Krishna Janmashtami: జన్మాష్టమిన మానవుడి జీవనాన్ని సుందరంగా తీర్చి దిద్దే భగవద్గీతలోని క్రియా యోగం విశిష్టత ఏమిటంటే
శ్రీ మహా విష్ణువు అవతారమైన శ్రీ కృష్ణ భగవానుడి జన్మదినం వేడుకలు జరుపుకోవడం కోసం భక్తులు కన్నయ్య ఆలయాలకు చేరుకుంటారు. ఆలయాలను అందంగా అలంకరిస్తారు. మరికొందరు స్వయంగా తమ ఇళ్ళలోని పూజా మందిరాలను కూడా అలంకరిస్తారు. జన్మాష్టమి ఉత్సవాన్ని చిన్న పిల్లలకు ఎలా వేడుక జరుపుతామో అలాజరుపుకోవాలని నియమం ఉంది.

కురుక్షేత్ర యుద్ధ సమయంలో శ్రీ కృష్ణుడు అర్జునుడి ధర్మాన్ని, కర్మ ఫలాన్ని ఉపదేశిస్తూ.. సమస్తమానవాళికి అందించిన పవిత్ర గ్రంథం భగవద్గీత. సాక్షాత్తు కృష్ణ భగవానుడు బోధించిన జ్ఞానం ఉన్న గీత హిందువులకు పరమ పవిత్ర గ్రంథాల్లో ఒకటి. “ఓ అర్జునా, నీవు ఒక యోగివి కమ్ము, కురుక్షేత్ర యుద్ధరంగంలో పలికిన ఈ అమర వాక్కులతో కృష్ణ భగవానుడు ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్న భక్తుడిని అంతిమ మోక్షం కోసం యోగ మార్గాన్ని అవలంబించమని బోధించాడు. భగవద్గీత మానవ జీవిత లక్ష్యాన్ని తెలియజేయడమే కాదు.. మనిషి జీవన ప్రయాణాన్ని అన్వేషించవలసిన అంతిమ సత్యం గురించి వివరిస్తుంది. కొంతవరకూ నివ్వెరపోయి, భయాందోళనలకు గురైన తన శిష్యుడికి.. ధర్మానికి అన్నిటికన్నా ప్రాముఖ్యత నివ్వమని, మోహంతో కర్మఫలాలకు బంధీ కావొద్దని స్వయంగా భగవానుడే ఇచ్చిన త్రికాలాలకు అతీతమైన ప్రవచనం ఈ పవిత్ర గ్రంథంలో ఉన్నది.
శ్రీ శ్రీ పరమహంస యోగానంద.. రచించిన ఒక యోగి ఆత్మకథ ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ఆధ్యాత్మిక కళాఖండంగా ఖ్యాతిగాంచింది. ఇందులో శ్రీ కృష్ణుడు అర్జునుడికి చెప్పిన జీవిత సందేశాన్ని, జీవన ప్రయాణం వాస్తవాన్ని చెప్పిన దానిని శ్రీ శ్రీ పరమహంస యోగానంద “భగవానుడు-అర్జునుల సంవాదం” అనే పేరుతో రచించారు.
మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధంలో జరిగిన ప్రతి సంఘటన మానవుడి మనస్సులో నిరంతరం జరిగే అంతరింగికంగా జరిగేదే అని యోగానంద పేర్కొన్నారు. ప్రతి మానవుడికి జీవితంలో జరిగే సంఘటనలు మంచి చెడులను సంస్కారంతో జయించి తీరవలసిందే అని అప్పుడే మనిషి భగవంతుడికి చెరువుఅవుతామని చెప్పాడు.
బాలకృష్ణుడు తన తల్లి దేవకి గర్భాన జన్మించిన రోజుని ప్రతి సంవత్సరం జన్మాష్టమిగా జరుపుకుంటారు. ప్రపంచ వ్యాప్తంగా సంగీతంతో నిండిన అందమైన ఉత్సవాలను రాత్రంతా జరుపుకుంటారు. శ్రీ మహా విష్ణువు అవతారమైన శ్రీ కృష్ణ భగవానుడి జన్మదినం వేడుకలు జరుపుకోవడం కోసం భక్తులు కన్నయ్య ఆలయాలకు చేరుకుంటారు. ఆలయాలను అందంగా అలంకరిస్తారు. మరికొందరు స్వయంగా తమ ఇళ్ళలోని పూజా మందిరాలను కూడా అలంకరిస్తారు. జన్మాష్టమి ఉత్సవాన్ని చిన్న పిల్లలకు ఎలా వేడుక జరుపుతామో అలాజరుపుకోవాలని నియమం ఉంది. కృష్ణుడిని పూజిస్తూ.. ఆయన లీలలను గానం చేస్తూ.. కృష్ణ సేవను చేయాలి.
యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియాను శ్రీ శ్రీ పరమహంస యోగానంద 1917లో స్థాపించారు. ఈ సంస్థ క్రియాయోగ ధ్యాన పద్ధతిని ప్రపంచ వ్యాప్తంగా వ్యాపింపజేసే తీసుకుంది. అమర గురువులైన మహావతార్ బాబాజీ క్రియాయోగ సంప్రదాయాన్ని గొప్ప యోగావతారులైన లాహిరీ మహాశయులకు ప్రదానం చేశారు, ఆయన తిరిగి ఆ శాస్త్రాన్ని యోగానంద ఆధ్యాత్మిక గురువైన జ్ఞానావతారులు స్వామి శ్రీయుక్తేశ్వర్ గిరికు బోధించారు.
కృష్ణ భగవానుడు, భగవద్గీతలోని శ్లోకాల్లో రెండుసార్లు క్రియా యోగం గురించి ప్రస్తావించారు. ఈ యోగం మానవుల జీవితనానికి అత్యున్నత శాస్త్రం. ఇది ఆధ్యాత్మిక సాధకుడిని భగవంతుడితో ఏకత్వమనే తన లక్ష్యం వైపు ప్రోత్సహిస్తుంది. కనుక కన్నయ్య జన్మాష్టమి రోజున సమస్త జీవ కోటి శ్రేయస్సు కోరుతూ మనలోని ఉన్న కృష్ణ తత్వాన్ని మేల్కొల్పి.. ఆయన తత్వాన్ని బోధనలను అనుసంధానం చేస్తూ జీవించడానికి ప్రయత్నిద్దాం..
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..