AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2026లో శని-గురు గ్రహాల అద్భుత కలయిక, ఈ రాశులవారికి హ్యాపీడేస్ మొదలైనట్లే!

కొత్త సంవత్సరం రాబోతున్న సందర్బంలో చాలా మంది ఈ సమయం తమకు అనుకూలంగా ఉండాలని ఆశిస్తుంటారు. మొదలు పెట్టిన పనులు పూర్తి కావాలని, కొత్త పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతం కావాలని కోరుకుంటారు. అయితే, వచ్చే నూతన సంవత్సరం 2026లో శని, బృహస్పతి అద్భుత కలయితో పలు రాశులకు అనేక ప్రయోజనాలు అందిస్తున్నారు.

2026లో శని-గురు గ్రహాల అద్భుత కలయిక, ఈ రాశులవారికి హ్యాపీడేస్ మొదలైనట్లే!
Shani Guru
Rajashekher G
|

Updated on: Dec 28, 2025 | 11:49 AM

Share

మరికొన్ని రోజుల్లో 2025 నుంచి 2026 కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నందున చాలా మంది అనేక తీర్మానాలు చేసుకుంటూ ఉంటారు. గత సంవత్సరం కంటే వచ్చే ఏడాది తమకు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. పెండింగ్ పనులను పూర్తి చేసుకోవడం, కొత్త కార్యక్రమాలను ప్రారంభించడం లాంటివి చేస్తుంటారు. ఈ క్రమంలో చాలా మంది జ్యోతిష్యం ప్రకారం తమ భవిష్యత్తు ఎలా ఉంటుందోనని ఆసక్తిగా ఉంటారు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కొన్ని కీలక గ్రహాలు పలు రాశులకు మేలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఆ వివరాలు తెలుసుకుందాం.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వచ్చే నూతన సంవత్సరం బృహస్పతి(గురు), శని అద్భుత కలయితో కొన్ని రాశులకు మంచి జరుగనుంది. బృహస్పతి సింహరాశిలో, శని మీన రాశిలో ఉన్నారు. సింహరాశి వారికి శని రెండున్నర రోజుల్లో మార్పులు చూపబోతున్నారు. మీనరాశి వారికి అయితే రెండు గ్రహాల స్థితి కారణంగా ఒక యోగం ఏర్పడబోతోంది. ఇది కొన్ని రాశులకు ప్రయోజనం ఇస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

కర్కాటకం: ఈ రాశివారికి శని, బృహస్పతి స్థానం ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో రెండు గ్రహాల కారణంగా అదృష్ట కాలం మొదలవుతుంది. దీంతో గత కొన్ని రోజులుగా నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. కొన్ని విషయాలు మీకు అనుకూలంగా మారుతాయి. అంతేగాక, మీరు చేపట్టిన పనిని వేగంగా పూర్తి చేస్తారు. మతపరమైన ప్రదేశాలను సందర్శించుకుంటారు. దేశంలోపల, విదేశీ ప్రయాణాలు ఉండే అవకాశం ఉంది.

మిథునం: ఈ రాశిలో జన్మించిన వారికి శని, బృహస్పతి ప్రయోజనకారులుగా ఉన్నారు. ఈ సమయంలో మీరు ఉద్యోగంలో ఆశించిన విజయాలను అందుకుంటారు. పురోగతితోపాటు కొత్త ఆర్థిక వనరులు తెరుచుకుంటాయి. దీంతో మీకు పని నుంచి ఖాళీ సమయం లభించడం కొంత కష్టమవుతుంది. ఈ కాలంలో మీరు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఉద్యోగంలో ఉన్న వ్యక్తులు సానుకూల మార్పులను చూస్తారు. వారు చేసే పనులు విజయవంతమవుతాయి. వ్యాపారంలో ఆర్థిక లాభాలు ఉంటాయి.

కుంభం: ఈ రాశి వారికి బృహస్పతి, శని కలయిక సానుకూల ఫలితాలను అందిస్తుంది. ఇది సాడేసాత్ చివరి దశ. అందువల్ల శని మహారాజు బయల్దేరినప్పుడు పెద్ద ప్రయోజనం అందిస్తాడని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. అయితే, ఈ రాశివారు కష్టపడి పనిచేయడం, శ్రమించడం తప్పనిసరి. ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతి లేదా జీతంలో పెరుగుదల లభిస్తుంది. భాగస్వా్మ్య వ్యాపారంలో మీరు మంచి విజయాన్ని అందుకుంటారు. ఈ సమయంలో మీరు మీ ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది.