AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: రండిరా రండి… మీకోసమే వెయిటింగ్‌… రోడ్డపక్కన షాకింగ్‌ సీన్‌తో వాహనదారుల పరుగో పరుగు

గుజరాత్‌లోని జునాగఢ్‌లోని బిల్ఖా రోడ్డులో వాహనదారులకు ఓ షాకింగ్‌ సీన్‌ కనిపించింది. దాంతో ఒక్కసారికి వణికిపోయారు. రోడ్డు పక్కన నిల్చుని ఉన్న ఓ సింహాం వాహనదారుల కంటపడింది. దీంతో ఆ రోడ్డుపై తీవ్ర అలజడి రేగింది. ఆగస్టు 5న జరిగిన ఈ సంఘటన...

Viral Video: రండిరా రండి... మీకోసమే వెయిటింగ్‌... రోడ్డపక్కన షాకింగ్‌ సీన్‌తో వాహనదారుల పరుగో పరుగు
Lion Beside Road
K Sammaiah
|

Updated on: Aug 08, 2025 | 5:46 PM

Share

గుజరాత్‌లోని జునాగఢ్‌లోని బిల్ఖా రోడ్డులో వాహనదారులకు ఓ షాకింగ్‌ సీన్‌ కనిపించింది. దాంతో ఒక్కసారికి వణికిపోయారు. రోడ్డు పక్కన నిల్చుని ఉన్న ఓ సింహాం వాహనదారుల కంటపడింది. దీంతో ఆ రోడ్డుపై తీవ్ర అలజడి రేగింది. ఆగస్టు 5న జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వేగంగా వైరల్ అవుతోంది.

వైరల్ వీడియోలో, వాహనాలు రద్దీగా ఉండే రోడ్డుపై పరుగులు పెడుతున్నాయి. ఒక వ్యక్తి దృష్టి రోడ్డు పక్కన నిలబడి ఉన్న సింహం వైపు పడింది. దానిని చూసిన కొంతమంది భయపడి వెంటనే తమ వాహనాలను ఆపివేశారు. మరికొందరు వెంటనే తమ రూట్‌ను మార్చుకుని అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయారు.

అదే సమయంలో, ధైర్యం చూపించిన కొంతమంది వ్యక్తులు తమ వాహనాల నుండి దిగి మృగ రాజును వీడియోను తీయడం ప్రారంభించారు. వైరల్ అయిన 17 సెకన్ల వీడియో క్లిప్‌లో, సింహం పూర్తిగా ప్రశాంతంగా నిలబడి, ప్రజలను చూస్తూ ఉండటం కనిపిస్తుంది.

వీడియోలో, సింహం ఎవరిపైనా దాడి చేయడానికి ప్రయత్నించకుండా ప్రశాంతంగా ఉండటం కనిపిస్తుంది. కానీ ఒక వ్యక్తి చేతిలో కర్రతో సింహం వైపు వేగంగా శబ్దాలు చేసుకంటూ వెళ్లడం కనిపిస్తుంది. ఆ వ్యక్తి చర్యలతో సింహం భయపడి అడవిలోకి వాపస్‌ వెళుతుంది. ఆ ప్రాంతం గిర్ నేషనల్ పార్క్ కి ఆనుకొని ఉండటం వలన తరచుగా ఇలాంటి దృశ్యాలు కనిపిస్తాయని స్థానికులు చెబుతున్నారు.

వీడియో చూడండి:

ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది, దీనిపై చాలా మంది నెటిజన్లు ఫన్నీ రియాక్షన్లు ఇచ్చారు. భాయ్ సాహబ్ బెత్తంతో ఉన్న ఆత్మవిశ్వాసం చూడటం విలువైనది అని కామెంట్‌ చేశారు. అతను సింహాన్ని కుక్కలా తిట్టాడని మరొక యూజర్ అన్నాడు. సింహం కూడా ఎక్కడికి వచ్చిందో ఆలోచిస్తూ ఉండాలి మిత్రమా అంటూ మరొక యూజర్‌ పోస్టు పెట్టాడు.