AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kulgam Encounter: కుల్గాంలో ఉగ్రవాదులతో ఎన్ కౌంటర్.. ఇద్దరు సైనికులు అమరులు.. 9 రోజులుగా కొనసాగుతున్న ఎన్ కౌంటర్

జమ్మూ కాశ్మీర్ లోని కుల్గాంలో గురువారం రాత్రి ఉగ్రవాదులు, భద్రతా సిబ్బందితో జరిగిన ఎన్ కౌంటర్ లో 4 మంది సైనికులు గాయపడ్డారు, ఈ ఆపరేషన్ 9వ రోజు కూడా కొనసాగుతోంది. ఇందులో ఇద్దరు సైనికులు అమరులయ్యారు. ఈ మొత్తం ఆపరేషన్ లో ఇప్పటివరకు 11 మంది సైనికులు గాయపడ్డారు. ఉగ్రవాదులను పూర్తిగా తుడిచిపెట్టే వరకూ ఆపరేషన్ కుల్గాం కొనసాగుతోందని ఆపరేషన్ అధికారి ఒకరు తెలిపారు.

Kulgam Encounter: కుల్గాంలో ఉగ్రవాదులతో ఎన్ కౌంటర్.. ఇద్దరు సైనికులు అమరులు.. 9 రోజులుగా కొనసాగుతున్న ఎన్ కౌంటర్
Kulgam Encounter
Surya Kala
|

Updated on: Aug 09, 2025 | 10:12 AM

Share

జమ్మూ కాశ్మీర్‌లోని కుల్గాంలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ 9వ రోజు కూడా కొనసాగుతోంది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఆర్మీ సైనికులు అమరులయ్యారు. శుక్రవారం రాత్రి ఉగ్రవాదులు, భద్రతా సిబ్బంది మధ్య జరిగిన కాల్పుల్లో నలుగురు భద్రతా సిబ్బంది గాయపడ్డారని, విధి నిర్వహణలో ఇద్దరు భద్రతా సిబ్బంది అమరులయ్యారని అధికారులు తెలిపారు. గత పదేళ్లలో జరిగిన అతి పొడవైన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో ఇది ఒకటి అని వారు తెలిపారు. కుల్గాంలో ‘అఖల్ ఆపరేషన్’ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 11 మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని చెప్పారు.

ఇద్దరు సైనికులు మృతి, 11 మందికి గాయాలు

ఇవి కూడా చదవండి

భారత సైన్యంలోని చినార్ కార్ప్స్ తన సోషల్ మీడియా ఖాతాలో కుల్గాం ఆపరేషన్‌లో అమరులైన సైనికుల గురించి సమాచారాన్ని అందించింది. దేశం కోసం అమరులైన ధైర్యవంతులైన లెఫ్టినెంట్ కల్నల్ ప్రిత్‌పాల్ సింగ్, జవాన్ హర్మిందర్ సింగ్‌ల త్యాగానికి చినార్ కార్ప్స్ సెల్యూట్ చేస్తుందని ఆయన రాశారు. వీరి ధైర్యం, అంకితభావం ఎల్లప్పుడూ మనకు స్ఫూర్తినిస్తాయని చెప్పారు. ఇంకా ఆపరేషన్ ఇప్పటికీ కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు.

పోస్ట్‌ను ఇక్కడ చూడండి:

‘ఆపరేషన్ అఖల్’ ఆగస్టు 1న ప్రారంభమైంది. ఆగస్టు 1న ప్రారంభమైన ఈ ఎన్‌కౌంటర్‌లో ఇప్పటివరకు ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్లు అధికారులు తెలిపారు. దక్షిణ కాశ్మీర్ జిల్లాలోని అఖల్‌లోని అడవిలో ఉగ్రవాదులు ఉన్నట్లు నిఘా సమాచారం అందడంతో భద్రతా దళాలు కార్డన్ ఆన్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. గత శుక్రవారం ఇరుపక్షాల మధ్య జరిగిన కాల్పుల తర్వాత..రాత్రికి ఆపరేషన్‌ను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. తరువాత కార్డన్‌ను బలోపేతం చేసి, అదనపు సైనికులను ఆ ప్రాంతానికి పంపారు.

మర్నాడు కాల్పులు తిరిగి ప్రారంభమైనప్పుడు ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. హతమైన ఉగ్రవాదుల గుర్తింపు, వారి బృందం ఇంకా నిర్ధారించబడలేదని అధికారులు తెలిపారు.

ఉగ్రవాదుల ఏరివేత ఇంకా కొనసాగుతోంది. భద్రతా దళాలు ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టాయని, దట్టమైన అడవుల్లో దాక్కున్న ఉగ్రవాదులతో నిరంతరం పోరాడుతున్నాయని అధికారులు తెలిపారు. జమ్మూ కాశ్మీర్ పోలీస్ చీఫ్ నళిన్ ప్రభాత్, ఆర్మీ నార్తర్న్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ప్రతీక్ శర్మతో సహా సీనియర్ పోలీసు, సైనిక అధికారులు 24 గంటలూ ఆపరేషన్‌ను నిశితంగా గమనిస్తున్నారని వారు తెలిపారు.

డ్రోన్లు, హెలికాప్టర్లు నిఘా అడవిలో ఉగ్రవాదులను గుర్తించడానికి భద్రతా దళాలు డ్రోన్లు, హెలికాప్టర్లను ఉపయోగించాయి. పారా కమాండోలు కూడా దాక్కున్న ఉగ్రవాదులను చంపడంలో భద్రతా దళాలకు సహాయం చేస్తున్నారు. ఉగ్రవాదులు కొండ ఎత్తైన ప్రాంతంలో దాక్కున్నారు. అక్కడి నుంచి సైనికుల ప్రతి కార్యకలాపాలను గమనిస్తున్నారు. దీని కారణంగా వారు ఎప్పటికప్పుడు తమ స్థానాన్ని మారుస్తున్నారు. సైనికులు వారిని చేరుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..