Cricket: 11 బంతుల్లో 50 పరుగులు.. 8 ఫోర్లు, 3 సిక్సర్లతో తుఫాన్ ఇన్నింగ్స్.. ఈ ప్లేయర్ ఎవరంటే?
సాధారణంగా టీ20 మ్యాచ్‌లంటేనే చాలు.. రెండు ఇన్నింగ్స్‌లలోనూ పరుగుల వరద పారుతుంది. సరిగ్గా ఇక్కడ కూడా అదే జరిగింది. రెండు వైపులా..

సాధారణంగా టీ20 మ్యాచ్‌లంటేనే చాలు.. రెండు ఇన్నింగ్స్‌లలోనూ పరుగుల వరద పారుతుంది. సరిగ్గా ఇక్కడ కూడా అదే జరిగింది. రెండు వైపులా కలిపి 439 పరుగులు నమోదయ్యాయి. ఏకంగా 32 ఫోర్లు, 21 సిక్సర్లు బాదేశారు. ఈ మ్యాచ్ బ్రిస్బేన్ హీట్, సిడ్నీ సిక్సర్ల మధ్య బిగ్ బాష్ లీగ్‌లో చోటు చేసుకుంది. ఇందులో ఓ 23 ఏళ్ల ప్లేయర్ నాథన్ మెక్‌స్వీనీ మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించాడు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్రిస్బేన్ హీట్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ కొలిన్ మున్రో(10) త్వరగానే పెవిలియన్ చేరగా.. మరో ఓపెనర్ జోష్ బ్రౌన్(62) అర్ధ సెంచరీతో అదరగొట్టాడు. వన్‌డౌన్‌లో వచ్చిన 23 ఏళ్ల ప్లేయర్ నాథన్ మెక్‌స్వీనీ(84)తో కలిసి స్కోర్ బోర్డును వేగంగా కదిలించాడు. ఇద్దరూ కూడా రెండో వికెట్‌కు 70 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే జోష్ బ్రౌన్ అవుట్ కాగానే.. మెక్‌స్వీనీ గేర్ మార్చి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 8 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 51 బంతుల్లో 84 పరుగులు పూర్తి చేశాడు. అంటే కేవలం బౌండరీల రూపంలోనే 11 బంతుల్లో 50 పరుగులు చేశాడు. ఇన్నింగ్స్ చివరిలో పెవిలియన్ చేరాడు. అయితే అతడి తుఫాన్ ఇన్నింగ్స్ వల్ల బ్రిస్బేన్ హీట్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది.
అనంతరం భారీ లక్ష్యచేధనలో భాగంగా బరిలోకి దిగిన సిడ్నీ సిక్సర్లకు ఆరంభం పెద్దగా కలిసి రాలేదు. ఆ జట్టు బ్యాటర్లు రెండంకెల స్కోర్లు చేసినప్పటికీ ఎవ్వరూ భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. జేమ్స్ విన్స్(41), జోర్డాన్ సిల్క్(41) టాప్ స్కోరర్లగా నిలిచారు. బ్రిస్బేన్ హీట్ బౌలర్లలో నీసర్ 3 వికెట్లు, స్టేకేటీ, కుహ్నేమన్, వైట్‌లీ చెరో 2 వికెట్లు పడగొట్టారు. దీంతో సిడ్నీ సిక్సర్లు నిర్ణీత ఓవర్లకు 209 పరుగులకు ఆలౌట్ అయింది. తద్వారా బ్రిస్బేన్ హీట్ 15 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది.