Viral News: ఇదేమి అన్యాయం సామీ.. కురచ దుస్తులు వేసుకోలేదని.. రెస్టారెంట్ లోకి నో ఎంట్రీ..
ఒక రెస్టారెంట్ 'పాశ్చాత్య' దుస్తుల కోడ్‌ను పాటించలేదని ఒక జంటను లోపలికి అనుమతించలేదు. భారతీయ సాంప్రదాయ దుస్తులు ధరించి వచ్చిన తమను రెస్టారెంట్ లోపలికి అనుమతించలేదని ఆ జంట రెస్టారెంట్ ఎదుట నిరసన తెలిపారు. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. కొత్తగా ప్రారంభించిన తుబాటా రెస్టారెంట్‌లో జరిగింది. అయితే ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. రెస్టారెంట్ తీరు సరికాదని నిరసన వ్యక్తం అవుడంతో రెస్టారెంట్ యజమాని క్షమాపణలు చెప్పింది.

ఢిల్లీలోని పితం పురాలోని ఒక రెస్టారెంట్ ‘పాశ్చాత్య’ దుస్తుల కోడ్ పాటించనందుకు ఒక జంటను లోపలికి రాకుండా అడ్డుకుంది. ఈ వార్తల్లో నిలిచినిడ్. సంప్రదాయా దుస్తులు ధరించినందుకు తమని లోపలి వేల్లనివ్వలేదని ఆ జంట తెలిపింది. ఈ సంఘటన ఆగస్టు 3న జరిగింది. ఒక భారతీయ జంట.. తమ స్నేహితులతో కలిసి ఎథెనిక్ దుస్తులు ధరించి వెళ్ళినందుకు రెస్టారెంట్ గేటు వద్ద అడ్డుకున్నారు. దీంతో తమని రెస్టారెంట్ లోపలికి ఎందుకు అనుమతించ లేదో తెలిపింది. అంతేకాదు పాశ్చాత్య దుస్తులు ధరించిన వ్యక్తులను, శరీరంలో కనిపించే విధంగా పొట్టి దుస్తులు ధరించిన వ్యక్తులను రెస్టారెంట్ లోకి ఎంట్రీ ఇస్తున్న విషయాని కూడా వీడియోలో వివరించారు.
See what is happening in Delhi restaurant Tubata in Pitampura. A couple was denied entry and not allowed to enter just because they were wearing Indian attire! pic.twitter.com/xCw5bFw0Zb
ఇవి కూడా చదవండి— Rosy (@rose_k01) August 8, 2025
వీడియో చూడండి:
Update : पीतमपुरा के इस रेस्टोरेंट के संचालकों ने स्वीकार कर लिया है कि परिधान आधारित कोई प्रतिबंध अब नहीं लगाएंगे व भारतीय परिधानों में आने वाले नागरिकों का स्वागत करेंगे
रक्षाबंधन पर भारतीय परिधानों में आने वाली बहनों को कुछ डिस्काउंट भी देंगे 🙂@gupta_rekha https://t.co/YFkmOaj8i7 pic.twitter.com/k0qRzyPCot
— Kapil Mishra (@KapilMishra_IND) August 8, 2025
వైరల్ అవుతున్న వీడియోలో ఈ జంట మంచి దుస్తులు ధరించి కనిపిస్తున్నారు. పురుషుడు టీ-షర్ట్, ప్యాంటు ధరించి ఉండగా మహిళ అందమైన సల్వార్-కమీజ్ ధరించి ఉంది. రెస్టారెంట్ తమ మనోభావాలను దెబ్బతీసిందని భారతీయ సంస్కృతిని , ఒక మహిళను అవమానించిందని ఆ జంట పేర్కొన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత పలువురు వ్యక్తులు రెస్టారెంట్‌ను మూసివేయాలని డిమాండ్ చేస్తున్నారు.
వీడియో రికార్డ్ చేస్తున్న మరొక వ్యక్తి, “ఈ రెస్టారెంట్ కాళ్ళు కనిపించేలా దుస్తులు ధరించే వ్యక్తులను మాత్రమే కోరుకుంటుంది. అయితే ఎప్పుడైనా రాష్ట్రపతి, ఢిల్లీ ముఖ్యమంత్రులు వంటి మహిళలు.. చీర ధరించి ఇక్కడికి వస్తే.. అప్పుడు కూడా మీరు ఇలా వారిని లోపలికి రాకుండా ఆపుతారా?” అని ప్రశ్నిస్తున్నాడు.
రెస్టారెంట్ ఏమని స్పందించిందంటే
అయితే ఈ విషయం సోసల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత రెస్టారెంట్ యజమాని ఒక వీడియో పోస్ట్ చేసి క్షమాపణలు చెప్పారు. ఢిల్లీలో బిజెపి ఉపాధ్యక్షుడు, క్యాబినెట్ మంత్రి కపిల్ మిశ్రా ఈ విషయంపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు. పితాంపురా రెస్టారెంట్ నిర్వాహకులు ఇకపై దుస్తులు ఆధారంగా ఎటువంటి ఆంక్షలు విధించబోమని, భారతీయ దుస్తులు ధరించి వచ్చే వారి స్వాగతిస్తామని చెప్పారని తెలిపారు.
రక్షాబంధన్ సందర్భంగా ప్రత్యేక ఆఫర్
రక్షాబంధన్ సందర్భంగా భారతీయ దుస్తులలో వచ్చే ‘సోదరీమణులకు’ ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్‌ను అందిస్తున్నట్లు రెస్టారెంట్ పేర్కొంది.
నెటిజన్ల స్పందన:
ఈ వీడియో వైరల్ అయినప్పటి నుండి సోషల్ మీడియాలో ఈ రెస్టారెంట్ పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో రెస్టారెంట్ అధికారిక పేజీ సోషల్ మీడియా పోస్ట్‌లపై ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. ఒకరు భారతదేశంలో మీ వ్యాపారాన్ని మూసివేయాలి. భారతదేశంలో భారతీయ జాతి దుస్తులు ధరించే కస్టమర్లకు ప్రవేశాన్ని నిరాకరించే ధైర్యం మీకు ఎలా వచ్చింది. వారు ఉచితంగా భోజనం చేయడానికి అక్కడికి రాలేదు. అని రాశారు. ఈ రెస్టారెంట్ ని బహిష్కరించాలని , రెస్టారెంట్‌ను శాశ్వతంగా మూసివేయాలని డిమాండ్ చేస్తూ అనేక మంది నిరసన తెలిపారు.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




