Indrakeeladri: ఇంద్రకీలాద్రికి భవానీల తాకిడి.. అమ్మవారి దర్శనం కోసం బారులు తీరిన భక్తులు
ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ పుణ్య క్షేత్రం విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన కనక దుర్గమ్మ ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి. అయినప్పటికీ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. దుర్గమ్మ దర్శనం కోసం భవానీ మాల ధరించిన భక్తులతో సహా భారీ సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనం కోసం ఎదురుచూస్తున్నారు. క్యూ లైన్ లో భక్తులు భారీ సంఖ్యలో అమ్మవారి దర్శనం కోసం ఎదురుచూస్తున్నారు.

దసరా శరన్నవరాత్రి ఉత్సవాల వేడుకలు ముగిసినా భక్తుల సందడి తగ్గలేదు. నవరాత్రి వేడుకలు ముగిసినప్పటికీ.. అమ్మాలన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ కనక దుర్గ కొలువైన ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. ముఖ్యంగా దుర్గమ్మ దర్శనం కోసం భవానీ దీక్షను ధరించిన వారు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. దీంతో ఇంద్రకీలాద్రి కిక్కిరిసింది. భవానీ భక్తులు తమ కుటుంబాలతో కలిసి దర్శనం కోసం రావటంతో దేవస్థానం నిండిపోయింది. క్యూలైన్లు భక్తులతో కిటికిటలాడాయి. ఆలయ ప్రాంగణం అమ్మవారి స్మరణతో మారుమ్రోగుతోంది. మరోవైపు ఇంద్రకీలాద్రికి భవానీల తాకిడి ఆదివారం వరకూ ఉంటుందని అధికారుల అంచనా వేస్తున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన విధంగా సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు.
విజయవాడ దసరా సంబరాలకు ఈసారి రికార్డు స్థాయిలో భక్తులు తరలివచ్చారు. గతేడాది పది రోజుల్లో సుమారుగా 8లక్షల 94వేల మంది భక్తులు ఇంద్రకీలాద్రికి వచ్చారు. అటు భవానీ భక్తులను కూడా కలిపితే మొత్తంగా 12 లక్షల మంది వచ్చినట్లు అధికారుల అంచనా. అయితే ఈసారి మాత్రం నవరాత్రిలో మూలా నక్షత్రం రోజున వచ్చిన భక్తులే సుమారుగా లక్షా 95వేల మంది అమ్మవారిని దర్శించుకున్నారు.. మొత్తం దసరా ముగిసే సరికి భక్తుల సంఖ్య 15 లక్షలు దాటింది.. ఇక ఆదివారం రాత్రి వరకు 18 లక్షలు దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో దసరా వేడుకలు ముగిసినా భక్తుల సందడి తగ్గలేదని తెలుస్తోంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




