29 సెంచరీలు.. 10వేలకు పైగా రన్స్.. రికార్డులు కొల్లగొడుతోన్న 13 ఏళ్ల బుడ్డోడు.. టీమిండియా భవిష్యత్ ఆశాకిరణం
3 ఏళ్ల ఈ బుడ్డోడు బౌలర్లపై కనికరం లేకుండా విరుచుకుపడుతున్నాడు. సెంచరీల మీద సెంచరీలు కొట్టేస్తున్నాడు. ఇక అర్ధసెంచరీలకైతే లెక్కేలేదు. ఢిల్లీ జూనియర్ క్లబ్ క్రికెట్ టోర్నమెంట్‌లో అబీర్ సగటు 50 కంటే ఎక్కువ ఉండడం అతని అత్యద్భుత ఆటతీరుకు నిదర్శనం.

13 ఏళ్ల వయసు గల పిల్లలు సాధారణంగా ఏం చేస్తారు? స్కూలుకు వెళుతూ ఆటపాటలతో సరదాగా గడుపుతుంటారు. కానీ ఢిల్లీకి చెందిన అబీర్ నాగ్‌పాల్ మాత్రం క్రికెట్‌లో పరుగుల వర్షం కురిపిస్తున్నాడు. 13 ఏళ్ల ఈ బుడ్డోడు బౌలర్లపై కనికరం లేకుండా విరుచుకుపడుతున్నాడు. సెంచరీల మీద సెంచరీలు కొట్టేస్తున్నాడు. ఇక అర్ధసెంచరీలకైతే లెక్కేలేదు. ఢిల్లీ జూనియర్ క్లబ్ క్రికెట్ టోర్నమెంట్‌లో అబీర్ సగటు 50 కంటే ఎక్కువ ఉండడం అతని ఆటతీరుకు నిదర్శనం. చిన్న వయసులోనే క్రికెట్‌లో రికార్డులను కొల్లగొడుతోన్న నాగ్‌పాల్‌ను టీమిండియా భవిష్యత్ ఆశాకిరణంలా పరిగణిస్తున్నారు. జూనియర్ క్లబ్ క్రికెట్ టోర్నమెంట్‌లో అబీర్ పేరిట అద్భుతమైన రికార్డులు ఉన్నాయి. ఇప్పటివరకు మొత్తం 262 మ్యాచ్‌లు ఆడాడు. 255 ఇన్నింగ్స్‌లలో 50.01 సగటుతో 10,203 పరుగులు చేశాడు.
పేరు.. గుర్తుపెట్టుకోండి..
అబీర్ తన కెరీర్‌లో ఇప్పటివరకు 29 సెంచరీలు, 56 అర్ధ సెంచరీలు సాధించాడు. మొత్తం179 సిక్సర్లు, 1593 ఫోర్లు కొట్టాడు. అత్యధిక స్కోరు 158 నాటౌట్. ఇప్పటివరకు 41 సార్లు 30కి పరుగులు చేశాడు. నాగ్‌పాల్ ఆటతీరు అందరినీ ముగ్ధులను చేస్తుంది. అతనిని టీమిండియా భవిష్యత్ ఆశాకిరణంగా భావిస్తున్నారు. అబీర్.. ఈ పేరు గుర్తుంచుకోండి.. త్వరలోనే బ్లూ జెర్సీలో ఈ బుడ్డోడిని చూడొచ్చు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేస్తున్నారు.




This is Abeer Nagpal. He is just 13. Has aggregated close to 10000 runs in junior club cricket tournaments in Delhi. All documented. Remember the name ❤️❤️ pic.twitter.com/skuzkqy5L3
— Vijay Lokapally ?? (@vijaylokapally) December 31, 2022
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..
