్తున్నాయని సిబ్బంది ఆందోళన@HydPSPKFansRTCX @RtcxRoadNTRfans @NtrMaruthi9999 @laxman_travel #Telangana #Hyderabad #Congress #BRS #KTR #BJP… pic.twitter.com/h4W4F79Fhb
— Telugu Galaxy (@Telugu_Galaxy) June 11, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.