AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాస్తు టిప్స్ : మీ ఇంట్లో హనుమాన్ ఫొటో ఉందా.. ఈ విషయాలో జాగ్రత్త!

చాలా మంది తమ ఇంటిలో ఉన్న ప్రతికూల శక్తి తగ్గిపోవడం కోసం హనుమంతుడి ఫొటోను ఇంటిలో పెట్టి పూజించుకుంటారు. అయితే హనుమాన్ ఫొటో ఇంటిలో ఉంటే తప్పకుండా కొన్ని వాస్తు నియమాలు పాటించాలంట. లేకపోతే ఆర్థిక , అనారోగ్య సమస్యలు తప్పవు అని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. కాగా ఎలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: Jan 06, 2026 | 3:29 PM

Share
శ్రీరాముడి భక్తుడైన హనుమంతుడిని భక్తి శ్రద్ధలతో పూజించడం వలన కష్టాలు తొలిగిపోతాయని చెబుతున్నారు పండితులు. హనుమాన్ ధైర్యం, శాంతి, ఆత్మవిశ్వాసానికి కారకుడు. అందుకే ఎవరు అయితే అతన్ని భక్తితో పూజిస్తారో, వారి జీవితంలో సమస్యలు తొలిగిపోయి, అన్నింట్లో విజయాన్ని పొందుతూ ఆనందంగా ఉంటారంట.

1 / 5
అందుకే చాలా మంది ఇంటిలో హనుమాన్ ఫొటోను పెట్టుకొని మరి ప్రతి మంగళవారం లేదా శని వారం పూజలు చేస్తుంటారు. అయితే హనుమాన్ సంబంధించిన అనేక రూపాలు ఉన్నాయి. అందులో ఉగ్రరూపం, పర్వతాన్ని ఎత్తడం, ఐదు ముఖాలు కలిగి ఉండటం, రామ భక్తి, గద పట్టుకొని ఉండటం, లంకను దహనం చేయడం, బాల హనుమంతుడు, ఇలా ఎన్నో రూపాలు ఉన్నాయి.

2 / 5
అయితే వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటిలోపల హనుమంతుడు పర్వతాన్ని ఎత్తే ఫొటో ఉండటం మంచిదంట. ఇది బలం, ఆత్మవిశ్వాసాన్ని సూచిస్తుంది. ఎట్టి పరిస్థితిల్లో ఇంటిలోపల హనుమంతుడి ఉగ్రరూపంలో ఉన్న ఫొటో ఉండకూడదంట. ఇది ఇంటిలో ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తుందని చెబుతున్నారు నిపుణులు. శాంతిగా, ప్రశాంతంగా, ఉన్న హనుమాన్ ఫొటో మాత్రమే ఇంటిలో ఉండాలంట.

3 / 5
అదే విధంగా ఇంటిలో హనుమాన్ ఫొటో పెట్టే సమయంలో తప్పకుండా వాస్తు నియమాలు పాటించాలి. ముఖ్యంగా దిశ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలంట. హనుమంతుడి చిత్రం దక్షిణ వైపుగా ఉండేలా చూసుకోవాలి. దక్షిణం వైపు నుంచి వచ్చే ప్రతికూల శక్తులు హనుమాన్ ప్రభావంతో నశించి, ఇంటిలో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.

4 / 5
అలాగే ఎట్టి పరిస్థితుల్లో హనుమాన్ ఫొటోను, బెడ్ రూమ్‌లో పెట్టకూడదంట. ఆయన బ్రహ్మచారి కాబట్టి ఆయన చిత్ర పటాన్ని పడక గదిలో ఉంచుకోవడం అశుభకరం అంటారు పండితులు. లివింగ్ రూమ్‌లో లేదా ప్రార్థన మందిరంలో హనుమాన్ చిత్రపటం పెట్టుకోవడం మంచిది.

5 / 5