AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vaikuntha Ekadashi 2025: వైకుంఠ ఏకాదశి ఎప్పుడు? పూర్తి వివరాలు.. ఆ రోజున ఈ 5 పనులు చేసిన వారికి తిరుగులేని ఐశ్వర్యం..!

హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన తిథుల్లో ఏకాదశికి ప్రత్యేక స్థానం ఉంది. అందులోనూ 'వైకుంఠ ఏకాదశి' అంటే వైకుంఠ ద్వారాలు తెరుచుకునే రోజుగా భక్తులు విశ్వసిస్తారు. ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వచ్చింది? ఆ రోజున ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే కలిగే ఫలితం ఏమిటి? ఉపవాస నియమాలు ఎలా ఉండాలో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Vaikuntha Ekadashi 2025: వైకుంఠ ఏకాదశి ఎప్పుడు? పూర్తి వివరాలు.. ఆ రోజున ఈ 5 పనులు చేసిన వారికి తిరుగులేని ఐశ్వర్యం..!
Vaikuntha Ekadashi 2025 Date
Bhavani
|

Updated on: Dec 27, 2025 | 2:00 PM

Share

కోరిన కోర్కెలు తీర్చే రోజు.. మోక్షాన్ని ప్రసాదించే తిథి.. అదే ముక్కోటి ఏకాదశి! శ్రీమహావిష్ణువును, లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో కొలిచే ఈ పర్వదినం 2025లో డిసెంబర్ 30న రానుంది. ఈ రోజున ఉపవాసం ఉంటే గత జన్మల పాపాలు తొలగిపోవడమే కాకుండా, మరణానంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఆ రోజు పాటించాల్సిన విధివిధానాలు మీకోసం.

పుష్య మాసంలో వచ్చే శుక్ల పక్ష ఏకాదశినే ‘వైకుంఠ ఏకాదశి’ లేదా ‘ముక్కోటి ఏకాదశి’ అని పిలుస్తారు. ఈ రోజున విష్ణుమూర్తి కొలువై ఉండే వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయని, ఆ రోజు స్వామిని దర్శించుకుంటే సకల పాపాలు హరిస్తాయని భక్తుల ప్రగాఢ నమ్మకం.

ముఖ్యమైన తేదీ, సమయాలు:

వైకుంఠ ఏకాదశి తేదీ: డిసెంబర్ 30, 2025 (మంగళవారం)

ఏకాదశి తిథి ప్రారంభం: డిసెంబర్ 30 ఉదయం 7:51 గంటలకు.

ఏకాదశి తిథి ముగింపు: డిసెంబర్ 31 ఉదయం 5:01 గంటలకు.

ఉదయ తిథి ప్రకారం: డిసెంబర్ 30న పండుగ జరుపుకోవాలి.

వైకుంఠ ఏకాదశి విశిష్టత: దీనిని ‘మోక్షద ఏకాదశి’ అని కూడా అంటారు. ఈ రోజున ఉపవాసం ఉండి శ్రీమన్నారాయణుడిని పూజించడం వల్ల సంతాన సౌఖ్యం, దీర్ఘాయువు మరియు మోక్షం లభిస్తాయి. ముఖ్యంగా సంతానం లేని దంపతులు ఈ వ్రతాన్ని ఆచరిస్తే సత్ఫలితాలు ఉంటాయని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.

పాటించాల్సిన నియమాలు:

స్నానం, సంకల్పం: తెల్లవారుజామునే నిద్రలేచి, స్నానమాచరించి విష్ణుమూర్తిని ధ్యానించాలి.

ఉపవాసం: రోజంతా నిరాహారంగా ఉండాలి. సాధ్యం కాని వారు పండ్లు లేదా తులసి తీర్థం తీసుకోవచ్చు.

పూజ: లక్ష్మీనారాయణులకు ధూప, దీప, నైవేద్యాలు సమర్పించి, విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి.

జాగారం: ఏకాదశి రాత్రి నిద్రపోకుండా భగవంతుని నామస్మరణతో జాగారం చేయాలి.

దానం: ద్వాదశి రోజున (డిసెంబర్ 31) బ్రాహ్మణులకు లేదా పేదలకు అన్నదానం చేసి, ఆ తర్వాతే ఉపవాసం విరమించాలి.

ముందస్తు నియమం: ఏకాదశికి ముందు రోజు (డిసెంబర్ 29) సాయంత్రం నుంచే సాత్విక ఆహారం తీసుకోవాలి. బ్రహ్మచర్యం పాటించాలి మరియు నేలపై నిద్రించడం ఉత్తమం.

వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..
వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..
ఆ గ్రామంలో మందు ముట్టుకుంటే మడతడి పోద్ది.! ఉన్నది మన తెలంగాణలోనే.
ఆ గ్రామంలో మందు ముట్టుకుంటే మడతడి పోద్ది.! ఉన్నది మన తెలంగాణలోనే.
థార్‌లో రీల్స్ చేసి ట్రెండ్ అవుదామనుకున్నాడు.. కట్‌చేస్తే..
థార్‌లో రీల్స్ చేసి ట్రెండ్ అవుదామనుకున్నాడు.. కట్‌చేస్తే..
భరించలేని కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన మహిళ, కట్‌చేస్తే..
భరించలేని కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన మహిళ, కట్‌చేస్తే..
చిలగడదుంప చక్కెరను పెంచుతుందా ? తగ్గిస్తుందా ? తప్పక తెలుసుకోవాలి
చిలగడదుంప చక్కెరను పెంచుతుందా ? తగ్గిస్తుందా ? తప్పక తెలుసుకోవాలి
బరువు తగ్గాలా.. వింటర్ స్పెషల్ వేడివేడి స్ప్రింగ్ ఆనియన్ సూప్
బరువు తగ్గాలా.. వింటర్ స్పెషల్ వేడివేడి స్ప్రింగ్ ఆనియన్ సూప్
ఎవర్రా మీరంతా.! కట్ చేస్తే క్యాష్ వస్తుంది..
ఎవర్రా మీరంతా.! కట్ చేస్తే క్యాష్ వస్తుంది..
ఏంటీ.. ఆ పాపులర్ సింగర్ ఈ నటుడి కూతురా.. ?
ఏంటీ.. ఆ పాపులర్ సింగర్ ఈ నటుడి కూతురా.. ?
క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!