- Telugu News Photo Gallery Spiritual photos According to zodiac signs, which Shankh conch shell should be kept at home
Astro Tips for Shell: ఆనందం, శాంతి, శ్రేయస్సు, సానుకూల శక్తికి చిహ్నం శంఖం.. ఈ రాశి ప్రకారం ఏ శంఖాన్ని ఇంట్లో పెట్టుకోవాలంటే
సనాతన ధర్మంలో శంఖానికి ప్రత్యేక స్థానం ఉంది. క్షీరసాగర మధన సమయంలో ఉద్భవించిన సంపదల్లో శంఖం ఒకటని పురాణాలు చెబుతున్నాయి. లక్ష్మీదేవికి శంఖం సహోదరుడని విష్ణు పురాణం చెబుతోంది. లక్ష్మీ దేవికి ప్రియమైన శంఖం దైవిక వస్తువులలో ఒకటి. శంఖం రెండు సంస్కృత పదాల కలయిక. శం అంటే మంచి అని, ఖం అనగా జలం అనే అర్థం. ఇంట్లో శంఖం పెట్టుకోవడం వలన ఆనందం, శాంతి, శ్రేయస్సు , సానుకూల శక్తిని తెస్తుందని నమ్మకం. అయితే అందరికీ కానీ ఒకే రకమైన శంఖం తగినది కాదు. మీ రాశిచక్రం ప్రకారం మీ జీవితంలో ఏ శంఖం శుభాన్ని తెస్తుందో తెలుసుకోండి.
Updated on: Aug 08, 2025 | 3:45 PM

హిందూ మతంలో శంఖానికి ప్రత్యేక మతపరమైన, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. దీనిని లక్ష్మీదేవి, విష్ణువుకు చిహ్నంగా భావిస్తారు. శంఖం నుంచి వచ్చే శబ్దం ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. అంతేకాదు ఇంట్లో శంఖం ఉనికి అదృష్టం, శ్రేయస్సు, శాంతికి చిహ్నంగా పరిగణించబడుతుంది. అయితే జ్యోతిష్య, వస్తు శాస్త్రం సహా పురాణ గ్రంథాల ప్రకారం ఒకే రకమైన శంఖం ఇంట్లో పెట్టుకోవడం అందరికీ తగినది కాదు. ప్రతి రాశికి ఒక నిర్దిష్ట శంఖం శుభప్రదంగా వర్ణించబడింది. శంఖాలలో వివిధ రకాలున్నాయి.

మేషం, సింహ, ధనుస్సు (అగ్ని రాశి): ఈ రాశుల వారికి దక్షిణవర్తి శంఖం (దక్షిణ దిశగా నోరు తెరుచుకుంటుంది) ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. ఈ శంఖం ధైర్యం, ఆత్మవిశ్వాసం, సామర్థ్యాన్ని పెంచుతుంది.

వృషభం, కన్య, మకరం (భూమి మూలక రాశులు): ఈ రాశికి చెందిన వ్యక్తులు ఇంట్లో వామవర్తి శంఖం (సాధారణ శంఖం లాగా ఎడమ వైపున తెరుచుకుంటుంది) పెట్టుకోవడం శుభప్రదం. ఇది ఇంట్లో స్థిరత్వాన్ని తెస్తుంది. అంతేకాదు ఇంట్లో సిరి సంపదలకు లోతులేకుండా చేస్తుంది.

మిథునం, తుల, కుంభం (వాయు రాశులు): ఈ రాశుల వారికి గణేష్ శంఖం లేదా పరాడ్ శంఖం ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ శంఖాలు మనస్సును ప్రశాంతపరుస్తాయి. సంబంధాలలో సమతుల్యతను కాపాడుతాయి. అయితే గణేష్ శంఖం వినాయకుడికి ప్రతీకగా, అడ్డంకులను తొలగించి, జ్ఞానం , సంపదను ప్రసాదిస్తుందని నమ్ముతారు. పరాడ్ శంఖం బుధుడికి సంబంధించినది. ఈ రెండిటినీ ఆధ్యాత్మిక ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. రెండూ వేర్వేరు ప్రాముఖ్యతలను కలిగి ఉన్నాయి.

కర్కాటకం, వృశ్చికం, మీనం (నీటి మూలక రాశులు): ఈ రాశికి చెందిన వ్యక్తులు లక్ష్మీ శంఖం లేదా పంచముఖి శంఖాన్ని పూజించడం చాలా శుభప్రదం. ఇది మానసిక ప్రశాంతత, ప్రేమ, ఆధ్యాత్మిక పురోగతిని ఇస్తుంది.





