భార్య తన భర్తకు ఈ 5 సీక్రెట్స్ అస్సలు చెప్పదు.. ఎందుకో తెలుసా..?
ఎంతటి గాఢమైన అనుబంధంలోనైనా కొన్ని విషయాలు రహస్యంగానే ఉండిపోతాయి. ముఖ్యంగా మహిళలు తమ భాగస్వామి పట్ల ఎంతో ప్రేమను కలిగి ఉన్నప్పటికీ, కొన్ని విషయాలను మాత్రం వారి వద్ద అస్సలు వెల్లడించరు. అది మోసం చేయాలన్న ఉద్దేశంతో కాదు.. ఆ బంధం పదికాలాల పాటు చల్లగా ఉండాలని. ఇంతకీ ప్రతి అమ్మాయి తన మనసులో దాచుకునే ఆ రహస్యాల గురించి తెలుసుకుందాం..

ప్రేమ లేదా పెళ్లి.. ఏ బంధమైనా నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. అయితే భాగస్వాముల మధ్య ఎంతటి సాన్నిహిత్యం ఉన్నప్పటికీ, స్త్రీలు కొన్ని విషయాలను తమ భర్త వద్ద చాలా రహస్యంగా ఉంచుతారని మానసిక నిపుణులు చెబుతుంటారు. ఈ విషయాలను దాచడం అంటే మోసం చేయడం కాదు, తమ బంధం ప్రశాంతంగా ఉండాలని, అనవసర గొడవలు రాకూడదనే ఉద్దేశంతోనే వారు ఈ నిర్ణయం తీసుకుంటారు. మరి అమ్మాయిలు తమ భాగస్వామి నుండి దాచే ఆ ఐదు ఆసక్తికర రహస్యాలేంటో ఇప్పుడు చూద్దాం.
గత సంబంధాల లోతు
చాలామంది మహిళలు తమ గతాన్ని పంచుకున్నప్పటికీ ఆ పాత బంధం ఎంత బలంగా ఉండేది, తాము అందులో ఎంత నిబద్ధతతో ఉన్నాము అనే పూర్తి వివరాలను వెల్లడించరు. ప్రస్తుత భాగస్వామి తనను గతంతో పోల్చి చూస్తాడేమో లేదా అనుమానిస్తాడేమో అన్న భయం దీనికి ప్రధాన కారణం.
శారీరక అభద్రతాభావం
ప్రతి అమ్మాయికి తన రూపం, శరీరం లేదా కొన్ని లోపాల గురించి లోలోపల అభద్రతాభావం ఉంటుంది. కానీ తన భాగస్వామి ముందు ఎప్పుడూ ఆత్మవిశ్వాసంతోనే కనిపించాలని కోరుకుంటారు. తమ బలహీనతలు బయటపడితే భాగస్వామి దృష్టిలో చిన్నచూపు అవుతామేమో అన్న సంకోచం వారిలో ఉంటుంది.
మనసులోని రహస్య కోరికలు
అమ్మాయిలు తమ మనసులోని కొన్ని ప్రత్యేక కోరికలను లేదా అంచనాలను నేరుగా చెప్పడానికి వెనుకాడతారు. “నేను అడగకుండానే నా భాగస్వామి నా మనసును అర్థం చేసుకోవాలి” అని వారు బలంగా కోరుకుంటారు. తమ ఆలోచనలను చెబితే భాగస్వామి ఎలా రియాక్ట్ అవుతారోనన్న భయం వారిని మౌనంగా ఉంచుతుంది.
కుటుంబం – స్నేహితుల అభిప్రాయాలు
స్నేహితులు లేదా కుటుంబ సభ్యులు తమ భర్త గురించి చేసే కొన్ని ప్రతికూల వ్యాఖ్యలను వారు భాగస్వామికి చెప్పరు. ఒకవేళ ఆ విషయాలు చెబితే వారి మధ్య దూరం పెరుగుతుందని, అనవసరమైన వాదనలు వస్తాయని భావించి, ఆ విషయాలను తమ దగ్గరే దాచేస్తారు.
ఆర్థిక స్వేచ్ఛ – వ్యక్తిగత పొదుపు
నేటి కాలంలో మహిళలు ఆర్థికంగా స్వతంత్రులుగా మారుతున్నారు. తమ ఆదాయం ఎంత, వ్యక్తిగత ఖర్చులు ఎంత అనే విషయాల్లో కొంత గోప్యతను పాటిస్తారు. భవిష్యత్తు అవసరాల కోసం లేదా అత్యవసర పరిస్థితుల కోసం తమ దగ్గర కొంత డబ్బును రహస్యంగా పొదుపు చేయడం స్త్రీల నైజం.
ఏ బంధంలోనైనా ప్రతి చిన్న విషయాన్ని పంచుకోవడం సాధ్యం కాకపోవచ్చు. అయితే ఈ రహస్యాలు అవతలి వ్యక్తిని బాధపెట్టనంత వరకు, బంధాన్ని కాపాడుకోవడానికి ఉపయోగపడేంత వరకు ఎటువంటి ఇబ్బంది ఉండదని నిపుణుల అభిప్రాయం.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




