AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: పాము పిల్లలకు జన్మనిచ్చానని.. వాటిని చూస్తే చచ్చిపోతారని మహిళ రచ్చ రచ్చ.. వైద్యులు ఏమి చెప్పారంటే..

మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్‌లో ఒక వింత సంఘటన జరిగింది. ఒక మహిళ పాము పిల్లలకు జన్మనిచ్చిందనే పుకార్లు వ్యాపించాయి. రింకి అహిర్వార్ అనే మహిళ తాను మూడు పాము పిల్లలకు జన్మనిచ్చానని చెప్పడంతో ఆ ప్రాంతంలోని వారందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే రంగంలోకి దిగిన వైద్య బృందం ఈ విషయంపై దర్యపు చేసింది. అసలు నిజం పూర్తిగా భిన్నంగా ఉందని నిర్ధారించింది.

Viral News: పాము పిల్లలకు జన్మనిచ్చానని.. వాటిని చూస్తే చచ్చిపోతారని మహిళ రచ్చ రచ్చ.. వైద్యులు ఏమి చెప్పారంటే..
Chhatarpur Woman Gives Birth To SnakesImage Credit source: Free Press Journal
Surya Kala
|

Updated on: Aug 08, 2025 | 5:03 PM

Share

మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్‌లో ఒక వింత సంఘటన జరిగింది. ఒక మహిళ పాము పిల్లలకు జన్మనిచ్చిందని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలను ఛతర్‌పూర్ జిల్లా ఆసుపత్రి వైద్యులు కొట్టిపారేశారు. ఆ మహిళ గర్భవతి కాదు , ఆమె ఏ పాము పిల్లలకు జన్మనివ్వలేదు. వైద్య పరీక్షలో అది పాములా కనిపించే రక్తం గడ్డకట్టిన తీగలు మాత్రమేనని తేలిందని అవి పాములా కనిపించాయని వారు స్పష్టం చేశారు.

రింకి అహిర్వార్ అనే మహిళ తాను పాము పిల్లలకు జన్మనిచ్చానని చెప్పడంతో ఆ ప్రాంతంలోని ప్రతి ఒక్కరూ దిగ్భ్రాంతికి గురయ్యారని సమాచారం. అయితే వైద్యులు ఈ విషయంపై పరీక్షలు చేశారు. దర్యాప్తు తర్వాత .. వైద్యులు నిజం పూర్తిగా భిన్నంగా ఉందని నిర్ధారించారు.

ఇవి కూడా చదవండి

ఈ వింత సంఘటన ఖజురాహో ప్రాంతంలోని మౌమాసానియా గ్రామంలో జరిగింది. ఇది భయాందోళనలను ఉత్సుకతను సృష్టించింది.

ఏం జరిగిందంటే

హాల్కే అహిర్వార్ భార్య రింకికి అకస్మాత్తుగా కడుపు నొప్పి వచ్చింది. ఆ తర్వాత ఆమె రెండు పాము పిల్లలకు జన్మనిచ్చిందని చెప్పింది. వాటిని చూసిన ఎవరైనా చనిపోతారని కూడా ఆమె చెప్పింది. ఈ వార్త వ్యాపించడంతో గ్రామస్తులు ఆమె ఇంటి వద్ద గుమిగూడారు. బేబీ స్నేక్స్ అని పిలువబడే పాములను ప్లాస్టిక్ గిన్నె కింద ఉంచారు.

ఆ తర్వాత రింకీని రాజ్‌నగర్ హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్లారు. ఆ సెంటర్ BMO డాక్టర్ అవధేష్ చతుర్వేది మాట్లాడుతూ, “రింకీ ఇటీవలే తనకు రుతుక్రమం ప్రారంభమైందని చెబుతూ మా ఆసుపత్రికి వచ్చింది. తర్వాత ఆగిపోయిందని చెప్పింది. పరీక్ష చేసినప్పు ఆమె గర్భవతి కాదని స్పష్టమైంది” అని అన్నారు.

ఆమె పిల్ల పాములు అని భావించినవి వాస్తవానికి రక్తం గద్దకట్టడం. ఇవి కొన్నిసార్లు దారంలాగా లేదా పొడవుగా కనిపిస్తాయని చెప్పారు. కొంత సమయం తర్వాత పాము వంటి తీగలు కరిగిపోయాయి. ఈ విషయాన్ని స్త్రీ కూడా అంగీకరించింది. అయితే ఆమెకు ఇంకా కొంచెం కడుపు నొప్పి ఉంది. దీంతో మరిన్ని వైద్య పరీక్షల నిమిత్తం ఛతర్‌పూర్‌లో అల్ట్రాసౌండ్ స్కాన్‌కు సిఫార్సు చేయబడింది. మానవులు పాముల వంటి సరీసృపాలకు జన్మనివ్వడం జీవశాస్త్రపరంగా అసాధ్యమని నిపుణులు వైద్యులు వివరించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..