Ujjain: అక్కడ గణపతికి రాఖీ కట్టే మహిళలు.. దేశ విదేశాల నుంచి రాఖీలు.. స్వీట్స్ పంపుతున్న సోదరీమణులు.. ఎందుకంటే
జ్యోతిర్లింగ క్షేత్రం అయిన ఉజ్జయినిలోని బాబా మహంకాలేశ్వరుడికి రాఖీ కట్టడంతో రాఖీ పండగ సంబరాలు ప్రారంభం అయ్యాయి. మరోవైపు ఉజ్జయినిలోని బడా గణేష్‌కు దేశ, విదేశాల నుంచి సోదరీమణులు రాఖీలను పంపిస్తున్నారు. ఈ విషయంపై బడా గణేష్ ఆలయ పూజారి పండిట్ సుధీర్ వ్యాస్ మాట్లాడుతూ శ్రీ బడా గణేష్‌కు మన దేశం నలుమూల నుంచి మాత్రమే కాదు విదేశాల నుంచి వందలాది మంది సోదరీమణులు ఉన్నారని.. వారు ప్రతి ఏడాది రాఖీలు పంపుతారని చెప్పారు

ఉజ్జయిని నగరం అడుగడుగునా ఆధ్యాత్మిక ఉట్టిపడుతుంది. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం అయిన శ్రీ మహాకాళేశ్వర ఆలయంతో పాటు అనేక ప్రఖ్యాత ఆలయాలున్నాయి. శ్రీ మహాకాళేశ్వర ఆలయానికి సమీపంలో ఉన్న శ్రీ బడా గణేష్ ఆలయం 118 సంవత్సరాల పురాతనమైనది. ఇక్కడ శ్రీ గణేష్ కు దేశంలోనే కాకుండా విదేశాలలో కూడా చాలా మంది సోదరీమణులు ఉన్నారు. వారు రాఖీ పండగ రోజున తమ సోదరుడికి రాఖీ పంపడం ఎప్పటికీ మర్చిపోరు. రక్షా బంధన్ కోసం వారం రోజుల ముందు నుంచే బడా గణేష్ ఆలయానికి రాఖీలు రావడం ప్రారంభించాయి. ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి.
ఈ ఆలయం మహాకాళ మందిర సమీపంలోని లోయలో ఉన్న పురాతన శ్రీ బడా గణేష్ మందిర్‌గా ప్రసిద్ధి చెందింది. ఆలయ పూజారి పండిట్ సుధీర్ వ్యాస్ స్పందిస్తూ ప్రతి సంవత్సరం వలనే ఈ సంవత్సరం కూడా దేశం నలుమూల నుంచి మాత్రమే కాదు అమెరికా, సింగపూర్, హాంకాంగ్‌తో పాటు దేశ విదేశాల నుంచి గణపతికి అతని సోదరీమణులు వివిధ రకాల రాఖీలను పంపారని ఆయన చెప్పారు.
రాఖీ కట్టే ప్రక్రియ రోజంతా ప్రతి సంవత్సరం బడ గణేష్ సోదరీమణులు అతనికి చాలా రాఖీలు పంపుతారని, వాటిని మంత్రాలతో కట్టడానికి ఒక రోజంతా పడుతుందని చెబుతారు. ఆలయ పూజారి సోదరీమణులు పంపిన రాఖీలను శ్రీ గణేష్‌కు పూర్తి ఆచారాలతో కట్టి, సోదరీమణుల భావాలను దృష్టిలో ఉంచుకుని, వారు పంపిన స్వీట్లను భక్తులకు పంపిణీ చేస్తారు. ఈ రోజున ఆలయాన్ని అందంగా అలంకరించారు. స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. మహా హారతి కూడా నిర్వహిస్తారు.
అందుకే శ్రీ గణేష్‌ను సోదరుడిగా భావిస్తారు ఉజ్జయిని నగరంలో ప్రతి ఒక్కరూ శివుడిని తమ తండ్రిగా, పార్వతిని తమ తల్లిగా భావిస్తారు. అందుకే వినాయకుడిని తమ సోదరుడిగా నగర వాసులు భావిస్తారు. అందుకనే రాఖీ పండగ రోజున దేశ విదేశాల నుంచి వచ్చే ఈ రాఖీలతో పాటు భారీ సంఖ్యలో మహిళలు , బాలికలు శ్రీ బడా గణేష్ మందిర్‌కు చేరుకుని గణేశుడి మణికట్టుకి రాఖీ కడతారు, రాఖీ కట్టిన తర్వాత గణేశుడి దీర్ఘాయుష్షు కోసం కూడా ప్రార్థిస్తారు. ఈ ఆలయం దాదాపు 118 సంవత్సరాల పురాతనమైనది. అందుకే వందలాది మంది ప్రజల విశ్వాసం ఈ ఆలయంతో ముడిపడి ఉంది. చిన్న పిల్లల నుంచి వృద్ధ మహిళల వరకు శ్రీ గణేష్‌కు రాఖీ కట్టడానికి, బడా గణేష్‌తో ఈ పండుగను గొప్పగా జరుపుకోవడానికి ఆలయానికి చేరుకుంటారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.








