TCC 2026 Exam Dates: తెలంగాణ టీసీసీ పరీక్షల తేదీలు వచ్చేశాయ్.. ఇంతకీ ఎప్పట్నుంచంటే?
టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు (టీసీసీ) పరీక్షల తేదీలు విడుదలయ్యాయి. తాజా ప్రకటన మేరకు ఈ పరీక్షలు జనవరి 10 నుంచి 13వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ పీవీ శ్రీహరి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను అధికారిక వెబ్‌సైట్..

హైదరాబాద్, జనవరి 5: తెలంగాణ టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు (టీసీసీ) పరీక్షల తేదీలు విడుదలయ్యాయి. తాజా ప్రకటన మేరకు ఈ పరీక్షలు జనవరి 10 నుంచి 13వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ పీవీ శ్రీహరి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఆయన సూచించారు. అభ్యర్ధులు ఈ మేరకు హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకుని పరీక్షలకు సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు.
తెలంగాణ టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు (టీసీసీ) పరీక్షల హాల్ టికెట్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
నేషనల్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ శ్రేష్ఠ 2026 ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే
నేషనల్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ శ్రేష్ఠ (నెట్స్) 2026 పరీక్ష ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను పొందుపరిచింది. శ్రేష్ఠ పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్, సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి ఫలితాలు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పెన్, పేపర్ ఆధారితంగా ఆఫ్‌లైన్ విధానంలో ఈ పరీక్ష డిసెంబర్ 21న దేశవ్యాప్తంగా మొత్తం 106 పరీక్షా కేంద్రాల్లో జరిగింది. ఇందులో వచ్చిన ర్యాంకు ఆధారంగా సీబీఎస్‌ఈ అనుబంధ ప్రైవేట్ విద్యా సంస్థల్లో తొమ్మిది, పదకొండు తరగతుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
కేంద్ర సామాజిక న్యాయ, సాధికార మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నేషనల్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ శ్రేష్ఠ- నెట్స్ 2026 పథకానికి సంబంధించి ఈ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. శ్రేష్ఠ పథకం ద్వారా ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన ఎస్సీ బాల బాలికలకు దేశవ్యాప్తంగా 3వేల సీట్లలో ప్రవేశాలు కల్పిస్తారు.
SHRESHTA (NETS)-2026 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్న విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




