- Telugu News Photo Gallery Cinema photos Break for the Spy Universe with the movie War 2 know the details here
War 2: వార్ 2 సినిమాతో స్పై యూనివర్స్‌కు బ్రేక్ ?? యష్ రాజ్ ఫిల్మ్స్ సంచలన నిర్ణయం!
స్పై యూనివర్స్‌కు బ్రేకులు పడబోతున్నాయా..? ఇకపై ఇండియన్ స్క్రీన్ మీద స్పై బేస్డ్ యాక్షన్ డ్రామాలు చూడలేమా..? రెండు మూడు సినిమాలు అంచనాలు అందుకోకపోయేసరికి.. మొత్తం స్పై దుకాణమే మూసేయాలని యష్ రాజ్ ఫిల్మ్స్ డిసైడ్ అయిపోయారా..? ఈ యూనివర్స్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాతోనే ఎండ్ కానుందా..? అసలేం జరుగుతుంది స్పై యూనివర్స్‌లో..?
Updated on: Jun 11, 2025 | 7:10 PM

బాలీవుడ్‌లో స్పై యూనివర్స్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 13 ఏళ్ళ కింద సల్మాన్ ఖాన్ ఏక్ తా టైగర్‌తో మొదలైంది ఈ యూనివర్స్. ఆ తర్వాత అదే సిరీస్‌లో వచ్చిన టైగర్ జిందా హై బ్లాక్‌బస్టర్ అయింది.

ఇక షారుక్ ఖాన్ హీరోగా వచ్చిన పఠాన్ ఏకంగా 1000 కోట్లకు పైగా వసూలు చేసింది. వార్ సినిమా సైతం స్పై యూనివర్స్‌లో భాగంగానే వచ్చింది.. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా నటించిన ఈ సినిమా 2019లో విడుదలైంది.

పఠాన్ వరకు స్పై సినిమాలకు తిరుగులేదు.. కానీ సల్మాన్ ఖాన్ టైగర్ 3 నుంచి వార్నింగ్ బెల్స్ మోగాయి. ఫైటర్ సైతం అంచనాలు అందుకోలేదు. అన్ని సినిమాల్లోనూ ఒకే కథ ఉండటంతో ప్రేక్షకులు కూడా బోర్ ఫీల్ అవుతున్నారు.

వార్ 2లోనూ కొత్త కథ ఏమీ ఉండదని ఫిక్సైపోతున్నారు ఆడియన్స్. అందుకే స్పై సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని చూస్తుంది యష్ రాజ్ ఫిల్మ్స్. ఈ క్రమంలోనే షారుఖ్, సల్మాన్ హీరోలుగా ప్లాన్ చేసిన టైగర్ Vs పఠాన్ ఆలోచన మానుకున్నారు.

ఇదే జరిగితే స్పై సినిమాల్లో వార్ 2 చివరిది అవుతుంది. అలియా భట్‌తో ఆల్ఫా అనే లేడీ ఓరియెంటెడ్ స్పై సినిమా నిర్మిస్తుంది YRF. దీని తర్వాత స్పై సినిమాలు ఇక ఉండకపోవచ్చు.




