AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: అమ్మాయి ఏడుపా మజాకా..దెబ్బకు ట్రాఫిక్‌ వ్యాన్‌ దిగొచ్చిన స్కూటీ… రోడ్డు మీద ఇల్లుపీకి పందిరేసిన మహిళ వీడియో వైరల్‌

కొంతమంది ట్రాఫిక్‌ సెన్స్‌ లేకుండా తమ వాహనాలను రోడ్డు పక్కన ఎక్కడైనా పార్క్ చేసి వెళ్లిపోతుంటారు. ముఖ్యంగా, 'నో పార్కింగ్' బోర్డు ఉన్న చోట కూడా ఉద్దేశపూర్వకంగా తమ వాహనాలను అక్కడే పార్క్ చేస్తారు. అలాంటి ప్రదేశంలో స్కూటీని పార్క్ చేయడం వల్ల ఒక అమ్మాయికి పోలీసులు...

Viral Video: అమ్మాయి ఏడుపా మజాకా..దెబ్బకు ట్రాఫిక్‌ వ్యాన్‌ దిగొచ్చిన స్కూటీ... రోడ్డు మీద ఇల్లుపీకి పందిరేసిన మహిళ వీడియో వైరల్‌
Woman Crying Traffic Vehicl
K Sammaiah
|

Updated on: Aug 08, 2025 | 6:11 PM

Share

కొంతమంది ట్రాఫిక్‌ సెన్స్‌ లేకుండా తమ వాహనాలను రోడ్డు పక్కన ఎక్కడైనా పార్క్ చేసి వెళ్లిపోతుంటారు. ముఖ్యంగా, ‘నో పార్కింగ్’ బోర్డు ఉన్న చోట కూడా ఉద్దేశపూర్వకంగా తమ వాహనాలను అక్కడే పార్క్ చేస్తారు. అలాంటి ప్రదేశంలో స్కూటీని పార్క్ చేయడం వల్ల ఒక అమ్మాయికి పోలీసులు చుక్కలు చూయించారు. ట్రాఫిక్ పోలీసులు రహస్యంగా వచ్చి ఆ మహిళ స్కూటీని తీసుకెళ్లడం ప్రారంభించారు. కానీ ఆ అమ్మాయి వారిని చూడగానే ఆమె బహిరంగంగా ఏడుపు షురూ చేసింది. దీంతో పోలీసులే కాదు.. అక్కడున్న వారంతం షాక్‌ అయ్యారు. ఆ అమ్మాయి ఏడుపును చూసి ఇన్స్పెక్టర్ కూడా నవ్వడం ప్రారంభించాడు.

వైరల్ అవుతున్న వీడియోలో ట్రాఫిక్ పోలీసు వాహనం రోడ్డు పక్కన పార్క్ చేసిన అనేక బైక్‌లు, స్కూటర్‌లను తీసుకెళ్తున్నట్లు చూడవచ్చు. వారిలో ఒక అమ్మాయి స్కూటీ కూడా ఉంది. ఇది చూసిన అమ్మాయి వెంటనే వాహనం వద్దకు పరిగెత్తుకొస్తుంది. చిన్నపిల్లలా బిగ్గరగా ఏడవడం ప్రారంభించింది. తర్వాత, ఆమె వాహనంలో ఉంచిన తన స్కూటీని పట్టుకుని తనను విడిచిపెట్టమని పోలీసులను వేడుకుంది. వీడియోలో, ఆ అమ్మాయి స్నేహితురాలు ఆమెను శాంతింపజేయడానికి ప్రయత్నిస్తున్నట్లు మీరు చూస్తారు, కానీ ఆ మహిళ వినడానికి ససేమిరా అంటూ ఏడుపు మాత్రం ఆపలేదు.

ఈ వీడియోలోని అత్యంత హాస్యాస్పదమైన భాగం ఏమిటంటే, అమ్మాయి ఏడుపు చూసి పోలీసు కూడా నవ్వడం ప్రారంభించాడు. నవ్వుతూ అతను డ్రైవర్‌ను ముందుకు వెళ్ళమని సిగ్నల్ ఇస్తాడు. కానీ ఆ అమ్మాయి తన స్కూటీని వదిలి వెళ్ళదు. చివరికి, పోలీసుల హృదయాలు కరిగిపోతాయి. ఆఖరికి అమ్మాయి స్కూటీని వదిలి వెళ్ళారు.

వీడియో చూడండి:

ఈ వీడియోను సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్స్‌ ఫన్నీ కామెంట్ష్ చేస్తున్నారు. కొంతమంది సరదాగా గడుపుతుండగా, చాలా మంది నెటిజన్లు పోలీసుల మానవత్వాన్ని ప్రశంసిస్తున్నారు.

అమ్మాయిల విషయంలోనే మానవత్వం బతికి ఉంది అంటూ ఒక యూజర్‌ పోస్టు పెట్టారు. అదే అబ్బాయి అయితే, పోలీసులు అతన్ని స్కూటీతో పాటు తీసుకెళ్లేవారు అంటూ మరొక నెటిజన్‌ కామెంట్‌ చేశారు. ఇది అమ్మాయి వ్యవహారం బాబు భయ్యా అని మరొకరు పోస్టు పెట్టారు.