AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

28 ఏళ్ల క్రితం చనిపోయాడు.. ఇప్పటికీ మృతదేహాం చెక్కుచెదరలేదు.. ఎలాగో తెలిస్తే అవాక్కవుతారు!

పొరుగుదేశం పాకిస్తాన్ ఆశ్చర్యకర ఘటన వెలుగు చూసింది. 1997 ఏళ్ల క్రితం గ్రామం నుంచి పారిపోతూ మంచుకొండల్లో పడిపోయిన ఒక యువకుడి మృతదేహాం తాజాగా మంచుకరగడంతో బయపటపడింది. సుమారు 28 ఏళ్లు గడిచినా మృతదేహం చెక్కుచెదరకుండా అలానే ఉండడంతో అది చూసిన స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు.

28 ఏళ్ల క్రితం చనిపోయాడు.. ఇప్పటికీ మృతదేహాం చెక్కుచెదరలేదు.. ఎలాగో తెలిస్తే అవాక్కవుతారు!
Preserved Body Found In Pak
Anand T
|

Updated on: Aug 08, 2025 | 3:19 PM

Share

28 ఏళ్ల క్రితం మంచుకొండల్లో పడిపోయిన ఒక యువకుడి మృతదేహాం తాజాగా మంచుకరగడంతో బయటపడిన ఘటన పొరుగుదేశమైన పాకిస్తాన్‌లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. పాకిస్థాన్ లోని ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో కోహిస్థాన్‌కు చెందిన నసీరుద్దీన్ స్థానికంగా కుంటుంబంతో కలిసి నివసించేవాడు. అయితే 1997లో వాళ్ల గ్రామంలో గొడవలు చెలరేగడంతో నసీరుద్దీన్, తన సోదరుడు కథీరుద్దీన్‌తో కలిసి గ్రామం నుంచి పారిపోయాడు. ఈ క్రమంలో ఒక మంచు కొండ పై నుంచి నసీరుద్దీన్ లోయలో పడిపోయాడు.

ఈ విషయాన్ని అతని సోదరి కథీరుద్దీన్ వెంటనే వెనక్కి వెళ్లి కుటుంబ సభ్యులకు తెలియజేసింది. దీంతో కుటుంబ సభ్యులు నసీరుద్దీన్‌ కోసం చాలా రోజుల పాటు లోయలో గాలింపు చేపట్టారు. కానీ వారికి నసీరుద్దీన్ ఆచూకీ మాత్రం లభించలేదు. దీంతో నసీరుద్దీన్ చనిపోయుంటాడనుకున్నారు. కనీసం మృతదేహమైన దొరుకుతుందేమోననే ఆశలో మళ్లీ గాలింపు చేపట్టినా ఎలాంటి లాభం లేకపోయింది. దీంతో వెతడం మానేశారు.

అయితే తాజాగా 28 ఏళ్ల తర్వాత అతడు తప్పిపోయిన ప్రాంతంలో ఉన్న మంచుకొండ కరగడంతో మంచులో చిక్కుకుపోయిన నసీరుద్దీన్ మృతదేహం బటయపడింది. అయితే బాడీ మంచులో ఉండడంతో ఏళ్లు గడిచినా చెక్కుచెదరలేదు. దీంతో అటుగా వెళ్తున్న కొందకు గ్రామస్తులు నజీర్ మృతదేహాన్ని గుర్తించి పోలీసులు, వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని అతని కుటుంబ సభ్యులకు అందజేశారు. దీంతో వాళ్లు కొడుకు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించి ఉపసమనం పొందారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.