AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కీలక నిర్ణయం.. వారికి అదనంగా..

తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకంలో కీలక మార్పులు చేసింది. ఈ పథకంలో నిరుపేదలకు, వెనుకబడిన వర్గాలకు పెద్దపీట వేసింది. పారిశుద్ధ్య కార్మికులు, ట్రాన్స్‌జెండర్లు, దివ్యాంగులు, ఆదివాసీలు వంటి ప్రత్యేక కేటగిరీల కోసం సంచలన నిర్ణయం తీసుకుంది. సామాజిక సమానత్వమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

Telangana: తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కీలక నిర్ణయం.. వారికి అదనంగా..
Telangana Indiramma Indlu Scheme
Krishna S
|

Updated on: Jan 05, 2026 | 6:05 PM

Share

సొంత గూడు లేని నిరుపేదల కల సాకారం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ప్రతిష్టాత్మక ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా సమాజంలో వెనుకబడిన, ప్రత్యేక వర్గాలకు పెద్దపీట వేస్తూ రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అదనంగా 35,921 ఇళ్లను ప్రత్యేక కేటగిరీల కింద మంజూరు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

ఎవరికి ఈ అదనపు లబ్ధి?

సమాజంలో వివక్షకు గురవుతున్న వారికి, శారీరక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి అండగా నిలవాలన్నదే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. ఈ అదనపు ఇళ్ల ప్రయోజనం పారిశుద్ధ్య కార్మికులు, ట్రాన్స్‌జెండర్లు, అనాథలు, దివ్యాంగులు, వితంతువులు, వ్యవసాయ కార్మికులు, ఆదివాసీలకు అందనుంది.

ఆదివాసీల కోసం ప్రత్యేక జీవో..

ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే ఆదివాసీల పట్ల ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించింది. గిరిజన ప్రాంతాల భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా, వారు స్వయంగా ఇళ్లు నిర్మించుకోవడం కష్టమని భావించి, ప్రభుత్వమే నేరుగా ఇళ్లను నిర్మించి ఇచ్చేలా ప్రత్యేక జీవోను తీసుకువచ్చింది. ఇక ఇతర లబ్ధిదారులకు నిర్మాణ ఖర్చుల కోసం మహిళా సంఘాల ద్వారా రుణాలు ఇప్పించి, ఆర్థిక భరోసా కల్పించనుంది.

ఇవి కూడా చదవండి

యుద్ధ ప్రాతిపదికన నిర్మాణాలు.. గణాంకాలు ఇవే

రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి ఏటా 3,500 ఇళ్ల చొప్పున మొత్తం 4.50 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో పనులు వేగంగా సాగుతున్నాయి. మొత్తం మంజూరైన ఇళ్లు: 3.69 లక్షలు ప్రారంభమైన పనులు: 2.45 లక్షలు వివిధ దశల్లో ఉన్నవి: 84 వేలు (పునాది), 43 వేలు (గోడలు), 52 వేలు (శ్లాబ్) ముగింపు దశలో: 1,311 ఇళ్లు సిద్ధంగా ఉన్నాయి.

సామాజిక సమానత్వమే లక్ష్యం

కేవలం ఇళ్లు కట్టడమే కాకుండా సమాజంలో వెనుకబడిన వర్గాలకు ఆశ్రయం కల్పించడం ద్వారా సామాజిక భద్రతను పెంపొందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రతి దశలోనూ నిధులను నేరుగా విడుదల చేస్తూ పారదర్శకతకు ప్రాధాన్యత ఇస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి మెజారిటీ ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించాలని క్షేత్రస్థాయి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు అందాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

భారత్‌లో ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్.. వీటిల్లో భారీ మార్పులు
భారత్‌లో ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్.. వీటిల్లో భారీ మార్పులు
2026లో రూ.20 వేలలోపు బడ్జెట్‌ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్‌!
2026లో రూ.20 వేలలోపు బడ్జెట్‌ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్‌!
తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. ఆ టికెట్ల జారీలో మార్పులు
తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. ఆ టికెట్ల జారీలో మార్పులు
సగం నిమ్మకాయ మంత్రంతో మీ వంటింట్లో దగదగలే..! నిమిషాల్లో
సగం నిమ్మకాయ మంత్రంతో మీ వంటింట్లో దగదగలే..! నిమిషాల్లో
ఎవడు మమ్మీ వీడు.! సచిన్, ధోనిలకే సాధ్యం కానిది చేసి చూపించాడుగా..
ఎవడు మమ్మీ వీడు.! సచిన్, ధోనిలకే సాధ్యం కానిది చేసి చూపించాడుగా..
నా భార్య వంట చేయడం లేదు.. విడాకులు ఇవ్వండి..
నా భార్య వంట చేయడం లేదు.. విడాకులు ఇవ్వండి..
ఆ స్టార్ ప్లేయర్ కెరీర్‌కు ఎండ్ కార్డ్? వరల్డ్ కప్ తర్వాత..
ఆ స్టార్ ప్లేయర్ కెరీర్‌కు ఎండ్ కార్డ్? వరల్డ్ కప్ తర్వాత..
పడుకునే ముందు యూట్యూబ్‌ చూసే అలవాటు ఉందా?
పడుకునే ముందు యూట్యూబ్‌ చూసే అలవాటు ఉందా?
ఏపీ ప్రజలకు భారీ శుభవార్త.. ప్రభుత్వం నుంచి సంక్రాంతి గిఫ్ట్
ఏపీ ప్రజలకు భారీ శుభవార్త.. ప్రభుత్వం నుంచి సంక్రాంతి గిఫ్ట్
గిరిజన హక్కుల కోసం FRA డిజిటల్ ప్లాట్‌ఫామ్.. ఢిల్లీలో వర్క్‌షాప్!
గిరిజన హక్కుల కోసం FRA డిజిటల్ ప్లాట్‌ఫామ్.. ఢిల్లీలో వర్క్‌షాప్!