Love Astrology: ఈ రాశులకు ప్రేమ యోగం.. ప్రేమ వ్యవహారాల్లో విజయాలు పక్కా..!
కొన్ని రాశుల వారు ఒక పట్టాన ప్రేమలో పడరు. ప్రేమలో పడితే మాత్రం ఆ ప్రేమ జీవితాంతం కొనసాగుతుంది. వీరితో ప్రేమలో పడడం నిజంగా అదృష్టం. అక్టోబర్ వరకు శుక్రుడు, వచ్చే ఏడాది జూన్ వరకు గురువు బాగా అనుకూలంగా ఉండడం వల్ల ఈ రాశులవారు అనుకోకుండా ప్రేమల్లో పడడం, ప్రేమించినవారినే పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. ఈ రాశులు వృషభం, మిథునం, కన్య, తుల, ధనుస్సు, కుంభం. వీరికి ప్రస్తుతం ప్రేమ యోగం పట్టింది. మిగిలిన రాశుల వారు కొద్ది కాలం పాటు ప్రేమ ప్రయత్నాలకు దూరంగా ఉండడం మంచిది. ప్రేమ కారకుడైన శుక్రుడు మరో రెండు నెలల పాటు విజృంభించబోతున్నాడు. గురుడి దయ వల్ల ఆ ప్రేమలు పెళ్లికి దారితీసే అవకాశం ఉంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6