- Telugu News Photo Gallery Cinema photos Genelia Shares Looks Stunning Beautifull Photos In Her Social Media
Genelia: అందానికే అసూయ పుట్టిస్తున్న జెనిలియా..! 37 ఏళ్ల వయసులో స్టన్నింగ్ లుక్స్‌తో
మరచిపోతుందేమో కాలం పరిగెత్తడం నిన్ను చూశాక.. 37 ఏళ్ల వయసులో జెనిలీయా స్టన్నింగ్.. చిన్న వయసులోనే సినీరంగంలోకి అడుగుపెట్టింది. తక్కువ సమయంలోనే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు.. కెరీర్ మంచి పీక్స్ లో ఉండగానే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. ఇక ఇప్పుడు అందాల ఫోజులతో నెట్టింట మాయ చేస్తుంది.
Updated on: Jun 12, 2025 | 3:01 PM

జెనీలియా గురించి తెలుగు సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అవసరంలేదు. తెలుగుతోపాటు తమిళం, హిందీ భాషలలో అనేక చిత్రాల్లో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోల సరసన అనేక చిత్రాల్లో కనిపించింది.

ఆగస్టు 5, 1987న జన్మించిన జెనీలియా తుజే మేరీ కసమ్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో రితేష్ దేశ్ ముఖ్ హీరోగా నటించారు. మొదటి సినిమా సమయంలో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. కొన్నాళ్లపాటు ప్రేమలో ఉన్న వీరిద్దరు పెళ్లితో ఒక్కటయ్యారు.

బాయ్స్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన జెనీలియా.. ఆ తర్వాత బొమ్మరిల్లు, సాంబ, ఆరెంజ్, నా అల్లుడు వంటి చిత్రాల్లో నటించింది. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే తన ప్రియుడు రితేష్ దేశ్ ముఖ్ ను 2012లో ఇరు కుటుంబాల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు.

జెనీలియా భర్త రితేశ్ దేశ్ ముఖ్ రాజకీయ కుటుంబానికి చెందినవారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్ రావ్ తనయుడు. మొదట్లో వీరి ప్రేమకు రితేశ్ తండ్రి అంగీకరించలేదు. కానీ తర్వాత వీరి పెళ్లిని ఒప్పుకున్నారు. జెనీలియా, రితేశ్ దంపతులకు ఇద్దరు అబ్బాయిలు.

చాలా సంవత్సరాలు సినీరంగానికి దూరంగా ఉన్న జెనీలియా... ఇప్పుడిప్పుడే సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం హిందీలో వరుస సినిమాల్ల నటిస్తుంది. తాజాగా ఆమె ఇన్ స్టాలో షేర్ చేసిన ఫోటోస్ కట్టిపడేస్తున్నాయి. అందంలో అప్సరసలా కనిపిస్తుంది.




