- Telugu News Photo Gallery Spiritual photos Janmashtami 2023: If you want to bring Laddu Gopal home on Janmashtami, then first know the rules in telugu
Janmashtami 2023: రేపే జన్మాష్టమి.. బాల గోపాలుడిని ఇంట్లో పూజించాలనుకుంటున్నారా.. పూజా నియమాలు మీకోసం
హిందువులు మాత్రమే కాదు అనేక విదేశాల్లో విదేశీయులనుంచి పూజలను అందుకుంటున్నాడు శ్రీ కృష్ణుడు. కన్నయ్య భక్తులు కృష్ణ సేవే పరమ ధర్మంగా భావిస్తారు. ఈ నేపథ్యంలో జన్మాష్టమిని జరుపుకోవడానికి కన్నయ్య భక్తులు రెడీ అవుతున్నారు. ఈ పవిత్రమైన పండుగ శ్రీకృష్ణుడికి అంకితం చేయబడింది. ఈ కృష్ణ జన్మాష్టమికి గోపాలసేవ పాలనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. హిందూమతంలో తెలుగు క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలోని కృష్ణ పక్ష అష్టమి తిథి రోజున జన్మాష్టమి పండుగను జరుపుకుంటారు. కృష్ణ జన్మాష్టమి రోజున భక్తులు రోజంతా ఉపవాసం ఉంటారు. ఈ ఏడాది సెప్టెంబర్ 6వ తేదీ బుధవారం జన్మాష్టమి జరుపుకోనున్నారు.
Updated on: Sep 05, 2023 | 8:51 PM

జన్మాష్టమి పండుగ రోజును శ్రీ కృష్ణుడి జన్మదినంగా జరుపుకుంటారు. శ్రీకృష్ణుదీని బాల గోపాలుడిగా భావించి ఆయన్ని జన్మాష్టమి నాడు పూజిస్తారు. జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని చాలా మంది కృష్ణుని బాల రూపమైన గోపాలుడి విగ్రహాలను ఇంటికి తీసుకువస్తారు. ఈ నేపథ్యంలో జన్మాష్టమిని ఇంట్లో చేసుకోవడానికి కొన్ని నియమాలున్నాయి. ఈ రోజు అవి ఏమిటో తెల్సుకుందాం.. బాల గోపాలుడిని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ముందుగా కృష్ణసేవ చేయాలి. కన్నయ్య పూజకు ఉన్న నియమాలను అనుసరించడం ద్వారా, కృష్ణుని అనుగ్రహంతో సుఖ సంపదలు లభిస్తాయని విశ్వాసం.

లడ్డూ గోపాల విగ్రహానికి వాతావరణానికి అనుగుణంగా ఉదయం చల్లటి లేదా వేడి నీటితో క్రమం తప్పకుండా స్నానం చేయించాలి. ఆ తరువాత, శుభ్రంగా తుడిచి.. మంచి బట్టలు ధరింపజేయాలి.

బాల గోపాలుడిని అందమైన బట్టలను ఎంచుకుని వాటితో అందంగా అలంకరించాలి. ఆ బట్టలు రోజూ మార్చాలి. ఆ తర్వాత ప్రతిరోజూ బాల గోపాలుడిని అలంకరించాలి. ఈ అలంకరణలో చెవిపోగులు, మణికట్టుకు కంకణం, వేణువు, చేతికి నెమలి ఈక, తలపై కిరీటం అలంకరించి నుదుటిపై చందన తిలకం దిద్దాలి.

కృష్ణ గోపాలుడిని నిత్యం పూజించాలి. ఉదయం, సాయంత్రం గోపాల్‌కి లడ్డూ నైవేద్యంగా పెట్టండి. అయితే కన్నయ్యకు పెట్టె ఆహారం సాత్వికంగా ఉండాలి. అలాగే తులసి ఆకులను నైవేద్యం పెట్టె ఆహారంలో చేర్చండి. రాత్రి శుభ్రమైన మంచం మీద పడి చిన్న పిల్లవాడిలా పడుకోబెట్టండి. ఆ తర్వాత కన్నయ్య గది తలుపు మూసి వేయాలి.

కన్నయ్య నిద్రించే సమయంలో లాలి పాటలను పాడవచ్చు. గోపాలుడికి చిన్న పిల్లాడిలా సేవ చేయాలి. ఎందుకంటే జన్మాష్టమి రోజున లడ్డు గోపాలుడు శ్రీకృష్ణుని బాల రూపం. కాబట్టి కన్నయ్య ను చిన్నపిల్లాడిలా భావించి సేవ చేయాలి.

అదే సమయంలో బాల గోపాలుడిని ఇంట్లో ఏర్పాటు చేసుకుంటే.. ఎక్కువ సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉంచరాదు. ఎక్కడైనా ఊరు వెళ్లాల్సి వచ్చినా లేదా ఎక్కువ సేపు బయటకు వెళితే.. ఖచ్చితంగా బాల గోపాలుడిని మీతో తీసుకెళ్లాలి. లేదంటే మీరు ఇంటికి తిరిగి వచ్చే వరకూ మీ బంధువులకు లేదా స్నేహితులకు కన్నయ్యను అప్పగించి పూజాదికార్యక్రమాలను నిర్వహించమని చెప్పాలి





























