Tollywood: బుల్లితెరపై అందమైన విలన్.. చీరకట్టులోనూ గ్లామర్ ఫోజులు.. ఈ బ్యూటీ గుర్తుందా.. ?
బుల్లితెరపై విలన్ పాత్రతో అదరగొట్టేసింది. అందంలో అప్సరస.. అయినప్పటికీ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించి తనదైన నటనతో మెస్మరైజ్ చేసింది. ఇప్పుడు సీరియల్స్ కు దూరంగా ఉన్న ఈ అమ్మడు.. ఇప్పుడు సోషల్ మీడియాలో అందాల బీభత్సం సృష్టిస్తుంది. ఇంతకీ ఈ వయ్యారి గుర్తుందా..?
Updated on: Jun 12, 2025 | 3:44 PM

సీరియల్లో విలన్ పాత్రతో రఫ్పాడించింది. కానీ అందంలో కుర్రకారును మాయ చేసింది. ప్రస్తుతం ఈ అమ్మడు లేటేస్ట్ సారీ లుక్ ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి. తెల్ల చీరలో మెస్మరైజ్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. మోనితా పాత్రతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది.

ఆమె మరెవరో కాదండి.. కార్తీక దీపం సీరియల్ ద్వారా మోనిత పాత్రతో తెగ ఫేమస్ అయిన శోభా శెట్టి. ఇందులో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో తనదైన నటనతో అదరగొట్టేసింది. ఈ సీరియల్లో డాక్టర్ బాబు, వంటలక్కతోపాటు శోభాకు సైతం సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది.

శోభా శెట్టి.. కార్తీక దీపం తర్వాత బిగ్ బాస్ రియాల్టీ షోలోకి అడుగుపెట్టి విపరీతమైన నెగిటివిటీని సొంతం చేసుకుంది. ఈ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత మరో సీరియల్ చేయలేదు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం క్రేజీ ఫోటోస్ షేర్ చేస్తుంది.

హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందంతో ఉన్న ఈ అమ్మడు సీరియల్స్ లో ప్రధాన పాత్రలు కాకుండా పవర్ ఫుల్ విలన్ పాత్రలతోనే ప్రేక్షకులకు దగ్గరయ్యింది. బుల్లితెరపై అందమైన విలన్ గా క్రేజ్ సొంతం చేసుకుంది. తాజాగా ఈ అమ్మడు నెట్టింట షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి.

ఇటీవలే తన ప్రియుడితో నిశ్చితార్థం జరుపుకున్న శోభా.. త్వరలోనే పెళ్లి పీటలెక్కనుంది. కార్తీక దీపం నటుడు యశ్వంత్ తో శోభా శెట్టి కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. తన ప్రియుడిని బిగ్ బాస్ స్టేజ్ పై పరిచయం చేసింది. ప్రస్తుతం యశ్వంత్ బుల్లితెరపై పలుసీరియల్స్ చేస్తున్నారు.




